minor daughter
-
కుమార్తె అంటే.. సొంత ఆస్తి కాదు!
న్యూఢిల్లీ: మైనర్‌గా ఉన్న తన కుమార్తెను పెళ్లి చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘కుమార్తె అంటే మీ ఇంట్లో వస్తువు కాదు. ఆమె పెళ్లికి అంగీకారం తెలపడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘పెళ్లి సమయానికి మీ కుమార్తె మైనర్ కాదు. ఆ పెళ్లి మీకు ఇష్టం లేనందున, వివాహమాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కేసు పెట్టారు. అతడిని జైలులో పెట్టే అధికారం మీకు లేదు. మీ కుమార్తె మీ సొంత ఆస్తి కాదు, ఆమె ఓ వస్తువు కాదు. ఆ పెళ్లికి ఆమోదం తెలపండి’అని సూచించింది. పెళ్లయిన సమయానికి తమ కుమార్తె మైనర్ అని తెలిపేందుకు తల్లిదండ్రులు చూపిన పుట్టిన తేదీ సర్టిఫికెట్ తదితరాల్లో తేడాలున్నాయని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తమ కుమార్తెను నిర్బంధించి, లైంగిక దాడి చేశాడంటూ మహిద్‌పూర్‌కు చెందిన పిటిషనర్ దంపతులు వేసిన కేసును ఆగస్ట్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ కొట్టివేసింది. ఆమె మేజరేననీ, ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుందని స్పష్టం చేసింది. -
Devananda: ఇలాంటి కూతురు ఉండాలి!
‘ఈ అమ్మాయిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ప్రతి తల్లిదండ్రులకు ఇలాంటి కూతురు ఉండాలి’ అని సాక్షాత్తు కేరళ హైకోర్టు 17 ఏళ్ల దేవనంద గురించి అంది. ఎందుకో చదవండి! కేరళలోని త్రిసూర్‌లో కాఫీ హోటల్ నడుపుకునే 48 ఏళ్ల ప్రతీష్‌కు నిన్న మొన్నటి దాకా జీవితం సాఫీగానే సాగింది. భార్య ధన్య, కూతురు దేవనంద, కొడుకు ఆదినాథ్... అందరిలాంటి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం. అయితే ఈ మధ్య కాలు వాపు తరచూ కనిపిస్తుండేసరికి డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షలు చేశాక డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు– లివర్ కేన్సర్. వైద్యం అంటూ లేదు... లివర్ ట్రాన్స్‌ప్లాంటేషనే శరణ్యం అని తేల్చి చెప్పారు. అది కూడా వెంటనే జరగాలని చెప్పారు. ఆ మధ్యతరగతి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కొచ్చిలోని రాజగిరి హాస్పిటల్ వారు మీరు డోనర్ని తెస్తే మేము ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం అని భరోసా ఇచ్చారు. కాని లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు డోనర్ దొరకడం అంత సులభం కాదు. దొరికినా సూట్ కావాలి. సమయం లేదు... మరి ఏం చెయ్యాలి? నేనే ఎందుకు ఇవ్వకూడదు అనుకుంది కూతురు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న దేవనంద తండ్రిని కోల్పోవడానికి సిద్ధంగా లేదు. మరో ఆలోచన చేయకుండా ఆస్పత్రి వర్గాల దగ్గరకు పోయి తనే లివర్‌లోని కొంత భాగం డొనేట్ చేయవచ్చా అని అడిగింది. చేయచ్చు గాని ‘ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ 1994’ ప్రకారం మైనర్లకు అనుమతి లేదని చెప్పారు. దేవనంద ఇంటర్నెట్ జల్లెడ పట్టింది. గతంలో ఇలాంటి కేసులో ఒక మైనర్‌కు ఆర్గాన్ డొనేట్ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చినట్టుగా చదివింది. అయితే ఆ మైనర్ నుంచి ఆర్గాన్ డొనేషన్ జరగలేదు. ఆ తీర్పు ఆధారంగా తాను హైకోర్టుకు వెళ్లాలని నిశ్చయించుకుంది. జడ్జి పూనుకొని హైకోర్టులో జస్టిస్ వి.జి.ఆరుణ్ సమక్షానికి ఈ కేసు వచ్చింది. ప్రత్యేకమైన కమిటీని వేసి ఆర్గాన్ యాక్ట్‌లో ఏదైనా మినహాయింపుతో దేవనంద తన తండ్రికి లివర్ ఇవ్వొచ్చోకూడదో సూచించమని ఆదేశించాడాయన. కమిటీ అధ్యయనం చేసి చిన్న వయసులో ఇవ్వడానికి ఏ మాత్రం వీలు లేదని, దేవనందను ఇందుకు అనుమతించ వద్దని తేల్చి చెప్పింది. కాని దేవనంద కమిటీ రిపోర్టును మళ్లీ సవాలు చేసి తండ్రిని కాపాడుకునే హక్కు తనకు ఉందని కోర్టుకు చెప్పింది. ‘నాన్నను కోల్పోతే మేము దిక్కులేని వాళ్లం అవుతాం’ అని చెప్పింది. జస్టిస్ వి.జి.అరుణ్ దేవనంద పట్టుదలను, తండ్రి కోసం ఆమె పడుతున్న ఆరాటాన్ని ఎంతో ప్రశంసించారు. ‘ఇలాంటి కూతురు అందరికీ ఉండాలి’ అన్నారు. ఈసారి మరో కమిటీని వేశారు. ఆ కమిటీ దేవనందకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వడంతో డిసెంబర్ 2022లో అనుమతి ఇస్తూ తీర్పు చెప్పారు. అన్ని విధాలా సిద్ధమయ్యి ఈ విషయం తెలిసి బంధువులు వారించినా దేవనంద వెనక్కు తగ్గలేదు. తండ్రికి ఆరోగ్యకరమైన లివర్ ఇవ్వడానికి జిమ్‌లో చేరింది. మంచి పోషకాహారం తీసుకుంది. తండ్రి కోసం ఫిబ్రవరి 9న ఆపరేషన్ బల్ల ఎక్కింది. పెద్ద వైద్యుల బృందం ఆధ్వర్యంలో తండ్రీకూతుళ్లకు సర్జరీ చేసి లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతం చేశారు. ఆపరేషన్ జరిగిన రాజగిరి హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ల బృందం దేవనందకు ఫ్యాన్స్ అయ్యా రు. తండ్రీ కూతుళ్లు డిశ్చార్జ్ అవుతుంటే అందరూ వచ్చి జ్ఞాపికతో వారిని సాగనంపారు. అంతేనా? దేవనంద పట్టుదల, ప్రేమను చూసి తండ్రి ఆపరేషన్ ఖర్చులను మాఫీ చేశారు. కూతురు ప్రేమ సాధించిన ఘన విజయంగా దీనిని అభివర్ణించవచ్చు. -
వరంగల్‌లో అమానుషం.. అన్నా అని పిలిచినా వదల్లేదు..
ఖిలా వరంగల్: తెలిసీ తెలియని వయసు.. దగ్గరలోనే ఇల్లు.. ఆ బాలికకు మాయమాటలు చెప్పిన ఇద్దరు అన్నదమ్ములు శారీరకంగా లొంగదీసుకున్నారు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన గురువారం వరంగల్‌లో వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం ప్రకారం.. బతుకుదెరువు కోసం ఇద్దరు కుమార్తెలతో కలసి దంపతులు వరంగల్‌కు వలస వచ్చారు. వెంకట్రామ జంక్షన్ సమీప కాలనీలోని బంధువుల ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వారి పెద్ద కుమార్తె పదో తరగతి, చిన్న కుమార్తె 8వ తరగతి చదువుతున్నారు. కాగా, దయానంద్ కాలనీకి చెందిన ఓ పాత ఫరి్నచర్ షాపు యాజమాని ఎండీ ఆయూబ్ అలీకి అజ్మత్ అలీ(26), అక్బర్ అలీ(22) అనే కుమారులు ఉన్నారు. వీరిద్దరూ పదో తరగతి చదివే బాలికపై కన్నేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ బాలికతో వీరికి పరిచయం ఏర్పడింది. బాలిక ఇద్దరినీ అన్నా అంటూ పిలిచేది. దీంతో వారి మధ్య చనువు ఏర్పడింది. కానీ అన్నదమ్ములు ఆ బాలికకు మాయమాటలు చెప్పి, ఒంటరిగా ఉన్నది చూసి ఇంట్లోకి రప్పించుకుని ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా ఆరునెలలుగా బాలికపై పలుమార్లు వేర్వేరుగా లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక ఇన్‌స్టాగ్రామ్‌కు వారు అసభ్యకరమైన మెసేజ్‌లు పోస్ట్ చేయడంతో ఇటీవల విషయం తండ్రికి తెలిసింది. తల్లిదండ్రులు కుమార్తెను నిలదీయడంతో అన్నదమ్ములు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. బాలిక తల్లి బుధవారం రాత్రి మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఎండీ అజ్మత్ అలీ, అక్బర్ అలీపై ఫిర్యాదు చేసింది. నిందితులిద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్ తెలిపారు. నిందితులిద్దరినీ పోలీసులు బుధవారం రాత్రే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై ఇన్స్పెక్టర్ను వివరణ కోరగా నిందితులు పరారీలోనే ఉన్నారని తెలిపారు. బాలికపై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడిన ఘటనను నిరసిస్తూ గురువారం బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. నిందితుల ఇంటిపై దాడి చేసి కిటికీ అద్దాలు, ఆవరణలోని ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో వెంకట్రామ జంక్షన్ నర్సంపేట రోడ్డుపై ధర్నా నిర్వహించారు. కాగా, వరంగల్ ఏసీపీ కల్కోట్లు గిరికుమార్ బాలికను, ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. -
కన్నతల్లి కర్కశం: ఐదేళ్లుగా కూతురిని హింసించి మరీ..
ఛీ.. ఛీ.. ఈ భూమ్మీద ఏ మహిళ కూడా ఇంతటి ఘోరానికి పాల్పడి ఉండదేమో!. కూతురు యుక్త వయసుకు రాగానే.. దుర్మార్గానికి తెర తీసింది ఇక్కడో కన్నతల్లి. కూతురిపై ప్రియుడితో అత్యాచారం చేయించడమే కాదు.. బలవంతంగా కూతురి నుంచి అండ సేకరణ చేపట్టి దొడ్డిదారిలో సరోగసీ(అద్దె గర్భం) కోసం అమ్మేసుకుంది. ఒకటికాదు.. రెండుకాదు.. ఐదేళ్లుగా ఈ ఘోరం జరుగుతూ వస్తోంది. తమిళనాడు ఈ రోడ్లో కన్నతల్లి చేసిన అక్రమ నిర్భంధ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ కన్నతల్లి తన కూతురి నుంచి బలవంతంగా అండ సేకరణ చేపట్టి.. అక్రమ సరోగసీ కోసం ఆస్పత్రులకు అమ్మేసుకుంది. పైగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతూ.. అతనితో కూతురిపైనే అత్యాచారం చేయిస్తూ వచ్చింది. తమిళనాడు ఈ రోడ్లో జరిగిన ఈ ఘోరంపై హైలెవల్ దర్యాప్తు కొనసాగుతోంది. మెడికల్ అండ్ రూరల్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టోరేట్ అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. జాయింట్ డైరెక్టర్ విశ్వనాథన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. సోమవారం స్టేట్ హోంలో ఉన్న బాధితురాలిని పరామర్శించి మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఈ రోడ్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలోని ఆస్పత్రుల్లో ఈ ఇల్లీగల్ సరోగసీ వ్యవహారం నడిచినట్లు అధికారులు నిర్దారణకు వచ్చారు. ఈ రోడ్‌కు చెందిన నిందితురాలు(33).. భర్తకు దూరంగా ఉంటోంది. బిడ్డను తనతో పాటే పెంచుకుంటోంది. ఈ క్రమంలో మరో వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కూతురు యుక్తవయస్సుకు రాగానే.. తన ప్రియుడి ద్వారానే అత్యాచారం చేయించింది. గత ఐదేళ్లుగా.. బాధితురాలిపై అత్యాచార పర్వం కొనసాగుతోంది. బాధితురాలి నుంచి అండాలను బలవంతంగా సేకరించి.. ఆస్పత్రులకు అమ్మేసుకుంటూ ఆ తల్లి, ఆమె ప్రియుడు, మధ్యవర్తి.. డబ్బులను పంచుకుంటూ వస్తున్నారు. అంతేకాదు.. కూతురి వయసును ఆధార్‌కార్డులో మార్పించేసి మరీ ఈ దందాకు పాల్పడుతూ వస్తున్నారు. జూన్ 1వ తేదీన వేధింపులు భరించలేక బాధితురాలు ఇంటి నుంచి పరారైంది. సేలంలోని తన స్కూల్ స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుని.. బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో యాక్ట్, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి తల్లి, ఆమె ప్రియుడు, మధ్యవర్తి, ఆధార్‌ను మార్పిడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతేకాదు అక్రమ సరోగసీకి పాల్పడిన ఆస్పత్రులపై, వైద్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది తమిళనాడు ప్రభుత్వ వైద్య శాఖ. -
నా కుమార్తె అబార్షన్‌కు అనుమతివ్వండి
సాక్షి, అమరావతి: ఓ యువకుడి మోసం వల్ల తన మైనర్ కుమార్తె గర్భం దాల్చిందని.. అబార్షన్‌కు అనుమతించాలని ఓ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు కారణమైన ఖలీద్‌పై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ ఉదంతంపై చింతలపూడి పోలీసులు నమోదు చేసిన కేసును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించాలని కోరారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ కోసం సింగిల్ జడ్జి వద్దకు పంపించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. తన కుమార్తెను కోర్టు ముందు హాజరుపరిచేందుకు ఆదేశాలివ్వడంతో పాటు పలు అభ్యర్థనలతో బాలిక తండ్రి, కుటుంబ స్నేహితురాలు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఇంతకుముందు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు సదరు బాలికను గురువారం కోర్టు ముందు హాజరుపరిచారు. తల్లిదండ్రులతో వెళ్లేందుకు బాలిక అంగీకరించడంతో.. ఆమెను తక్షణమే వారికి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. -
మైనర్ బాలిక రెండో పెళ్లి.. రక్షణ కావాలంటూ కోర్టు మెట్లెక్కింది
చత్తీస్‌గఢ్: సాధారణంగానే మైనర్ల వివాహం చట్ట విరుద్ధం, పైగా చెల్లదు కూడా. అలాంటిది ఓ మైనర్ బాలిక వివాహం చేసుకోవడమే గాక రక్షణ కావాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల బాలిక తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందున ఆమెకు వారి నుంచి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. బాలిక ఇంకా మైనర్ కాగా తనకు ఇది రెండో వివాహమని పిటిషన్లో పేర్కోవడం గమనార్హం. అయితే బాలిక పిటిషన్‌ను స్వీకరించిన పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో జస్టిస్ సుధీర్ మిట్టల్ ధర్మాసనం ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మైనార్టీ తీరకుండానే పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం. కాగా బాల్యవివాహాల నిషేధ చట్టం, 2006 లోని సెక్షన్ 12 కింద ఈ వివాహం చెల్లదు. ఇదీ గాక సదరు బాలిక తనకిది రెండో వివాహం అని పిటిషన్లో పేర్కొనడంపై విచారణ జరపాలని తెలుపుతూ తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ బాలికకు, వివాహం చేసుకున్న యువకుడికి ప్రభుత్వం రక్షణ కల్పించాలంటూ స్పష్టం చేసింది. బాలిక నివాసానికి సమీపంలోని నారి నికేతన్‌లో ఉంచి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే క్రమంలో ప్రభుత్వం పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలి. ఇరువురి తల్లిదండ్రులు, బంధువులను పిలిపించి వారి సమక్షంలోనే సదరు బాలికకు కౌన్సెలింగ్ ఇప్పించాలి. కౌన్సెలింగ్ తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నివేదిక రూపంలో జూలై 23 లేదా అంతకంటే ముందే హైకోర్టుకు అందజేయాలి' అని ధర్మాసనం తీర్పునిచ్చింది. మైనార్టీ తీరకుండానే రెండు సార్లు వివాహం చేసుకున్న సదరు బాలిక పిటిషన్‌పై హైకోర్టు తుది తీర్పుపై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చదవండి: గొడవతో మహానదిలో దూకిన దంపతులు.. అంతలోనే.. -
కూతురిని గొలుసుతో బంధించిన తండ్రి
లక్నో : తన కూతురు ఓ యువకుడితో చనువుగా ఉంటోందని అనుమానించిన తండ్రి బాలిక (17) కాళ్లకు ఇనుప గొలుసు కట్టి ఇంట్లో బంధించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో శనివారం చోటుచేసుకుంది. తన తండ్రి గత మూడు రోజులుగా ఇనుస గొలుసుతో కట్టేసి ఇంట్లో బంధించాడని సమీపంలో మీర్గంజ్ పోలీస్ స్టేషన్లో బాలిక ఫిర్యాదు చేసింది. తాను ఓ యువకుడితో స్నేహం చేస్తున్నాని, తన తల్లిదండ్రులు, సోదరులు కలిసి తన ఇంట్లో బంధించారని ఫిర్యాదులో పేర్కొంది. అర్థరాత్రి ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలో తప్పించుకుని వచ్చి పోలీస్‌లను ఆశ్రయించినట్లు తెలిపింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తండ్రిని శనివారం అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను అక్రమంగా నిర్భందించారని ఐపీసీ సెక్షన్ 342 ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలికను మహిళ కానిస్టేబుల్ సహాయంతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమె మేజర్ అయ్యే వరకు బాలిక సంరక్షణ కేంద్రంలో ఉంటుందని అధికారులు తెలిపారు. బాలిక ఆరోపణలపై కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని బరేలీ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ వెల్లడించారు. -
కీచక తండ్రిపై నిర్భయ కేసు
సత్తుపల్లి: కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కూతురిపై లైంగికదాడికి పాల్పడి కటకటాల పాలయ్యాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ సీఐ మేడిశెట్టి వెంకటనర్సయ్య కథనం ప్రకారం.. మండల çపరిధిలోని సదాశివునిపాలెం గ్రామానికి చెందిన ఓ కామాంధుడు మద్యం మత్తులో మైనర్ కూతురిపై లైంగికదాడికి పాల్పడడంతో తల్లి ప్రతిఘటించి పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. శనివారం తహసీల్దార్ దొడ్డా పుల్లయ్య, ఆర్ఐ విజయభాస్కర్, వీఆర్వో రామిశెట్టి శేఖర్ ద్వారా విచారణ చేయించారు. పోలీసులు కూడా గ్రామంలో విచారణ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భార్య ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
13 ఏళ్ల బాలిక...68 రోజులు ఉపవాసం చేసి..
-
కన్న తండ్రే కాటేశాడు
థానే: అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన కన్న కూతురినే చెరిపేశాడు ఓ మృగాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని భీవండిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే 45 ఏళ్ల వ్యక్తి, మైనర్ అయిన తన కూతురును గత 6 నెలలుగా రేప్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదని బెదిరింపులకు పాల్పడే వాడన్నారు. 11 ఏళ్ల బాలికపై తరచూ అఘాయిత్యానికి పాల్పడటంతో భరించలేక తండ్రి ఇంట్లో లేని సమయం చూసి తల్లికి జరిగిన విషయం తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. అతనికి ముగ్గురు భార్యలు ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతడి భార్యలు భీవండీ(బాధితురాలి తల్లి), ఔరంగబాద్, నాసిక్‌లలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
కూతురు రక్షణకై తెగించిన తండ్రి
బామర్: బలవంతంగా తన మైనర్ కూతురును ఓ 35 ఏళ్ల వ్యక్తికి కట్టబెట్టాలని చూసిన ఖాప్ పంచాయతీకి వ్యతిరేకంగా ఓ తండ్రి కోర్టు మెట్లెక్కాడు. ఖాప్ పంచాయతీ పెద్దలు చేసిన హెచ్చరికలు సైతం లెక్క చేయకుండా అతడు ఎంతో సాహసంతో కోర్టును ఆశ్రయించాడు. ఫలితంగా కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఘటనకు సంబంధించి మొత్తం 17మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని బామర్ జిల్లాలోగల గుంగా గ్రామంలో గనరాం ప్రజాపత్ అనే వ్యక్తికి ఓ మైనర్ కూతురు ఉంది. ఆమెను 35 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని బెదిరించడమే కాకుండా అలా చేయకుంటే రూ.25లక్షల ఫైన్ కట్టాలని, సామాజిక బహిష్కరణ ఎదుర్కోవాలని ఈ నెల 1న తీర్పు చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని గనరాం ధైర్యం ఇదే 6న కోర్టు మెట్లెక్కాడు. తనకు జరిగిన అన్యాయం కోర్టుకు పిటిషన్ రూపంలో వివరించాడు. గత ఏడాది కూడా లీలారాం అనే వ్యక్తికి తన కూతురును ఇవ్వాలని ఇబ్బందులు పెట్టారని కోర్టుకు వివరించాడు. దీంతో కోర్టు ఆ ఖాప్ పంచాయతీ పెద్దలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఖాప్ పంచాయతీల తీర్పులను ఉల్లంఘిస్తే సాంఘిక బహిష్కరణతోపాటు, రాళ్లతో కొట్టి చంపించడం, కాల్పిపారేయడంలాంటి వికృత చర్యలు చేస్తుంటారు. వీటన్నింటికీ భయపడకుండా ఆ ప్రాంతంలోని ఓ సగటు తండ్రి చేసింది గొప్ప సాహసమే. -
కన్నబిడ్డను పోలీసులు రేప్ చేశారని..!
న్యూఢిల్లీ: హర్యానా సచివాలయం ఎదుట బుధవారం ఉదయం దారుణం జరిగింది. ఓ మాజీ జవాన్ అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. తన మైనర్ బిడ్డపై సోనిపట్ పోలీసు అధికారులు తరచూ అత్యాచారం జరుపడంతో కలత చెందిన ఆ కన్నతండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన వద్ద లభించిన ఆత్మహత్య లేఖ ప్రకారం.. ఈ మాజీ సైనికుడు సోనిపట్ జిల్లా ఖర్‌ఖోడ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సిసానా గ్రామానికి చెందినవాడు. తన బలవన్మరణానికి భార్య, ఖర్‌ఖోడ్ పోలీసు స్టేషన్ పోలీసులు కారణమని ఆయన తన లేఖలో తెలిపాడు. పోలీసు అధికారులు తన ఇంటికి వచ్చి తన మైనర్ కూతురిపై అత్యాచారం జరిపేవారని ఆయన ఈ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటన గురించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
మైనర్ బాలికపై రెండేళ్లుగా కన్నతండ్రి అత్యాచారం
13 ఏళ్ల కన్న కూతురుని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడిన తండ్రిని నిన్న రాత్రి అరెస్ట్ చేసినట్లు థానే పోలీసులు ఆదివారం ఇక్కడ వెల్లడించారు. నిందితునిపై అత్యాచారం, కిడ్నాప్ తదితర కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అతడిని ఈ రోజు ఉదయం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, నవంబర్ 12 వరకు నిందితునికి రిమాండ్ విధించారని తెలిపారు. అక్టోబర్ 31న కూతురు తమకు ఫిర్యాదు చేసింది. దాంతో కన్న తండ్రిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన తండ్రి తనను కిడ్నాప్ చేసి, గత రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని తమ దర్యాప్తులో కుమార్తె వెల్లడించిందని తెలిపారు. తన కుమార్తె ఆచూకీ తెలియకపోవడానికి కారణం తన భర్తే అంటూ భార్య పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అరెస్ట్ చేశారు. భర్తను పోలీసులు తమదైన శైలీలో విచారించగా, కుమార్తె ఆచూకీ నోటి వెంట తన్నుకొచ్చింది. దాంతో పోలీసులు మైనర్ బాలికను పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ మైనర్ బాలికను పోలీసులు విచారించంగా, తన తండ్రే తనను కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కన్న తండ్రిపై పలు కేసులు నమోదు చేశారు. నిందితుని కుటుంబం కసరవాడవల్లి ప్రాంతంలోని సాయినాథ్ కాలనీలో నివాసం ఉంటుందని పోలీసులు తెలిపారు.