Executive Lounge
-
ఆగ్రా రైల్వేస్టేషన్లో టాయ్‌లెట్ చార్జీ రూ.112
ఆగ్రా: రైల్వేస్టేషన్లో టాయ్‌లెట్ వాడుకుంటే ఎంత చెల్లిస్తాం? ఉచితం కాకుంటే గనక ఏ ఐదు రూపాయలో, 10 రూపాయలో. కానీ ఇద్దరు బ్రిటిష్ పర్యాటకులు మాత్రం ఏకంగా రూ.112 చొప్పున చెల్లించుకోవాల్సి వచ్చింది! వారిద్దరూ ఢిల్లీలోని బ్రిటిష్ ఎంబసీ నుంచి ఆగ్రా వెళ్లారు. రైల్వేస్టేషన్లో శ్రీవాత్సవ అనే గైడ్ వారిని రిసీవ్ చేసుకున్నాడు. టాయ్‌లెట్‌కు వెళ్లాలని చెప్పడంతో ఐఆర్సీటీసీ ఎగ్జిక్యూటివ్ లాంజ్‌కు తీసుకెళ్లాడు. బయటికి రాగానే 12 శాతం జీఎస్టీతో కలిపి చెరో రూ.112 రూపాయలు చెల్లించాలని వారిని సిబ్బంది డిమాండ్ చేశారట. ఇదేమిటని ప్రశ్నించినా లాభం లేకపోయిందని, దాంతో ఆ మొత్తాన్ని తానే చెల్లించానని గైడ్ చెప్పుకొచ్చాడు. దీనిపై ఆయన ఐఆర్సీటీసీకి ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది లాంజ్ సేవల చార్జే తప్ప టాయ్‌లెట్‌కు వెళ్లినందుకు వసూలు చేసింది కాదని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. ‘‘లాంజ్ సేవలు వాడుకుంటే కనీస చార్జీ రూ.200. రెండు గంటల పాటు ఏసీ లాంజ్ రూము, కాంప్లిమెంటరీ కాఫీ, ఉచిత వైఫై వంటి సదుపాయాలకు కలిపి ఈ చార్జీ. 50 శాతం డిస్కౌంట్ పోను 12 శాతం జీఎస్టీతో కలిపి రూ.112 చెల్లించాల్సి ఉంటుంది’’ అని వివరించింది. -
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ప్రపంచ స్థాయి ఎగ్జిక్యూటివ్ లాంజ్
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో కొత్త ప్రపంచ స్థాయి ఎగ్జిక్యూటివ్ లాంజ్ త్వరలో ప్రారంభించనున్నట్లు ఒక అధికారి మీడియకు వెల్లడించారు. "రైల్వే ప్రయాణీకులు కోసం సౌకర్యవంతమైన సేవలు అందించడం కోసం ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఐఆర్సీటీసీ నిర్మించినట్లు" అధికారి తెలిపారు. " ఈ లాంజ్ ప్రపంచ స్థాయి సదుపాయాలతో రూపొందించినట్లు" అని ఆయన తెలిపారు. ఈ కొత్త లాంజ్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం నంబర్ 1 మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు.(చదవండి: సామాన్యులకు భారీ షాక్.. మరింత పెరగనున్న గ్యాస్ ధరలు) "ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ లాంజ్ లో సందర్శకులకు సంగీతం, వై-ఫై, టీవీ, రైలు సమాచార ప్రదర్శన, పానీయాలు, చాలా రకాల బఫెట్లు వంటివీ ఇందులో అందించనున్నారు" అని అధికారి తెలిపారు. ఇందులో ప్రవేశించడం కోసం ప్రయాణీకులు ప్రవేశ రుసుముగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే తర్వాత ప్రతి గంటకు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. ఇది 24 గంటలు పనిచేస్తుంది. దీనిలో వై-ఫై ఇంటర్నెట్ ఫెసిలిటీ, పుస్తకాలు, మ్యాగజైన్ల రిటైలింగ్, కాంప్లిమెంటరీ టీ, కాఫీ పానీయాలు వంటి అనేక సేవలు ఉంటాయి. ఇక శాఖాహార భోజనం కోసం రూ.250, మాంసాహార భోజనం కోసం రూ.385 చెల్లించాలి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఐఆర్సీటీసీ ఏర్పాటు చేసిన రెండవ ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఇది. మొదటిది ఇప్పటికే ప్లాట్ ఫారం నెంబరు 16 వద్ద గ్రౌండ్ ఫ్లోర్ లో 2016 నుంచి అమలులో ఉంది. ఇతర రాష్ట్రాల రాజధానులలో ఇలాంటి లాంజ్ ఏర్పాటు చేయనున్నారు. -
రైల్వే సేవలు మరింత ‘స్మార్ట్’
- త్వరలో అధునాతన ఎగ్జిక్యూటివ్ లాంజ్ నిర్మాణం - జ్ఞానాపురం వైపు స్థలాన్ని గుర్తించిన రైల్వే - ప్రయాణికులకు ఎంతో హాయి విశాఖపట్నం సిటీ : రైళ్ల కోసం ఇక ఉసూరుమని నిరీక్షించాల్సిన పనిలేదు. ఏ రైలు ఎక్కడుందో తెలుసుకునేందుకు విచారణ కార్యాలయం వరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. తమ కార్యాలయానికి అవరమైన సమాచారం ఇచ్చేందుకు రైల్వేస్టేషన్ నుంచి నెట్ సెంటర్‌కు పరుగులు తీయనక్కరలేదు. మీరు కూర్చున్నచోటే ఎంచక్కా ఆన్లైన్ పనులన్నీ చేసేయొచ్చు. అదెలా అంటారా! విశాఖ రైల్వేస్టేషన్లో ఇలాంటి అనేక సదుపాయాలుండే అధునాతన ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ను భారతీయ రైల్వే త్వరలో ఏర్పాటు చేయనుంది. మూడేళ్ల కిందటే ఈ ప్రాజెక్టును విశాఖ స్టేషన్‌కు కేటాయించినా ఆచరణలో ఎలాంటి పురోగతి లేదు. ఈ ప్రాజెక్టును దాదాపుగా అంతా మరిచిపోతున్న తరుణంలో భారతీయ రైల్వే మరొకసారి ఈ ప్రాజెక్టు ఆశలు సజీవంగా ఉన్నట్టు ప్రకటించి రైల్వే ప్రయాణికుల్లో ఆశలు రేపింది. జ్ఞానాపురం వైపు ఖాళీగా వున్న రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ అధునాతన లాంజ్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలోనే ఈ ప్రాజెక్టు అమలుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న వాల్తేరు రైల్వే ఈసారి మరింత వేగంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించనుంది. వచ్చే ఏడాది నుంచి పనులు ప్రారంభించవచ్చని రైల్వే వర్గాల అంచనా. తక్కువ ధరకే ఎక్కువ సదుపాయాలు కల్పించాలన్నది లక్ష్యం. లాంజ్ నిర్మాణం, సదుపాయాల కల్పనను ఐఆర్సీటీసీ చేపట్టనుంది. లాంజ్‌లో ఏమేం ఉంటాయంటే..! మూడు నాలుగు అంతస్తుల్లో అధునాతన ఎగ్జిక్యూటివ్ లాంజ్ నిర్మాణం. ఈ మొత్తం భవన పరిసరాల్లో వైఫై ఉచితం ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన ఏసీ గదులు లైవ్ టీవీ కార్యక్రమాల ద్వారా ప్రయాణికులకు వినోదం టీవీల ద్వారా ఎప్పటికప్పుడు వార్తల అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్‌ల ప్రచారం ప్రయాణికులకు నచ్చే నోరూరించే అన్ని ప్రాంతాల వంటకాలతో అధునాతన రెస్టారెంట్ దూర ప్రాంత ప్రయాణికులకు ఆన్లైన్లో వసతి, పర్యాటక ఏర్పాట్ల బుకింగ్ సదుపాయం ఠిరైల్వే సమాచారాన్ని తెలుసుకునేందుకు అక్కడికక్కడే ఆన్లైన్ ఏర్పాట్లు సమాచార సదుపాయాలతో ఏయే రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవచ్చు.