కన్నబిడ్డను పోలీసులు రేప్ చేశారని..!
న్యూఢిల్లీ: హర్యానా సచివాలయం ఎదుట బుధవారం ఉదయం దారుణం జరిగింది. ఓ మాజీ జవాన్ అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. తన మైనర్ బిడ్డపై సోనిపట్ పోలీసు అధికారులు తరచూ అత్యాచారం జరుపడంతో కలత చెందిన ఆ కన్నతండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆయన వద్ద లభించిన ఆత్మహత్య లేఖ ప్రకారం.. ఈ మాజీ సైనికుడు సోనిపట్ జిల్లా ఖర్‌ఖోడ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సిసానా గ్రామానికి చెందినవాడు. తన బలవన్మరణానికి భార్య, ఖర్‌ఖోడ్ పోలీసు స్టేషన్ పోలీసులు కారణమని ఆయన తన లేఖలో తెలిపాడు. పోలీసు అధికారులు తన ఇంటికి వచ్చి తన మైనర్ కూతురిపై అత్యాచారం జరిపేవారని ఆయన ఈ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటన గురించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.