13 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. గర్భిణి అని తెలియడంతో ఆత్మహత్య.. | Karnataka: 50 Year Old Man Molested 13 Year Girl, Victim Commits Suicide | Sakshi
Sakshi News home page

13 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. గర్భిణి అని తెలియడంతో..

Published Sat, Dec 18 2021 5:20 PM | Last Updated on Sat, Dec 18 2021 5:23 PM

Karnataka: 50 Year Old Man Molested 13 Year Girl, Victim Commits Suicide - Sakshi

సాక్షి, బెంగళూరు: కామాంధుని చేతిలో అత్యాచారానికి గురైన బాలిక.. తాను గర్భవతి అని తెలియగానే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలో చోటుచేసుకుంది. కే ఆర్‌ పేట బూకనకెరె గ్రామానికి చెందిన కాశినింగెగౌడ కుమారుడు పరమేశ్‌ (52) పదమూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 10 రోజుల కడుపు నొప్పి రావడంతో వైద్యులకు చూపించారు. దీంతో బాలికరెండు నెలల గర్భిణి అని తేలింది. విషయం బయటకు పొక్కకుండా పరమేష్‌ ప్రయత్నాలు చేశాడు. మరోవైపు సదరు బాలిక ఈ నెల 16న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామీణ పోలీసులు నిందితుడు పరమేష్‌ను అరెస్ట్‌ చేసి పోక్సో చట్టం కింద కేసునమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement