Excellent
-
Viral Video: టాలెంట్ ఎవడి సొత్తు కాదు.. వినూత్న డ్రమ్స్ తో అదరగొట్టేశాడు
-
చిన్నారి అసాధారణ ప్రతిభ.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే
పలమనేరు: పట్టుమని రెండున్నరేళ్లు కూడా లేని చిన్నారి అద్భుతమైన జ్ఞాపకశక్తితో వేలాది వస్తువుల పేర్లు, జంతువులు, మానవదేహంలోని భాగాలు.. ఇట్టే గుర్తించి వాటి పేర్లను టుక్కున చెబుతూ దేశంలోని ప్రధాన రికార్డుబుక్కుల్లో ఒకటైన ఓఎంజీ(ఓ మై గాడ్ బుక్ ఆఫ్ ఇండియా)లో ఇండియన్ యంగెస్ట్ టాలెంటెడ్ గర్ల్‌గా రికార్డు సృష్టించింది. పలమనేరులో నివాసం ఉండే అమరనాథ్, హిమబిందు కుమార్తె వేద ఇవాంజెల్ అసాధారణ ప్రతిభ చూసిన వారు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చదవండి: ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా గుర్రంపైనే.. చిన్నారి ప్రతిభను చూసి.. 9 నెలల వయసు నుంచే చిన్నారి జ్ఞాపకశక్తిని గుర్తించిన తల్లి హిమబిందు తగు శిక్షణ ఇచ్చింది. గతనెల 13న చిన్నారి టాలెంట్‌కు సంబంధించిన వీడియోలతో ఓఎంజీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై వారు లైవ్‌లో పరీక్షించిన జడ్జిలు ఇటీవలే ఇండియన్ యంగెస్ట్ టాలెంటెడ్ గర్ల్‌గా రికార్డులోకి ఎక్కించి వారి అధికారిక వెబ్సైట్లో ఫలితాలను ప్రకటించారు. రెండ్రోజుల క్రితం ముంబై నుంచి వేద ఇవాంజెల్కు కొరియర్లో ఓఎంజీ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ కమ్ సీఈఓ డా.దినేష్ కే గుప్త నుంచి మెడల్, షీల్డ్ అందాయి. చదవండి: నాడు ఫిరంగులకు..నేడు పకోడీలకు ప్రసిద్ధి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లక్ష్యం.. తమ చిన్నారి టాలెంట్‌ను చూపి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం కోసం ప్రయత్నిస్తున్నట్లు తల్లిదండ్రులు అమరనాథ్, హిమబిందు తెలిపారు. అయితే గిన్నీస్‌బుక్‌లోకి ఎక్కాలంటే అంతకుముందు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ తదితరాల్లో రికార్డులలోకి ఎక్కాల్సి ఉంటుదన్నారు. వాటి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాగా బాలిక తండ్రి బెంగళూరు సెయింట్‌జాన్స్ ఆస్పత్రి ప్రాజెక్టులో ఫీల్డ్ ఆఫీసర్‌గా, తల్లి గృహిణిగా ఉంటున్నారు. జాతీయస్థాయిలో పలమనేరుకు పేరు తెచ్చిపెట్టిన ఆ చిన్నారిని పట్టణవాసులు అభినందిస్తున్నారు. -
గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ : తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులకు అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లోనూ మినీ స్టేడియంలు నిర్మించి, ప్రత్యేక నిపుణుల ద్వారా శిక్షణలు ఇస్తున్నామన్నారు. శుక్రవారం బాన్సువాడలోని కమ్యూనిటీ సెంటర్ వద్ద రూ. 2.65 కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు శిక్షణ పొందేందుకు స్టేడియంలు ఉపకరిస్తాయన్నారు. బాన్సువాడలో దశాబ్దాలుగా మినీ స్టేడియం నిర్మించాలనే డిమాండ్ ఉందని, నిధులు మంజూరైనా, సరైన స్థలం లభించక ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం లభించిన స్థలం పట్టణ నడిబొడ్డులో ఉందని, దీనిని అందరూ చక్కగా వినియోగించుకోవాలన్నారు. ఈ స్టేడియంలో టెన్నిస్, షటిల్ కోసం ఇండోర్ స్టేడియం, ఔట్‌డోర్ టెన్నిస్ కోర్టు, బాస్కెట్‌బాల్ కోర్టు, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో కీడ్రలు ఆడేవిధంగా నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే స్టేడియం చుట్టూ వాకింగ్ కోసం ర్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు 14 మడిగెలను నిర్మించి షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్సీల కోసం బాన్సువాడలో రెసిడెన్షియల్ స్కూల్ కోసం రూ. 4.20 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. బాన్సువాడలో రూ. 1.75 కోట్లతో పోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టల్, గిరిజనుల కోసమే యూత్ ట్రైనింగ్ సెంటర్ మంజూరైందని, దీని కోసం రూ. 4.60 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్డీఏ అశోక్‌కుమార్, సర్పంచ్ వాణివిఠల్, జెడ్పీటీసీ సభ్యుడు జంగం విజయగంగాధర్, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యుడు అలీముద్దీన్ బాబా, ఏఎంసీ చైర్మన్ నార్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.