Ennore
-
ముఖంపై కత్తిపోట్లు.. ఆపై కట్టుకథ
కాల్ చేస్తే ఫోన్ బిజీ... సహనం నశించిన బాయ్ ఫ్రెండ్ ప్రేయసిని నిలదీశాడు. అయితే ఆమె ఇచ్చిన సమాధానం అతనికి చికాకు తెప్పించింది. అంతే.. తన వెంట తెచ్చుకన్న కత్తితో ప్రేయసి ముఖంపై గాయం చేశాడు. చివరకు పోలీసుల రంగ ప్రవేశంతో భయపడి కట్టుకథ చెప్పాడు. కానీ, తెలివిగా విషయాన్ని రాబట్టిన పోలీసులు చివరకు అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. సాక్షి, చెన్నై: ఎర్నవూర్‌కు చెందిన కవియరసన్ అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ యువతితో కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తరచూ పార్క్‌ల్లో, రైల్వే స్టేషన్లో ఇద్దరు కలియదిరిగేవారు. అయితే కొన్ని రోజులుగా కవియరసన్ ఫోన్ కాల్‌కు సదరు యువతి స్పందించటం లేదు. పైగా ఆమె ఫోన్ బిజీ వస్తుండటంతో అనుమానం పెంచుకున్నాడు. గురువారం సాయంత్రం ఎన్నోర్ రైల్వే స్టేషన్ వద్ద కలుసుకున్న ఆ ఇద్దరు ఈ విషయంపై వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సదరు యువకుడు తన బ్యాగ్ నుంచి కత్తి తీసి ఆ యువతి ముఖాన్ని గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావంతో యువతి రోదిస్తుంటే.. భయపడి ఆమెను బతిమాలటం మొదలుపెట్టాడు. ఆపై ఆస్ప్రతికి తీసుకెళ్తుండగా పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ వారిని గమనించి విషయం ఆరా తీసింది. భయంతో ఆ యువకుడు కట్టుకథ అల్లాడు. ‘దొంగలు తమపై దాడి చేశారని, తన ఫోన్ కూడా లాక్కుపోయారని’ పోలీసులకు తెలిపాడు. ప్రియుడ్ని జైలుకు పంపటం ఇష్టం లేని ఆ యువతి కూడా అదే జరిగిందని తెలిపింది. సరిగ్గా అదే సయమంలో కవియరసన్ ఫోన్ రింగ్ కావటంతో పోలీసులకు అనుమానం మొదలైంది. ఇద్దరినీ విడివిడిగా కూర్చోబెట్టి ప్రశ్నించిన పోలీసులకు అసలు విషయం అర్థమైంది. ఆపై యువకుడిని అదుపులోకి తీసుకుని, యువతికి ఫస్ట్ ఎయిడ్ చేయించారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
‘గర్ల్‌ఫ్రెండ్’ మోసం.. కానిస్టేబుల్ ప్రతీకారం
చెన్నై : ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయిని గాఢంగా ఇష్టపడ్డ ఓ కానిస్టేబుల్.. ఆమె ప్రేమ కోసం ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. కానీ అదొక ఫేక్ అకౌంట్అని తెలుసుకుని రగిలిపోయాడు. చివరికి.. అమ్మాయి పేరుతో మోసం చేసిన యువకుడిని అతికిరాతకంగా నరికి చంపించాడు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో తమిళనాడు పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఎన్నూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసిన కణ్ణన్ కుమార్(32)కు కొన్నాళ్ల కిందట ఫేస్బుక్లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. కొద్ది రోజుల్లోనే ప్రేమికులయ్యారు. పైగా కణ్ణన్ సొంత ఊరికి(వథిరాయిరుప్పుకి).. ఆ అమ్మాయి ఊరికి(పుదుపట్టికి) దూరం జస్ట్ 5 కిలోమీటర్లే. ప్రేయసిని కలవాలనే ఉత్సాహంతో మొన్న పొంగల్‌కి ఊరెళ్లిన కణ్ణన్‌కు నిరాశఎదురైంది. అంత దగ్గర ఉండికూడా కలవడానికి ఆమె నిరాకరించడంతో కణ్ణన్లో అనుమానం మొదలైంది. తనదైన పోలీస్ బుర్రతో ఆలోచించగా మోసపోయినట్లు నిర్ధారణఅయింది. దీంతో అతను డిప్రెషన్‌కులోనై, పురుగలమందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గొంతు మార్చి మస్కా : అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్ రన్చేసిన వ్యక్తి పేరు అయ్యనార్. ఎడ్యుకేషనల్ కోర్సు చదువుతోన్న అతను.. ఉద్దేశపూర్వకంగానే కణ్ణన్‌ను టార్గెట్ చేసి, పెద్ద మొత్తంలో డబ్బులు గుంజినట్లు తెలిసింది. ఫోన్ మాట్లాడినప్పుడు అమ్మాయిలాగా గొంతు మార్చి మస్కాకొట్టాడు. స్నేహితుల శపథం : ఆత్మహత్యాయత్నం తర్వాత ఆస్పత్రిలో కోలుకుంటున్న కణ్ణన్‌ను అతని స్నేహితులు కలుసుకున్నారు. జరిగిన కథంతా విని షాక్‌కు గురయ్యారు. కణ్ణన్ ప్రతీకారాన్ని తాము తీరుస్తామని శపథం చేశారు. పక్కా స్కెచ్ వేసి అయ్యనార్‌ను ఒకచోటికి రప్పించి కిరాతకంగా నరికి చంపారు. అజ్ఞాతంలోకి కణ్ణన్ : అయ్యనార్ హత్యకేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. విజయ్‌కుమార్, తజింగ్, తమిళరసన్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా విషయం మొత్తం కక్కేశారు. స్నేహితుడైన కణ్ణన్ కోసమే అయ్యనార్‌ను హత్యచేశామని ఒప్పుకున్నారు. దోస్తుల అరెస్టుల విషయం తెలుసుకున్న కణ్ణన్ అజ్ఞాతంలోకి జారుకున్నాడు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
తాళం పడింది!
► ‘థర్మల్’ కేంద్రంలో ఆగిన ఉత్పత్తి ► ఉద్యోగ, కార్మికుల్లో ఆందోళన ► ఏకమైన కార్మిక సంఘాలు సాక్షి, చెన్నై: ఎన్నూర్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి తాళం వేశారు. చడీ చప్పుడు కాకుండా ఆ కేంద్రాన్ని మూసి వేయడాన్ని ఉద్యోగ, కార్మికులు జీర్ణించుకోలేకున్నారు. తమకు ప్రత్యామ్నాయం కల్పించాలని ఆందోళన బాట పట్టారు. ఉత్తర చెన్నై ఎన్నూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించారు. తొలుత 60 మెగావాట్ల ఉత్పత్తితో మొదలై, క్రమంగా 450 మెగావాట్లకు సామర్థ్యన్ని పెంచారు. ఒకటి, రెండు యూనిట్ల ద్వారా తలా 60 మెగావాట్లు, మూడు, నాలుగు, ఐదు యూని ట్ల ద్వారా తలా 110 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి సాగుతూ వచ్చింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ కేవలం చెన్నై నగర, సరిహద్దులకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా 1030, పరోక్షంగా మూడు వందల మంది ఉద్యో గ కార్మికులు పనిచేస్తూ వస్తున్నారు. ఇటీవల ఈ కేంద్రం విస్తరణ పేరుతో పక్కనే కొత్తగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అన్నాడీఎంకే సర్కారు చర్యలు తీసుకుంది. 660 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఆ కేంద్రంలో తొలి యూనిట్ ఏర్పాటుకు తగ్గ పనులకు చర్యలు చేపట్టారు. ఈ పనులు ముగియడానికి మరో రెండేళ్లు పట్టడం ఖాయం. ఈ పరిస్థితుల్లో పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రస్తుత కేంద్రంలోని యూనిట్లు తరచూ మరమ్మతులకు గురవుతూ వచ్చారుు. ఒక దాని తర్వాత మరొకటి అన్నట్టుగా నాలుగు యూనిట్లు మరమ్మత్తులకు గురయ్యారుు. అదే సమయంలో అక్కడి యూనిట్ల కాల పరిమితి 40 సంవత్సరాలు మాత్రమేనని, అంతకు మించి ఆరు సంవత్సరాలు అధికంగానే అవి పనిచేయడం వలన మరమ్మతులకు గురవుతున్నదన్నట్టుగా అధికార వర్గాలు తేల్చారు. అలాగే, నేల బొగ్గు తరలింపు మరింత శ్రమగా మారి ఉండడంతో , అత్యాధునిక పరికరాల్ని రంగంలోకి దించి మరమ్మతులు చేరుుంచడం కష్టతరంగా అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాన్ని ఇక ముందుకు తీసుకెళ్లడం కన్నా, శాశ్వతంగా తాళం వేయడం మంచిదన్న నిర్ణయానికి ఇటీవల తమిళనాడు విద్యుత్‌బోర్డు వర్గాలు వచ్చారుు. ఇందుకు తగ్గ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. ఈ సమాచారంతో ఉద్యోగుల్లో ఆందోళన బయలు దేరింది. ఆ కేంద్రాన్ని రక్షించుకునేందుకు తీవ్రంగానే పోరాటా లు సాగించినా ఫలితం శూన్యం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో చడీచప్పు డు కాకుండా గురువారం ఆ కేంద్రానికి అధికారులు శాశ్వతంగా తాళం వేశారు. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల్లో ఆందోళన బయలు దేరింది. మొన్నటి వరకు ఒకటో యూనిట్ ద్వారా 60 మెగావాట్ల ఉత్పత్తి సాగుతూ వచ్చిం దని, ఉన్న నేలబొగ్గును అంతా ఖాళీ చేరుుంచి, హఠాత్తుగా మూసివేయడం ఎంత వరకు సమంజసమని కార్మిక సం ఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పనిలో పడ్డారుు. 46 ఏళ్లుగా సేవల్ని అందించిన ఆ కేంద్రాన్ని, పక్కనే నిర్మిస్తున్న మరో కేంద్రం కోసం మూసి వేయడం మంచి పద్ధతేనా..? అని సీఐటీయూ నేత వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చే స్తూ, పోరుబాట సాగించనున్నామన్నా రు. ఇక, గురువారం ఆ కేంద్రం వద్దకు చేరుకున్న ఉద్యోగ, కార్మికులు తాళం పడడంతో అక్కడే బైఠారుుంచి ఆందోళనకు దిగారు. ఇక, ఇక్కడి ఉద్యోగ, కార్మికులకు న్యాయం లక్ష్యంగా భారీ ఎత్తున నిరసనలు సాగించేందుకు పన్నెండు కార్మిక సంఘాలు ఏకమయ్యారుు.