Equity investors
-
స్టాక్ మార్కెట్లో యంగ్ ఇన్వెస్టర్ల జోరు!
స్టాక్ మార్కెట్లో యంగ్ ఇన్వెస్టర్ల జోరు భారీగా పెరుగుతోంది. 20-30 ఏళ్ల వయసున్న ఇన్వెస్టర్లు డబ్బులు సంపాదించడానికి స్టాక్ మార్కెట్లే మంచిది అనే అభిప్రాయానికి ఎక్కువ వస్తున్నారు. అందుకే, ఈ మధ్య స్టాక్ మార్కెట్లు కూడా జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో రికార్డు స్థాయిలో కొత్త పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు, ప్రతి నెలా ఒక మిలియన్ కు పైగా కొత్త ఖాతాలు తెరుస్తున్నారు. మరీ ముఖ్యంగా, ఇటీవల ప్రతి రాష్ట్రం నుంచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది.బీఎస్ఈ విడుదల చేసిన డేటా ప్రకారం.. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచే కోటికి పైగా మొత్తం రిజిస్టర్డ్ పెట్టుబడిదారులు ఉన్నారు. మహారాష్ట్ర దాదాపు 1.9 కోట్ల రిజిస్టర్డ్ పెట్టుబడిదారులతో యునో హోదాను పొందింది. గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుత రిజిస్టర్డ్ పెట్టుబడిదారుల సంఖ్య 1.01 కోట్లుగా ఉంది. ఆ తర్వాత స్థానాలలో ఉత్తరప్రదేశ్(72.4 లక్షల రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లు), కర్ణాటక(52.5 లక్షలు), తమిళనాడు(49.7 లక్షలు) రాష్ట్రాలు ఉన్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, తెలంగాణ, బీహార్, కేరళ, పంజాబ్, ఒడిశా, అస్సాం, జార్ఖండ్ రాష్ట్రాలు 10 లక్షలకు పైగా రిజిస్టర్డ్ పెట్టుబడిదారులను కలిగి ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగ పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మహారాష్ట్ర పెట్టుబడిదారుల సంఖ్య 48 శాతం పెరిగింది. అలాగే గుజరాత్ 32 శాతం, ఉత్తరప్రదేశ్ 77 శాతం పెరుగుదలను నమోదు చేసింది. మధ్యప్రదేశ్ గత ఏడాదిలో నమోదైన పెట్టుబడిదారుల సంఖ్యతో పోలిస్తే రెట్టింపు అయ్యింది. వృద్ధి రేటు దాదాపు 104 శాతంగా ఉంది. బీహార్ కూడా 110 శాతం పెరుగుదలను నమోదు చేసింది. (చదవండి: ఈ దోసకాయ ఇంత ఖరీదు ఎందుకో తెలుసా..?) -
రాబడుల్లో మేటి పనితీరు
ఈక్విటీ ఇన్వెస్టర్లకు గడిచిన ఏడాది, రెండేళ్లు పరీక్షా కాలం వంటిది. ఎన్నో అనిశ్చితులు, ఆందోళనలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. సూచీల్లో పెరుగుదల ఉన్నా కానీ, రిటైల్ ఇన్వెస్టర్లు రాబడులు పొందిందీ లేదు. కొందరు నష్టాలు కూడా చవిచూశారు. మార్కెట్ అంతటా పెరుగుదల లేకపోవడమే దీనికి కారణం. కేవలం కొన్ని కంపెనీలే మార్కెట్ పెరుగుదలకు దోహదపడ్డాయి. అందుకే అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్ లీడర్లుగా ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం తెలివైన వ్యూహం అవుతుంది. కనుక భిన్న మార్కెట్ పరిస్థితుల్లో అద్భుత పనితీరు చూపించిన లార్జ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలనేది మా సూచన. యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విధానం యాక్సిస్ బ్లూచిప్ అన్నది లార్జ్‌క్యాప్ ఫండ్. మంచి వ్యాపార నాణ్యత కలిగిన లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. పోర్ట్‌ఫోలియో పరంగా వైవిధ్యాన్ని కూడా గమనించొచ్చు. 2016 నవంబర్ నుంచి ఈ పథకాన్ని శ్రేయాష్ దేవల్కర్ నిర్వహిస్తున్నారు. బోటమ్ అప్ విధానంలో స్టాక్స్‌ను, ఫండమెంటల్స్(వ్యాపార మూలాలు), వృద్ధి అవకాశాలు, ఆయా కంపెనీలకు పోటీ పరంగా ఉన్న అనుకూలతలు వంటి అంశాల ఆధారంగా ఈ పథకం పెట్టుబడుల కోసం ఎంపిక చేసుకుంటుంది. పథకం నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 80–100% వరకు అధిక నాణ్యత కలిగిన పెద్ద కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. లార్జ్‌క్యాప్ కంపెనీలు ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని స్తాయి. వ్యాపార కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉండడం, నిధుల వ్యయాలు తక్కువగా ఉండడం వల్ల ఆర్థిక మందగమన ప్రభావం వీటిపై తక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం ఫైనాన్షియల్, టెక్నాలజీ స్టాక్స్‌లో ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈ రెండు రంగాల స్టాక్స్‌లో వరుసగా 45%, 14% చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. రాబడుల పనితీరు ఈ పథకం నిర్వహణలో సెప్టెంబర్ నాటికి రూ.8,050 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రాబడులకు సంబంధించి మంచి చరిత్ర ఉంది. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షికంగా 15.95 శాతం రాబడులిచ్చింది. ఐదేళ్లలో.. వార్షిక పనితీరు 12.30%. కానీ, ఇదే కాలంలో పోటీ పథకాలు ఇచ్చిన రాబడులు మూడేళ్లలో 10.57%, ఐదేళ్లలో 9.26%గానే ఉన్నాయి. ఈ పథకం ప్రారంభం నాటి నుంచి ప్రతీ నెలా రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే 2019 సెప్టెంబర్30 నాటికి రూ.11.9 లక్షల సంపద సమకూరేది. ఇందులో అసలు పెట్టుబడి రూ.5.8 లక్షలు. ఈ పథకంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనీసం రూ.5,000 నుంచి..; సిప్ రూపంలో అయితే ప్రతీ నెలా కనీసం రూ.500 మొత్తంతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ రూపంలో కనీసం ఆరు నెలల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం, దీర్ఘకాలంలో సంపద సమకూర్చుకోవాలనుకునే వారు కనీసం ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
షేర్లకు ఎంత కేటాయించాలి..?
ఏయే రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకున్న తర్వాత తలెత్తే మరో ముఖ్యమైన ప్రశ్న ఈక్విటీలకు ఎంత కేటాయించాలన్నది. 2007లో మార్కెట్ గరిష్ట స్థాయిలో ఇన్వెస్ట్ చేసినవాళ్లలో చాలామంది ఇప్పుడు ఈక్విటీల్లో చాలా కొద్ది మొత్తంలోనే ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పడు గమనించాల్సిన వాటిల్లో కొన్ని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం. దీర్ఘకాలానికే: దీర్ఘకాలంలో సంపదను వృద్ధి చేసుకునే విధంగా షేర్లలో పెట్టుబడి పెట్టాలి. బ్యాలెన్స్డ్గా ఉండే ఇన్వెస్టర్లు ఈక్విటీలకు కనీసం 45 నుంచి 55 శాతం కేటాయించే విధంగా చూసుకోండి. ప్రస్తుతం చాలామంది పోర్ట్‌ఫోలియోలను పరిశీలిస్తే ఈక్విటీ వాటా 10 నుంచి 20 శాతంగా ఉంది. దీర్ఘకాలిక దృష్టితో ఈక్విటీల్లో పెట్టుబడులను క్రమేపీ పెంచుకోండి. రిస్క్-రివార్డ్ ప్రీమియం: ఈక్విటీ పెట్టుబడుల్లో రిస్క్-రివార్డ్ ప్రీమియం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఆర్థిక వృద్ధిరేటు తిరిగి గాడిలో పడుతున్నప్పుడు, బుల్ ర్యాలీ ప్రారంభంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వారికి రిస్క్ తక్కువగా ఉండి, రివార్డ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఇన్వెస్టర్లు పెట్టుబడులు ప్రారంభించినట్లు గత 2 నెలల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పెరుగుతున్న పెట్టుబడులే చూపుతున్నాయి. కాబట్టి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం.