ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కూతురు.. ఇది కూడా ఎగతాళేనా?
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్..గత ఏడాది జరిగిన 'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్'లో ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు సిరీస్ 8, ఎయిర్‌పాడ్స్ ప్రో, వాచీ ఎస్ఈ2 లను విడుదల చేసింది. ఈ సందర్భంగా యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ ఐఫోన్ 13తో పోలిస్తే కొత్త ఐఫోన్ 14 పెద్దగా అప్డేట్ ఏమీ లేదంటూ ఓ సెటైరికల్ మీమ్‌ను షేర్ చేశారు.
అయితే త్వరలో ఐఫోన్ 15 సిరీస్ విడుదల కానున్న తరుణంలో ఈవ్ జాబ్స్ ఐఫోన్ 14 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐఫోన్ 14 లేకుండా జీవించలేనని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు టెక్ వరల్డ్ చర్చనీయాంశంగా మారాయి.
ఐఫోన్ 14 లేకపోతే జీవించలేను
న్యూయార్స్ మ్యాగజైన్ ‘ది స్ట్రాటజిస్ట్’తో జరిగిన ఇంటర్వ్యూలో ఏ వస్తువులు మీ దగ్గర లేకపోతే జీవించలేరన్న ఇంటర్వ్యూర్ ప్రశ్నకు ఈవ్ జాబ్స్ స్పందించారు. తాను 9 వస్తువులు లేకపోతే జీవించలేనని ఆవేంటో చెప్పారు. వాటిల్లో ఐఫోన్ 14కూడా ఉంది.
నిజం చెబుతున్నారా?
దీంతో ఇంటర్వ్యూ చేసే యాంకర్ గతంలో ఐఫోన్ 14పై వేసిన సెటైర్ల గురించి ప్రస్తావించారు. అందుకు ఆమె ‘ఇది క్రియేటివ్స్ కోసం సృష్టించిన టూల్ అని, దాని డిజైన్ మాస్టర్ పీస్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. మనుషుల జీవన విధానాల్ని సమూలంగా మార్చిన ఐఫోన్ 14 జీనియస్ అని అన్నారు. కొందరు ఈ విషయంపై ఈవ్ జాబ్స్ నిజం చెబుతున్నారా? లేదంటే సెటైర్లు వేస్తున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ధరించిన చొక్కాలాంటిదే మరోటి కొనుక్కోవడం
సాధారణంగా యాపిల్ విడుదల చేసే ఐఫోన్లన్నీ దాదాపు ఒకే తరహాలో ఉంటాయి. టెక్నాలజీ పరంగా ఫోన్లలో మార్పులు చేస్తుందే తప్పా డిజైన్‌లో పెద్దగా మార్పులుండవు. ఈవ్ జాబ్స్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఐఫోన్ 14 విడుదల సమయాలో ఓ మీమ్‌ను నెటిజన్లతో పంచుకున్నారు. ‘ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 14కు మారడం అంటే ప్రస్తుతం ధరించిన చొక్కాలాంటిదే మరోటి కొనుక్కోవడం లాంటిది’ అని చెప్పే మీమ్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
గుర్రపుస్వారీలో నిష్టాతురాలు
స్టీవ్ జాబ్స్ నలుగురు పిల్లలలో ఈవ్ జాబ్స్ చిన్న. ఆమె స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్, సైన్స్, టెక్నాలజీలో ప్రావీణ్యం సంపాదించింది. మోడల్, గుర్రపుస్వారీలో నిష్టాతురాలు కూడా.
చదవండి👉 ‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్