చెన్నై : ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయిని గాఢంగా ఇష్టపడ్డ ఓ కానిస్టేబుల్.. ఆమె ప్రేమ కోసం ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. కానీ అదొక ఫేక్ అకౌంట్‌అని తెలుసుకుని రగిలిపోయాడు. చివరికి.. అమ్మాయి పేరుతో మోసం చేసిన యువకుడిని అతికిరాతకంగా నరికి చంపించాడు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో తమిళనాడు పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..
ఎన్నూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన కణ్ణన్ కుమార్(32)కు కొన్నాళ్ల కిందట ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. కొద్ది రోజుల్లోనే ప్రేమికులయ్యారు. పైగా కణ్ణన్ సొంత ఊరికి(వథిరాయిరుప్పుకి).. ఆ అమ్మాయి ఊరికి(పుదుపట్టికి) దూరం జస్ట్ 5 కిలోమీటర్లే. ప్రేయసిని కలవాలనే ఉత్సాహంతో మొన్న పొంగల్‌కి ఊరెళ్లిన కణ్ణన్‌కు నిరాశఎదురైంది. అంత దగ్గర ఉండికూడా కలవడానికి ఆమె నిరాకరించడంతో కణ్ణన్‌లో అనుమానం మొదలైంది. తనదైన పోలీస్ బుర్రతో ఆలోచించగా మోసపోయినట్లు నిర్ధారణఅయింది. దీంతో అతను డిప్రెషన్‌కులోనై, పురుగలమందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
గొంతు మార్చి మస్కా : అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్ రన్‌చేసిన వ్యక్తి పేరు అయ్యనార్. ఎడ్యుకేషనల్ కోర్సు చదువుతోన్న అతను.. ఉద్దేశపూర్వకంగానే కణ్ణన్‌ను టార్గెట్ చేసి, పెద్ద మొత్తంలో డబ్బులు గుంజినట్లు తెలిసింది. ఫోన్ మాట్లాడినప్పుడు అమ్మాయిలాగా గొంతు మార్చి మస్కాకొట్టాడు.
స్నేహితుల శపథం : ఆత్మహత్యాయత్నం తర్వాత ఆస్పత్రిలో కోలుకుంటున్న కణ్ణన్‌ను అతని స్నేహితులు కలుసుకున్నారు. జరిగిన కథంతా విని షాక్‌కు గురయ్యారు. కణ్ణన్ ప్రతీకారాన్ని తాము తీరుస్తామని శపథం చేశారు. పక్కా స్కెచ్ వేసి అయ్యనార్‌ను ఒకచోటికి రప్పించి కిరాతకంగా నరికి చంపారు.
అజ్ఞాతంలోకి కణ్ణన్ : అయ్యనార్ హత్యకేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. విజయ్‌కుమార్, తజింగ్, తమిళరసన్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా విషయం మొత్తం కక్కేశారు. స్నేహితుడైన కణ్ణన్ కోసమే అయ్యనార్‌ను హత్యచేశామని ఒప్పుకున్నారు. దోస్తుల అరెస్టుల విషయం తెలుసుకున్న కణ్ణన్ అజ్ఞాతంలోకి జారుకున్నాడు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment