EVP
-
ఇన్ఫోసిస్‌కు మరో టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా
ఇన్ఫోసిస్‌కు మరో టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా చేశారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో తన పదవి నుంచి తప్పుకొన్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజ్మెంట్ పర్సనల్ రిచర్డ్ లోబో కంపెనీ సేవలకు రాజీనామా చేసినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఇన్ఫోసిస్ తెలిపింది. రిచర్డ్ లోబో 22 సంవత్సరాలకు పైగా కంపెనీలో ఉన్నారు. ఆయన 2015 నుంచి 2023 వరకు కంపెనీలో హెచ్ఆర్ హెడ్‌గా పనిచేశారు. కంపెనీలో లోబో చివరి రోజు ఆగస్టు 31 అని ఫైలింగ్ తెలిపింది. ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్‌గా సుశాంత్ తరప్పన్ నియామకాన్ని ప్రకటించిన కొన్ని వారాల్లోనే ఈ పరిణామం జరిగింది. ఆ పదవిలో రిచర్డ్ లోబో ఆరేళ్లపాటు పనిచేశారు. తర్వాత ఆయన్ని నేరుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలీల్ పరేఖ్ ఆధ్వర్యంలో రిపోర్టింగ్ చేసే ప్రత్యేక బృందానికి మార్చారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన తరప్పన్ నాలుగేళ్లుగా ఇన్ఫోసిస్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ చొరవకు నేతృత్వం వహిస్తున్నారు. దీని ద్వారా టీమ్ డెవలప్మెంట్ కోసం వివిధ రకాల నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తారు. ఇక్కడ రాజీనామా చేసి అక్కడ సీఈవోలుగా.. ఇన్ఫోసిస్ టాప్ లెవల్లోని చాలా ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ నుంచి నిష్క్రమించి ఇతర కంపెనీలలో హెడ్లుగా మారారు. ప్రెసిడెంట్లు మోహిత్ జోషి, రవి కుమార్ ఇందుకు చక్కని ఉదాహరణ. వీరిద్దరూ ఆరు నెలల వ్యవధిలోనే కంపెనీకి రాజీనామా చేశారు. రవి కుమార్ కాగ్నిజెంట్ సీఈవో కాగా మోహిత్ జోషి టెక్ మహీంద్రా సీఈవోగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎలక్ట్రిక్ ట్రక్కు కంపెనీ ట్రెసా మోటర్స్ చైర్మన్‌గా వినోద్ దాసరి అలాగే అకౌంట్ ఎక్స్పాన్షన్ గ్లోబల్ హెడ్ చార్లెస్ సలామే సంగోమా టెక్నాలజీస్ కార్పొరేషన్‌కి సీఈవో అయ్యారు. అంతకుముందు గ్లోబల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, బిజినెస్ హెడ్ విశాల్ సాల్వి సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్విక్ హీల్‌కు సీఈవోగా నియమితులయ్యారు. -
హైదరాబాద్‌లో ఆర్బ్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
⇒ ఆర్బ్కామ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ⇒ ఈవీపీ క్రెయిగ్ మెలోన్ హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సొల్యూషన్స్ అంది స్తున్న ఆర్బ్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. సంస్థకు ఇది అతి పెద్ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్. ప్రస్తుతం 100 మంది దాకా పనిచేస్తున్నారు. వెబ్, మొబైల్ అప్లికేషన్ డెవలపర్లు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు ఈ కేంద్రం నుంచి పనిచేస్తారని ఆర్బ్కామ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఈవీపీ క్రెయిగ్ మెలోన్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశంలో లాజిస్టిక్స్ కంపెనీలకు సేవలను విస్తరిస్తామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ట్రాకింగ్ ఉపకరణాలను జర్మనీ, మెక్సికోలో తయారు చేస్తున్నట్టు వివరిం చారు. ప్రపంచ వ్యాప్తంగా ట్రక్కులు, నౌకలు, వాహనాలు, ఇతర పరిశ్రమల్లో 17.2 లక్షల ఐవోటీ ఉపకరణాలు బిగించామని తెలిపారు. వీటన్నిటినీ అనుసంధానిస్తూ కస్టమర్ కేర్ సేవలు అందిస్తున్న ఉత్తర అమెరికా టీమ్‌కు హైదరాబాద్ బృందం తోడ్పాటు అందిస్తుందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి పంజా వెల్లడించారు. ఐవోటీ కంపెనీలు తయారీ కేంద్రాలను నెలకొల్పితే ఐటీ సంస్థలకు ఇచ్చే ప్రయోజనాలను కల్పిస్తామని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.