సాక్షి,ముంబై:భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీలో కీలక ఎగ్జిక్యూటివ్‌ల వరుస రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ స్ట్రాటజీ ఆఫీసర్(CISO)ఉన్న విశాల్ సాల్వి ఇన్ఫోసిస్‌కు గుడ్ బై చెప్పారు.అంతేకాదు సైబర్ సెక్యూరిటీ సంస్థకు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు కూడా. (రూ. 2 వేల నోట్లు: ఆర్‌బీఐ కీలక ప్రకటన)
ఈ రంగంలో 29 ఏళ్ల అనుభవం ఉన్న సాల్వి గత ఏడేళ్లుగా ఇన్ఫోసిస్‌కు CISOగా ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్విక్‌హీల్ కి నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ పరిశ్రమలో విశ్వసనీయ సంస్థగా ఉన్న క్విక్ హీల్ టీంకు నాయకత్వం వహించడం చాలా సంతోషకరమైన విషయమని విశాల్ ఒక ప్రకటనలో తెలిపారు.సైబర్ భద్రతను అందరికీ ప్రాథమిక హక్కుగా మార్చే భాగస్వామ్య లక్ష్యానికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నాన్నారు.
సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అపారమైన అనుభవం ఉన్న సాల్వి ఇన్ఫోసిస్‌కంటే ముందు PwC, HDFC బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, డెవలప్‌మెంట్ క్రెడిట్ బ్యాంక్, క్రాంప్టన్ గ్రీవ్స్ లాంటి సంస్థల్లో కీలక పాత్రల్లో పనిచేశారు.
అలాగే క్విక్ హీల్ కైలాష్ కట్కర్ సీఎండీగా ఉంటారు.మరోవైపు కొత్త నాయకత్వ నియామకంపై కైలాష్ కట్కర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కస్టమర్ సెంట్రిసిటీ ఇన్నోవేషన్‌తో మా చోదక శక్తిగా, క్విక్ హీల్ వ్యక్తులు, సంస్థలు, దేశాలకు తమ భద్రతా సేవల్ని కొనసాగుతుయన్నారు. విశాల్ సాల్వితో కలిసి, దేశంలోని సైబర్ సెక్యూరిటీ ఎకోసిస్టమ్‌ని మార్చేందుకు గ్లోబల్ మ్యాప్‌లో తమ స్థానాన్ని పటిష్టం చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా)
కాగా ఈ మధ్య కాలంలో ఐటీ కంపెనీ నుంచి ఉన్నతాధికారి వైదొలగడం ఇదే తొలిసారి కాదు. జూన్ నెలలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మన్నేపల్లి నర్సింహారావు కూడా కంపెనీకి (టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు) రాజీనామా చేశారు. 20 ఏళ్ల క్రితం ఇన్ఫోసిస్‌లో చేరిన మన్నేపల్లి హైదరాబాద్ సెంటర్‌కి హెడ్‌గా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రెసిడెంట్ మోహిత్ జోషి ఇన్ఫోసిస్‌ను వీడి టెక్ మహీంద్రా సీఈవోగా నియమితులయ్యారు. అంతకుముందు ప్రెసిడెంట్ రవికుమార్ ఎస్ కాగ్నిజెంట్ సీఈవోగా చేరారు. ఇక ఇన్ఫోసిస్‌కు గుడ్‌బై చెప్పిన సుదీప్ సింగ్ ఇన్ఫోటెక్ సీఈవోగా చేరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment