ప్రతి పంచాయతీలో వాతావరణ సమాచార కేంద్రం
యూనివర్సిటీ క్యాంపస్: కరువు జిల్లాల్లో ప్రతి పంచాయతీలో వాతావరణ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీ విజయకుమార్ తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కరువు జిల్లాల్లో వాతావరణ సమాచారం రైతులకు అందించేందుకు వాతావరణ కేంద్రాలను త్వరలోనే ఏర్పాటుచేస్తునట్లు వెల్లడించారు.
అదేవిధంగా ప్రతి జిల్లాలో ఆగ్రో మెట్రాలజీ యూనిట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 11 నుంచి 14వతేదీ వరకు సుభాష్ పాలేకర్ అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. తిరుపతిలో జరిగే ఈ సదస్సుకు ఆరువేల మంది రైతులు హాజరుకానున్నట్లు తెలిపారు.