Ex Armyman
-
Ex Army: దేశ సేవ చేశాం.. మమ్మల్ని పట్టించుకోండి
సాక్షి, కరీంనగర్: దేశ సేవ చేశాం.. సరిహద్దులో ప్రాణాలకు తెగించి, కాపలా కాశాం.. కానీ నేడు మా బతుకులను పట్టించుకునేవారే కరువయ్యారు.. జర మీరైనా నివేశన స్థలం కేటాయించండంటూ మాజీ సైనికులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం సీఎం కేసీఆర్ కరీంనగర్ కలెక్టరేట్‌కు రాగా ఎక్స్ సర్వీస్ మెన్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ నాయకులు ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు. పోలీసులు ససేమిరా అనడంతో రహదారిపై జెండాలతో ఆందోళన చేపట్టారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లోని సర్వే నంబర్ 556లో 641 ఓపెన్ హౌస్ ప్లాట్లను కేటాయించి, 2014లో నోటిఫికేషన్ జారీ చేశారని, సొసైటీ నాయకులు రావుల రంగా రెడ్డి, బిస్మిల్లాఖాన్, మల్లేశం, విజయారెడ్డి, ప్రియదర్శిని, ఖాసీంలు తెలిపారు. తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్‌కు రాజ్యసభ సభ్యుడు వి.లక్ష్మీకాంతారావు కూడా లేఖ రాశారని గుర్తు చేశారు. 2007లో తాము రూ.5 వేల చొప్పున చెల్లించామని పేర్కొన్నారు. 200 చదరపు గజాలకు గాను ఒక్కో చదరపు గజానికి రూ.2 వేల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించారని తెలిపారు. కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి, తమ సమస్య పరిష్కరించాలని కోరారు. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! -
తుపాకీతో రెచ్చిపోయిన మాజీ సైనికుడు
చండీగఢ్: పేస్‌బుక్‌లో మొదలైన గొడవ తీవ్రరూపం దాల్చి ఓ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది. పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. కిలా కవి సంతోష్ సింగ్ గ్రామంలో పరమ్‌జిత్ సింగ్ అనే వ్యక్తి మెడికల్ షాప్ నడుపుతున్నాడు. ఈక్రమంలో అతని దుకాణంలో డ్రగ్స్ అమ్ముతున్నారని జస్బీర్ సింగ్ అనే మాజీ సైనికుడు ఆరోపిస్తూ ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నాడు. తాము ఎలాంటి చట్టవ్యతిరేక పనులు చేయడం లేదని, డ్రగ్స్ అమ్ముతున్నారంటూ అసత్య ఆరోపణలు చేయొద్దని పరమ్‌జిత్ సింగ్ కొడుకు సుఖ్‌చైన్ సింగ్ పలుమార్లు విజ్ఞప్తి చేశాడు. అయినా, జస్బీర్ సింగ్ వినిపించుకోలేదు. మంగళవారం వారి దుకాణం వద్దకు చేరుకుని గొడవకు దిగాడు. ఇరు వర్గాలు పరస్పర దూషణలు చేసుకుంటున్న క్రమంలోనే సహనం కోల్పోయిన జస్బీర్ సింగ్ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దాంతో సుఖ్‌చైన్ సింగ్ (26) తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (ఫేస్బుక్లో ప్రేమ..) -
దేశానికి సేవ చేశాం.. పింఛన్ రాక అడుక్కుంటున్నాం..
సాక్షి, కడప : ఈమె పేరు పార్వతమ్మ.. కడప నగరం ఐటీఐ సర్కిల్ సమీపంలో నివాసముంటోంది. ఈమె భర్త మాజీ సైనికుడు. దాదాపు పదేళ్ల నుంచి మిలిటరీ పింఛన్ పెట్టించండి మహాప్రభో అంటూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. నడవడానికి కూడా ఆస్కారం లేని ఈ పండుటాకును మనవరాలు శారద మూడు చక్రాల సైకిల్లో కూర్చోబెట్టుకుని తోసుకుంటూ వస్తోంది. పింఛన్ రాకపోవడంతో బిచ్చం ఎత్తుకుని బతుకుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌కు చేరుకుని తన కష్టాన్ని ఏకరువు పెట్టుకుంది. . -
కన్నబిడ్డను పోలీసులు రేప్ చేశారని..!
న్యూఢిల్లీ: హర్యానా సచివాలయం ఎదుట బుధవారం ఉదయం దారుణం జరిగింది. ఓ మాజీ జవాన్ అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. తన మైనర్ బిడ్డపై సోనిపట్ పోలీసు అధికారులు తరచూ అత్యాచారం జరుపడంతో కలత చెందిన ఆ కన్నతండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన వద్ద లభించిన ఆత్మహత్య లేఖ ప్రకారం.. ఈ మాజీ సైనికుడు సోనిపట్ జిల్లా ఖర్‌ఖోడ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సిసానా గ్రామానికి చెందినవాడు. తన బలవన్మరణానికి భార్య, ఖర్‌ఖోడ్ పోలీసు స్టేషన్ పోలీసులు కారణమని ఆయన తన లేఖలో తెలిపాడు. పోలీసు అధికారులు తన ఇంటికి వచ్చి తన మైనర్ కూతురిపై అత్యాచారం జరిపేవారని ఆయన ఈ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటన గురించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.