exhibit
-
స్త్రీ శక్తి: లండన్ మ్యూజియానికి పింక్ శారీ!
ఎగరడానికి రెక్కలు సవరించిన కాలం అది. ‘పోనీలే’ అని రాజీపడే జీవులు సమరశంఖం కోసం గొంతు సవరించిన కాలం అది. ‘గులాబీ గ్యాంగ్’ అంటే పోరాట చరిత్ర. ఇప్పుడు ఆ చరిత్ర లండన్ మ్యూజియానికి చేరనుంది. ప్రపంచంలోని ప్రఖ్యాత మ్యూజియంలలో లండన్ ‘డిజైన్ మ్యూజియం’ ఒకటి. ప్రపంచ నలుమూలలకు సంబంధించి భిన్నమైన డిజైన్లకు ఇదో వేదిక. ఈ వేదికపై స్త్రీ శక్తిని ప్రతిఫలించే, ప్రతీకగా నిలిచే గులాబీ రంగు చీర సగర్వంగా రెపరెపలాడనుంది. 2006లో.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాలో ఏ కొద్దిమందో మహిళలలో తప్ప ఎవరూ ప్రశాంతంగా లేరు. పట్టపగలు రోడ్డు మీదికి వెళ్లాలన్నా భయపడే రోజులు. మరోవైపు కట్నపు వేధింపులు, గృహహింస! అలాంటి సమయంలో ‘మనం ఏం చేయలేమా!’ అనే నిస్సహాయతలో నుంచి పుట్టుకు వచ్చిందే గులాబీ గ్యాంగ్! ‘నువ్వు నేను కాదు... మనం’ అనే నినాదంతో బృందంగా ముందుకు కదిలారు. పింక్ శారీని యూనిఫామ్‌గా చేసుకున్నారు. ఈ బృందానికి సంపత్‌పాల్‌దేవి నాయకత్వం వహించింది. పదుల సంఖ్యతో మొదలైన గులాబీ గ్యాంగ్‌లో ఇప్పుడు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది సభ్యులు ఉన్నారు. తాజాగా... లండన్ ‘డిజైన్ మ్యూజియం’ క్యూరేటర్ ప్రియా ఖాన్చందాని నుంచి సంపత్పాల్దేవికి ఇమెయిల్ వచ్చింది. అందులో ఉన్న విషయం సంక్షిప్తంగా...‘ప్రియమైన గులాబీ గ్యాంగ్ సభ్యులకు, మీ ధైర్యసాహసాలకు సంబం«ధించిన వార్తలను ఎప్పటికప్పుడు చదువుతూనే ఉన్నాను. నాకు అవి ఎంతో ఉత్తేజాన్ని, బలాన్ని ఇస్తుంటాయి. మీ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే గులాబీ రంగు చీరను ఆఫ్‌బీట్ శారీ టైటిల్‌తో మ్యూజియంలో ప్రదర్శించాలనుకుంటున్నాం. ఈ అవకాశాన్ని గర్వంగా భావిస్తున్నాము’ ‘మా పోరాట స్ఫూర్తి విదేశీగడ్డపై అడుగు పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. మా సభ్యులలో ఒకరు ధరించిన చీరను పంపబోతున్నాం’ అంటుంది సంపత్‌పాల్‌దేవి. -
చైనా కరోనా స్వదేశీ వ్యాక్సిన్ల ప్రదర్శన
బీజింగ్: కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి వివిధ దేశాలు పోటీ పడుతున్న సమయంలో, చైనా తన తొలి వ్యాక్సిన్లను ప్రదర్శనకు పెట్టింది. బీజింగ్ లో నిర్వహిస్తున్న ట్రేడ్ ఫెయిర్‌లో సోమవారం స్వదేశీ వ్యాక్సిన్లను తొలిసారి ప్రదర్శించింది. దశ-3 ట్రయల్స్‌లో ప్రవేశించిన ప్రపంచవ్యాప్తంగా దాదాపు10 వ్యాక్సిన్లలో ఇవి కూడా ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి ఇవి మార్కెట్లో రానున్నాయని తయారీదారుల అంచనా. చైనా కంపెనీలైన సినోవాక్ బయోటెక్, సినోఫార్మా ఈ టీకాని అభివృద్ధి చేస్తున్నాయి. టీకా ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని నిర్మించామనీ, ఏడాదికి 300 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని సినోవాక్ ప్రతినిధి వెల్లడించారు. సంస్థకు చెందిన 90 శాతం మంది ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగం కింద అందజేసినట్టు సినోవాక్ సీఈఓ వీడాంగ్ మీడియాకు వెల్లడించారు. టీకా తీసుకున్న వారిలో తన భార్య, తల్లిదండ్రులు కూడా ఉన్నారని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దుష్ప్రభావాల రేటు చాలా తక్కువగా ఉందన్నారు. మరోవైపు 1957లో అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా ప్రయోగించిన సోవియట్ ఉపగ్రహం ‘స్పుత్నిక్ వి’ పేరుతో తమ తొలి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు రష్యా గత నెలలో పేర్కొంది. కాగా క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్లు సురక్షితమైనవని, సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు నిరూపితమైనా ప్రపంచంలో ఇప్పటి వరకూ ఏ టీకాకు తుది ఆమోదం లభించని సంగతి తెలిసిందే. -
యమహా ఫోర్త్ జనరేషన్ స్కూటర్!
ఇవాట: యమహా మోటార్ కంపెనీ తన ఫోర్త్ జనరేషన్ స్కూటర్ మోడల్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. వియత్నాంలో జరుగుతున్న మొదటి మోటార్ సైకిల్ షో 2016లో యమహా ప్రదర్శించిన ఈ ఫోర్త్ జనరేషన్ స్కూటర్ మోడల్ చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రన్ వే డిజైన్ థీమ్‌తో రూపొందించిన ఈ స్కూటర్ బాహ్య ప్యానళ్లు కదిలేలా ఉండటంతో దీనికి హంసను పోలిన రూపు రావడం మరో విశేషం. యమహా ఫోర్త్ జనరేషన్ స్కూటర్ మోడల్‌ను సాధారణ స్కూటర్లతో పోలిస్తే కొంత వరకు పారదర్శకంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. భవిష్యత్ ప్రయోగాలకు ఓ దిక్సూచిగా ఉండే విధంగా యమహా గతంలో ఆవిష్కరించిన ఫస్ట్, సెకండ్, ధర్డ్ జనరేషన్ స్కూటర్లు సైతం ఆకట్టుకున్న విషయం తెలిసిందే. భవిష్యత్ స్కూటర్ మార్కెట్‌ను ప్రభావితం చేసేలా ఉన్న ఈ మోడల్ మార్కెట్లోకి రావడానికి వేచి చూడాల్సిందే. -
కళకళలాడిన ‘ఇన్స్పైర్’
ఎగ్జిబిట్లను తిలకించిన 40వేలమంది విద్యార్థులు రేపటితో ముగియనున్న కార్యక్రమం నెక్కొండ : మండలకేంద్రంలోని విద్యోదయ హైస్కూల్లో నిర్వహిస్తున్న ఇన్స్పైర్ కార్యక్రమాన్ని తిలకించేందుకు రెండోరోజైన ఆదివా రం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు భారీగా తరలివచ్చారు. దీంతో పాఠశాల ప్రాం గణం కిక్కిరిసిపోయింది. విద్యార్థులతో కళకళలాడింది. నర్సంపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మహబూబాబా ద్, డోర్నకల్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని పాఠశాలలకు చెందిన దాదాపు 40వేలమందికిపైగా విద్యార్థులు హాజరై ఎగ్జిబిట్లను తిలకిం చారు. విద్యార్థులు ఒక్కో ఎగ్జిబిట్‌ను సునిశి తంగా పరిశీలిస్తూ ముందుకుసాగారు. కార్యక్రమంలో ప్రదర్శించిన 550కిపైగా ఎగ్జిబిట్లను పరిశీలించేందుకు ఒక్కో విద్యార్థికి రెండుగంట లకుపైగా సమయం పట్టింది. పాఠశాల బస్సు లు, డీసీఎంలలో తరలివచ్చిన విద్యార్థులు ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి వేచి ఉండడం గమనార్హం. మహబూబాబాద్ డిప్యూటీ డీఈవో రవీందర్‌రెడ్డి, ఎంఈ వో రత్నమాల, విద్యోదయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా నాగార్జున్రెడ్డిఎగ్జిబిట్లను సందర్శించారు. ఎగ్జిబిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. నిజజీవితంలోనూ సరికొత్త ప్రయోగాలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు, టీయూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బూర్గుపల్లి శ్రావణ్, వడుప్సా నాయకుడు కోడూరి అశోక్‌కుమార్, ఉపాధ్యాయులు గ్రేస్మణి, అనంతుల మురళీధర్, రామారపు రవి, లక్ష్మణ్‌రావు, అనిల్‌కుమార్, పీఈటీలు కొమ్ము రాజేందర్, బిక్షపతి, అయిలయ్య, ఆర్.బిక్షపతి, శంకర్, కైలాష్, విజయ్, ప్రవీణ్‌రెడ్డి, సంపత్, సారంగపాణి, సుధీర్, మాధవి తదితరులు పాల్గొన్నారు.