13 ఏళ్ల కన్న కూతురుని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడిన తండ్రిని నిన్న రాత్రి అరెస్ట్ చేసినట్లు థానే పోలీసులు ఆదివారం ఇక్కడ వెల్లడించారు. నిందితునిపై అత్యాచారం, కిడ్నాప్ తదితర కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అతడిని ఈ రోజు ఉదయం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, నవంబర్ 12 వరకు నిందితునికి రిమాండ్ విధించారని తెలిపారు. అక్టోబర్ 31న కూతురు తమకు ఫిర్యాదు చేసింది. దాంతో కన్న తండ్రిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన తండ్రి తనను కిడ్నాప్ చేసి, గత రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని తమ దర్యాప్తులో కుమార్తె వెల్లడించిందని తెలిపారు.
తన కుమార్తె ఆచూకీ తెలియకపోవడానికి కారణం తన భర్తే అంటూ భార్య పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అరెస్ట్ చేశారు. భర్తను పోలీసులు తమదైన శైలీలో విచారించగా, కుమార్తె ఆచూకీ నోటి వెంట తన్నుకొచ్చింది. దాంతో పోలీసులు మైనర్ బాలికను పోలీసు స్టేషన్కు తరలించారు. అక్కడ మైనర్ బాలికను పోలీసులు విచారించంగా, తన తండ్రే తనను కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కన్న తండ్రిపై పలు కేసులు నమోదు చేశారు. నిందితుని కుటుంబం కసరవాడవల్లి ప్రాంతంలోని సాయినాథ్ కాలనీలో నివాసం ఉంటుందని పోలీసులు తెలిపారు.