exige deportment
-
పన్నుల రాబడి పైపైకి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి గత నాలుగేళ్లుగా పన్నుల ఆదాయం క్రమంగా పెరుగుతోంది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌తో కూడిన రాష్ట్ర స్వీయ పన్నుల రాబడి (స్టేట్ వోన్ ట్యాక్స్ రెవెన్యూ)తో సర్కారు ఖజానా గలగలలాడుతోంది. రాష్ట్ర స్వీయ పన్నుల రాబడి రూపంలో 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ. 35,146 కోట్ల పన్నుల రాబడి రాగా 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 56,520 కోట్లకు పెరిగింది. రాష్ట్రానికి వచ్చే మొత్తం పన్నుల ఆదాయంలో రాష్ట్ర స్వీయ పన్నుల రూపంలో వచ్చి న రాబడి 2014–15లో 74 శాతంగా ఉండగా 2015–16లో అది 87 శాతానికి పెరిగింది. వస్తు సేవల పన్ను, నోట్ల రద్దు అమలుతో 2016–17లో పన్నుల రాబడి స్వల్పంగా తగ్గి 84 శాతం నమోదవగా 2017–18లో 87 శాతానికి పెరిగింది. వాణిజ్య పన్నుల రూపంలో వసూలయ్యే మొత్తం ఎక్కువగా ఉంటోంది. వాణిజ్య పన్నుల రూపంలో 2014–15లో రూ. 22,949 కోట్లు, 2017–18లో రూ. 39,522 కోట్ల మేర పన్నులు వసూలయ్యాయి. అలాగే 2014–15లో ఎక్సైజ్‌శాఖ నుంచి వచ్చిన ఆదాయం రూ. 3,091 కోట్లుగా నమోదైంది. 2017–18లో ఈ శాఖ ఆధ్వర్యంలో రూ. 9,429 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల జీవన విధానంలో గుణాత్మక మార్పుకు దోహదం చేస్తున్నాయని, పన్నుల రాబడి పెరుగుదల దీన్ని స్పష్టం చేస్తోందని అధికారులు చెబుతున్నారు. సంపాదనపరంగా ఉండే ఆదాయం పెరగడంతో ప్రజల వినియోగ సామర్థ్యం, కొనుగోలు శక్తి పెరిగిందని... వాణిజ్య పన్నుల వృద్ధి దీన్ని స్పష్టం చేస్తోందని అంటున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆదాయం పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ కొనుగోళ్లలో వృద్ధి నమోదవుతోందని విశ్లేషిస్తున్నారు. కాగా, ఆదాయ అభివృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవల వెల్లడించడం తెలిసిందే. రాష్ట్ర సొంత వనరుల నుంచి రాబడి (రూ. కోట్లలో) 2014–15 35,146 2015–16 39,975 2016–17 48,408 2017–18 56,520 –––––––––––––– వాణిజ్య పన్నుల రాబడి (రూ. కోట్లలో) 2014–15 22,949 2015–16 30,879 2016–17 35,078 2017–18 39,522 -
మద్యం కల్తీ.. వ్యాపారుల కక్కుర్తి
ప్రొద్దుటూరు క్రైం: కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి తదితర ప్రాంతాలలో గతంలో కల్తీ మద్యం కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు ఎక్సైజ్ డివిజన్ల పరిధిలో 214 మద్యం షాపులు, 18 బార్లు ఉన్నాయి. ప్రొద్దుటూరు పరిధిలో 8 బార్లు, 112 మద్యం దుకాణాలు ఉండగా, కడప ఈఎస్ పరిధిలో 10 బార్లు, 102 వైన్ షాపులు ఉన్నాయి. కల్తీ ఘటనలు ఎన్నెన్నో.. ప్రొద్దుటూరులో ఈఎస్ కార్యాలయంతో పాటు ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ ఉంది. కల్తీ మద్యం, సారా, అక్రమ మద్యాన్ని నియంత్రించడానికి డీటీఎఫ్ స్క్వాడ్ ఉంది. అయినప్పటికీ ఇక్కడి కొన్ని దుకాణాలు, బార్లల్లో మద్యం కల్తీ జరుగుతున్నట్లు మద్యం ప్రియులు వాపోతున్నారు. మూడు రోజుల క్రితం రెడ్డిబార్లో కల్తీ జరుగుతోందని సమాచారం రావడంతో విజయవాడకు చెందిన ఎస్టì ఎఫ్ అధికారులు దాడులు చేశారు. నీళ్లు కలిపిన 68 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇదే బార్‌పై ఎస్టిఎఫ్ అధికారులు దాడులు చేసి కేసు నమోదు చేశారు. ఆ సమయంలో అధికారులు, బార్లో పని చేస్తున్న సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా అధికారుల వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. రామేశ్వరం రోడ్డులో మద్యం కల్తీ చేస్తుండగా అప్పటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంభూప్రసాద్ స్వయంగా దాడి చేసి పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో గాంధీరోడ్డు, రామేశ్వరం రోడ్డు, మైదుకూరు రోడ్డులలో ఉన్న మద్యం షాపులపై కేసులు నమోదు కాగా, రూ. 1 లక్ష జరిమానాతో పాటు వారం–పది రోజుల పాటు దుకాణాలు కూడా మూత పడ్డాయి. అధికారుల చర్యలు శూన్యం.. స్థానికంగానే అధికారులందరూ ఉన్నప్పటికీ కల్తీ మద్యాన్ని నియంత్రించడం లేదనే విమర్శలు జోరుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ పోలీసులతో పాటు డీటీఎఫ్ స్క్వాడ్ అధికారులు ప్రతి రోజూ మద్యం షాపులపై నిఘా పెట్టాల్సి ఉంది. కొన్ని మద్యం సీసాలను తీసుకొని వాటిని పరీక్షలు కూడా చేస్తుండాలి. అయితే వ్యాపారులతో ఉన్న మామూళ్ల సంబంధం కారణంగా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేయడంలేదనే విమర్శలు వినిస్తున్నాయి. ఎక్కువగా సామాన్యులు సేవించే 180 ఎంఎల్ చీఫ్ లిక్కర్ కల్తీ జరుగుతున్నట్లు సమాచారం. తనిఖీలు చేస్తున్నాం.. బార్లు, మద్యం షాపుల్లో నిత్యం తనిఖీలు చేస్తున్నాం. రెండు, మూడు రోజులకు ఒక సారి ప్రతి షాపులోనూ షాంపిల్స్ తీస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు చేస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. కేసులు నమోదు చేసి, అవసరమైతే దుకాణాలను సీజ్ చేస్తాం. – ఫణీంద్ర, ఎక్సైజ్ సీఐ, ప్రొద్దుటూరు.