కన్న తండ్రే కాటేశాడు
థానే: అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన కన్న కూతురినే చెరిపేశాడు ఓ మృగాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని భీవండిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే 45 ఏళ్ల వ్యక్తి, మైనర్ అయిన తన కూతురును గత 6 నెలలుగా రేప్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదని బెదిరింపులకు పాల్పడే వాడన్నారు. 11 ఏళ్ల బాలికపై తరచూ అఘాయిత్యానికి పాల్పడటంతో భరించలేక తండ్రి ఇంట్లో లేని సమయం చూసి తల్లికి జరిగిన విషయం తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు.
అతనికి ముగ్గురు భార్యలు ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతడి భార్యలు భీవండీ(బాధితురాలి తల్లి), ఔరంగబాద్, నాసిక్లలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.