Top executive
-
ఇన్ఫోసిస్‌కు మరో టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా
ఇన్ఫోసిస్‌కు మరో టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా చేశారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో తన పదవి నుంచి తప్పుకొన్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజ్మెంట్ పర్సనల్ రిచర్డ్ లోబో కంపెనీ సేవలకు రాజీనామా చేసినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఇన్ఫోసిస్ తెలిపింది. రిచర్డ్ లోబో 22 సంవత్సరాలకు పైగా కంపెనీలో ఉన్నారు. ఆయన 2015 నుంచి 2023 వరకు కంపెనీలో హెచ్ఆర్ హెడ్‌గా పనిచేశారు. కంపెనీలో లోబో చివరి రోజు ఆగస్టు 31 అని ఫైలింగ్ తెలిపింది. ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్‌గా సుశాంత్ తరప్పన్ నియామకాన్ని ప్రకటించిన కొన్ని వారాల్లోనే ఈ పరిణామం జరిగింది. ఆ పదవిలో రిచర్డ్ లోబో ఆరేళ్లపాటు పనిచేశారు. తర్వాత ఆయన్ని నేరుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలీల్ పరేఖ్ ఆధ్వర్యంలో రిపోర్టింగ్ చేసే ప్రత్యేక బృందానికి మార్చారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన తరప్పన్ నాలుగేళ్లుగా ఇన్ఫోసిస్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ చొరవకు నేతృత్వం వహిస్తున్నారు. దీని ద్వారా టీమ్ డెవలప్మెంట్ కోసం వివిధ రకాల నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తారు. ఇక్కడ రాజీనామా చేసి అక్కడ సీఈవోలుగా.. ఇన్ఫోసిస్ టాప్ లెవల్లోని చాలా ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ నుంచి నిష్క్రమించి ఇతర కంపెనీలలో హెడ్లుగా మారారు. ప్రెసిడెంట్లు మోహిత్ జోషి, రవి కుమార్ ఇందుకు చక్కని ఉదాహరణ. వీరిద్దరూ ఆరు నెలల వ్యవధిలోనే కంపెనీకి రాజీనామా చేశారు. రవి కుమార్ కాగ్నిజెంట్ సీఈవో కాగా మోహిత్ జోషి టెక్ మహీంద్రా సీఈవోగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎలక్ట్రిక్ ట్రక్కు కంపెనీ ట్రెసా మోటర్స్ చైర్మన్‌గా వినోద్ దాసరి అలాగే అకౌంట్ ఎక్స్పాన్షన్ గ్లోబల్ హెడ్ చార్లెస్ సలామే సంగోమా టెక్నాలజీస్ కార్పొరేషన్‌కి సీఈవో అయ్యారు. అంతకుముందు గ్లోబల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, బిజినెస్ హెడ్ విశాల్ సాల్వి సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్విక్ హీల్‌కు సీఈవోగా నియమితులయ్యారు. -
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో ఎదురుదెబ్బ!
సాక్షి,ముంబై:భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీలో కీలక ఎగ్జిక్యూటివ్‌ల వరుస రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ స్ట్రాటజీ ఆఫీసర్(CISO)ఉన్న విశాల్ సాల్వి ఇన్ఫోసిస్‌కు గుడ్ బై చెప్పారు.అంతేకాదు సైబర్ సెక్యూరిటీ సంస్థకు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు కూడా. (రూ. 2 వేల నోట్లు: ఆర్బీఐ కీలక ప్రకటన) ఈ రంగంలో 29 ఏళ్ల అనుభవం ఉన్న సాల్వి గత ఏడేళ్లుగా ఇన్ఫోసిస్‌కు CISOగా ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్విక్‌హీల్ కి నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ పరిశ్రమలో విశ్వసనీయ సంస్థగా ఉన్న క్విక్ హీల్ టీంకు నాయకత్వం వహించడం చాలా సంతోషకరమైన విషయమని విశాల్ ఒక ప్రకటనలో తెలిపారు.సైబర్ భద్రతను అందరికీ ప్రాథమిక హక్కుగా మార్చే భాగస్వామ్య లక్ష్యానికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నాన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అపారమైన అనుభవం ఉన్న సాల్వి ఇన్ఫోసిస్కంటే ముందు PwC, HDFC బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్, క్రాంప్టన్ గ్రీవ్స్ లాంటి సంస్థల్లో కీలక పాత్రల్లో పనిచేశారు. అలాగే క్విక్ హీల్ కైలాష్ కట్కర్ సీఎండీగా ఉంటారు.మరోవైపు కొత్త నాయకత్వ నియామకంపై కైలాష్ కట్కర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కస్టమర్ సెంట్రిసిటీ ఇన్నోవేషన్‌తో మా చోదక శక్తిగా, క్విక్ హీల్ వ్యక్తులు, సంస్థలు, దేశాలకు తమ భద్రతా సేవల్ని కొనసాగుతుయన్నారు. విశాల్ సాల్వితో కలిసి, దేశంలోని సైబర్ సెక్యూరిటీ ఎకోసిస్టమ్‌ని మార్చేందుకు గ్లోబల్ మ్యాప్‌లో తమ స్థానాన్ని పటిష్టం చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) కాగా ఈ మధ్య కాలంలో ఐటీ కంపెనీ నుంచి ఉన్నతాధికారి వైదొలగడం ఇదే తొలిసారి కాదు. జూన్ నెలలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మన్నేపల్లి నర్సింహారావు కూడా కంపెనీకి (టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు) రాజీనామా చేశారు. 20 ఏళ్ల క్రితం ఇన్ఫోసిస్‌లో చేరిన మన్నేపల్లి హైదరాబాద్ సెంటర్‌కి హెడ్‌గా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రెసిడెంట్ మోహిత్ జోషి ఇన్ఫోసిస్‌ను వీడి టెక్ మహీంద్రా సీఈవోగా నియమితులయ్యారు. అంతకుముందు ప్రెసిడెంట్ రవికుమార్ ఎస్ కాగ్నిజెంట్ సీఈవోగా చేరారు. ఇక ఇన్ఫోసిస్‌కు గుడ్‌బై చెప్పిన సుదీప్ సింగ్ ఇన్ఫోటెక్ సీఈవోగా చేరిన సంగతి తెలిసిందే. -
ఇన్ఫీకి మరో టాప్ ఎగ్జిక్యూటివ్ గుడ్ బై
సాక్షి,బెంగళూరు: దేశీయ రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్ అధికారి ఒకరు గుడ్ బై చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సంస్థకు సేవలందించిన టాప్ ఎగ్జిక్యూటివ్ సుదీప్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇన్ఫోసిస్ ఎనర్జీ, యుటిలిటీస్, రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్ సుదీప్ సింగ్ తాజాగా సంస్థను వీడారు. అయితే, సింగ్ నిష్క్రమణపై వ్యాఖ్యానించడానికి ఇన్ఫీ ప్రతినిధి నిరాకరించారు. కాగా గత సంవత్సరం జనవరిలో యూరోప్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ రాజేష్ కృష్ణమూర్తి, అక్టోబర్‌లో గ్లోబల్ హెడ్ కెన్ టూమ్స్, అంతకుముందు, కంపెనీ సీవోవోగా ఉన్న రంగనాథ్ ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
ఆయన్ను యాపిల్ లాగేసుకుందా?
న్యూఢిల్లీ: దేశంలో స్మార్ట్ ఫోన్ వ్యాపారంలో నువ్వానేనా అంటూ పోటీపడుతున్న దిగ్గజ టెక్ కంపెనీలు శాంసంగ్, యాపిల్ మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శాంసంగ్ కు చెందిన అతి ముఖ్యమైన ఉద్యోగి ఒకర్ని యాపిల్ తన వైపు లాక్కుంది. శాంసంగ్ లో మీడియా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగానికి ఉపాధ్యక్షుడు, మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న,రాజీవ్ మిశ్రాను యాపిల్ నియమించుకుంది. యాపిల్ ఇండియా మీడియా హెడ్ గా ఆయన్ను రిక్రూట్ చేసుకుంది. ఈ నియామకాన్ని మిశ్రా మీడియాకు బుధవారం ధృవీకరించారు. లోక్ సభ టీవీకి సీఈవోగా పనిచేసిన మిశ్రా , హిందూస్తాన్ టైమ్స్ గ్రూప్, స్టార్ TV, జీ టీవీ, రిలయన్స్ ఇన్ఫోకాం లిమిటెడ్, న్యూస్ 24 తదితర వివిధ జాతీయ ఛానల్స్ కు పనిచేసిన అపార అనుభవం ఉంది. దీంతోపాటు వివిధ మంత్రిత్వ, మీడియా సలహా విభాగాలకు నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు ఎలక్ట్రానిక్ మీడియా రేటింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఆద్యుడు మిశ్రా. కాగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి విచ్చేసిన సందర్భంగా చోటు చేసుకున్న ఈ మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ అమ్మకాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కంపెనీ సీఈవో వరుసగా చైనా, భారత్ లలో పర్యటిస్తున్నారు. తద్వారా పడిపోయిన తమ మార్కెట్ ను తిరిగి పునరుద్ధరించుకునే పనిలో పావులు కదుపుతున్నారు. -
ఇంటెల్ ఉద్యోగులకు భారత్ లో భరోసా
అమెరికాకు చెందిన చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ సంస్థ భారత్‌లో ఉద్యోగాల కోత విధించే అవకాశం లేదని ఆ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో, ఈ ఏడాది చివరికల్లా 1100 మందికి పైగా ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యోగుల కోత భారత్ లో ఉండే చాన్స్ లేదని, ఈ దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికే కంపెనీ కృషిచేస్తామని ప్రకటించారు. కంపెనీ అభివృద్ధికి భారత్ లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ఇక్కడ ఉద్యోగుల కోత విధించబోరని ఇంటెల్ సంస్థ కన్సూమర్ టెక్నికల్ మార్కెటింగ్ డైరెక్టర్ థైన్ క్రిట్జ్ తెలిపారు. భారత్ లో రిటైలర్ల వ్యాపారం, అవకాశాలు పెరుగుతున్న క్రమంలో కంపెనీ భారత్ లో పెట్టుబడులే పెడుతుందని చెప్పారు. -
డీఎల్‌ఎఫ్‌పై సెబీ మూడేళ్ల నిషేధం
ప్రమోటర్ కేపీ సింగ్,టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై కూడా * స్టాక్ మార్కెట్ కార్యకలాపాలకు చెక్ * ఐపీవోలో తప్పుడు సమాచార ఫలితం ముంబై: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌తోపాటు, ప్రమోటర్, చైర్మన్ కేపీ సింగ్ తదితర ఆరుగురు అత్యున్నత అధికారులపై నిషేధం వేటు పడింది. మూడేళ్లపాటు క్యాపిటల్ మార్కెట్లలో ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టడానికి వీలులేకుండా నిషేధిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీచేసింది. పబ్లిక్ ఆఫర్ సమయంలో ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించే విధంగా కంపెనీ అవకతవకల సమాచారాన్ని ప్రకటించడమే దీనికి కారణమని సెబీ జీవితకాల సభ్యులు రాజీవ్ అగర్వాల్ తెలిపారు. నిషేధానికి గురైన ఎగ్జిక్యూటివ్‌లలో కేపీ సింగ్ కుమారుడు రాజీవ్ సింగ్(డీఎల్ఎఫ్ వైస్‌చైర్మన్), కుమార్తె పియా సింగ్ (హోల్‌టైమ్ డెరైక్టర్) సహా టీసీ గోయల్(ఎండీ), కామేశ్వర్ స్వరూప్(అప్పటి సీఎఫ్‌వో), రమేష్ శంకా(అప్పటి ఈడీ, లీగల్) సైతం ఉన్నారు. సెబీ నిషేధంవల్ల వాటాల విక్రయం, కొనుగోలు, నిధుల సమీకరణ వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుండదు. ప్రమోటర్లకు కంపెనీలో దాదాపు 75% వాటా ఉంది. నిబంధనల ఉల్లంఘన...: వివరాల వెల్లడి, ఇన్వెస్టర్ల రక్షణ(డీఐపీ) మార్గదర్శకాలతోపాటు, మోసం, అవకతవకల కార్యకలాపాల నిరోధం(పీఎఫ్‌యూటీపీ) వంటి సెబీ నిబంధనలను డీఎల్ఎఫ్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఉల్లంఘించారని రాజీవ్ పేర్కొన్నారు. ఈ కేసులో జరిగిన నిబంధనల ఉల్లంఘన వల్ల సెక్యూరిటీల మార్కెట్ రక్షణ, విలువలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కిమ్సుక్ కృష్ణ సిన్హా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టు, సెబీకి సైతం కంపెనీపై ఫిర్యాదు చేయడంతో 2010లో సెబీ డీఎల్‌ఎఫ్‌పై దర్యాప్తు మొదలుపెట్టింది. 2007లో పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ వద్ద డీఎల్ఎఫ్ 2007 జనవరిలో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఆపై 2007 మే నెలలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 9,187 కోట్లను సమీకరించింది. స్టాక్ ఎక్స్ఛేం జీలలో జూలై 2007లో లిస్టయ్యింది. కాగా, ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో డీఎల్ఎఫ్ షేరు 3.7% పతనమై రూ. 147 వద్ద ముగిసింది. సెబీ నుంచి నోటీస్ అందుకున్నామని, ఈ అంశాన్ని న్యాయ సలహాదారులతో సమీక్షిస్తున్నామని డీఎల్ఎఫ్ బీఎస్ఈకి తెలిపింది. తాము ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని ఒక ప్రకటనలో పేర్కొంది.