అధికారుల విచారణ
ముప్పిరితోట(ఎలిగేడు): మండలంలో ముప్పిరితోటకు చెందిన ఎంపీటీసీ రామిడి వెంకట్రామ్‌రెడ్డికి రెండేళ్లక్రితం డ్రిప్ ఇరిగేషన్( బిందుసేద్యం పథకం) కింద 90శాతం సబ్సిడీపై రూ.3 లక్షలతో మంజూరు అయ్యింది. నిర్వాహకులు పరికరాలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చే స్తున్నారని లబ్ధిదారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మైక్రో ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు శనివారం విచారణ చేపట్టారు. తమకు డ్రిప్ పరికరాలు పూర్తిగా అమర్చకుండా కంపెనీ నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, డ్రిప్ సిస్టమ్ పనుల పూర్తయినట్లు ఫోటోలు తీసుకుని తమ సంతకాలను ఫోర్జరీచేసి బిల్లులను సైతం తీసుకున్నారనీ ఆరోపించారు. నిర్లక్ష్యం చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కంపనీవారితో పనులు చేయిస్తామని, ఫోర్జరీ సంతకాలు ఆరోపణలపై ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిచాల్సిందిగా అధికారులకు సూచిస్తామన్నారు.