కుక్, స్టోక్స్ శతకాలు
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 429/6
లార్డ్స్: ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. కెప్టెన్ అలిస్టర్ కుక్ (327 బంతుల్లో 153 బ్యాటింగ్; 15 ఫోర్లు), బెన్ స్టోక్స్ (92 బంతుల్లో 101; 15 ఫోర్లు; 3 సిక్సర్లు) సెంచరీల మోత మోగించడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 118 ఓవర్లలో ఆరు వికెట్లకు 429 పరుగులు చేసింది. ప్రస్తుతం జట్టు 295 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు నేడు (సోమవారం) చివరి రోజు. క్రీజులో కుక్‌తో పాటు మొయిన్ అలీ (54 బంతుల్లో 19 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నాడు.