Infosys EVP And Former HR Head Richard Lobo Has Resigned From His Position After 22 Year Stint - Sakshi
Sakshi News home page

Infosys EVP Richard Lobo Resigns: ఇన్ఫోసిస్‌కు మరో టాప్‌ లెవెల్‌ ఎగ్జిక్యూటివ్ రాజీనామా

Published Sat, Aug 5 2023 5:17 PM | Last Updated on Sat, Aug 5 2023 6:50 PM

Infosys EVP and former HR head Richard Lobo resigns - Sakshi

ఇన్ఫోసిస్‌కు మరో టాప్‌ లెవెల్‌ ఎగ్జిక్యూటివ్ రాజీనామా చేశారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో తన పదవి నుంచి తప్పుకొన్నారు.  ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజ్‌మెంట్ పర్సనల్ రిచర్డ్ లోబో కంపెనీ సేవలకు రాజీనామా చేసినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఇన్ఫోసిస్‌ తెలిపింది. రిచర్డ్‌ లోబో 22 సంవత్సరాలకు పైగా కంపెనీలో ఉన్నారు. ఆయన 2015 నుంచి 2023 వరకు కంపెనీలో హెచ్‌ఆర్‌ హెడ్‌గా పనిచేశారు. కంపెనీలో లోబో చివరి రోజు ఆగస్టు 31 అని ఫైలింగ్ తెలిపింది.

ఇన్ఫోసిస్ హెచ్‌ఆర్‌ హెడ్‌గా సుశాంత్ తరప్పన్‌ నియామకాన్ని ప్రకటించిన కొన్ని వారాల్లోనే ఈ పరిణామం జరిగింది. ఆ పదవిలో రిచర్డ్ లోబో ఆరేళ్లపాటు పనిచేశారు. తర్వాత ఆయన్ని నేరుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలీల్ పరేఖ్ ఆధ్వర్యంలో రిపోర్టింగ్ చేసే ప్రత్యేక బృందానికి మార్చారు.  సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన తరప్పన్  నాలుగేళ్లుగా ఇన్ఫోసిస్ లీడర్‌షిప్ ఇన్‌స్టిట్యూట్ చొరవకు నేతృత్వం వహిస్తున్నారు. దీని ద్వారా టీమ్ డెవలప్‌మెంట్ కోసం వివిధ రకాల నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు, సెమినార్‌లు, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తారు.

 

ఇక్కడ రాజీనామా చేసి అక్కడ సీఈవోలుగా..
ఇన్ఫోసిస్ టాప్ లెవల్‌లోని చాలా ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ నుంచి నిష్క్రమించి ఇతర కంపెనీలలో హెడ్‌లుగా మారారు. ప్రెసిడెంట్‌లు మోహిత్ జోషి, రవి కుమార్ ఇందుకు చక్కని ఉదాహరణ. వీరిద్దరూ ఆరు నెలల వ్యవధిలోనే కంపెనీకి రాజీనామా చేశారు. రవి కుమార్ కాగ్నిజెంట్ సీఈవో కాగా మోహిత్ జోషి టెక్ మహీంద్రా సీఈవోగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఎలక్ట్రిక్‌ ట్రక్కు కంపెనీ ట్రెసా మోటర్స్ చైర్మన్‌గా వినోద్‌ దాసరి 

అలాగే అకౌంట్ ఎక్స్‌పాన్షన్ గ్లోబల్ హెడ్ చార్లెస్ సలామే సంగోమా టెక్నాలజీస్ కార్పొరేషన్‌కి సీఈవో అయ్యారు. అంతకుముందు గ్లోబల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, బిజినెస్ హెడ్ విశాల్ సాల్వి సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్విక్ హీల్‌కు సీఈవోగా నియమితులయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement