extreme tension
-
ప్రాణాలైనా ఇస్తాం, భూములివ్వం.. రీజనల్ రింగ్ రోడ్డు సర్వేలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో రీజనల్ రింగ్ రోడ్డు కోసం గురువారం చేపట్టిన సర్వేను రైతులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రి క్తత ఏర్పడింది. ‘మా ప్రాణాలైనా ఇస్తాం కానీ, భూములను ఇవ్వబోము’అంటూ రైతులు నినాదాలు చేశారు. సర్వేకు ఒప్పుకోమని అధికారులకు తేల్చిచెప్పారు. దీంతో అధికారులు పెద్ద ఎత్తున పో లీసు బలగాలను దించి ఎక్కడికక్కడ మహిళలు, యువకులు, వృద్ధులను అదుపులోకి తీసుకుని వి విధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. వారికి సంఘీభావం తెలపడానికి వచ్చిన వివిధ పార్టీల నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య మొత్తానికి అధికారులు రాత్రి వరకు సర్వేను పూర్తి చేశారు. రోడ్డుపై బైఠాయించిన రైతులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా సర్వే ఎలా చేస్తారని రైతులు సర్వే సిబ్బందిని అడ్డుకుని రహదారిపై బైఠాయించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహిళలు, పిల్లలు, రైతులు రోడ్డుపైనే కూర్చున్నారు. దీంతో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. అయితే, రైతులు ఒక్కసారిగా వె ళ్లి సర్వే పనులను అడ్డుకుని అధికారుల చేతుల్లోని యంత్రాలను లాక్కుని పరుగులు తీశారు. ఈ క్ర మంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్ ఎక్కిస్తుండగా మహిళా రైతులు అడ్డుకున్నా రు. ఈ సమయంలో ఓ మహిళా రైతు చేతికి గాయమైంది. మరో మహిళ కాలుకు తీవ్ర గాయం కావడంతో ఇతర మహిళలు ఆందోళన ఉధృతం చేశా రు. మహిళా పోలీసులు వచ్చి వారిని బీబీనగర్, భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఓవైపు ఆందోళన.. మరో వైపు సర్వే రాయగిరి వద్ద రీజనల్ రింగ్ రోడ్డు కోసం సేకరించే భూముల సర్వేకు కలెక్టరేట్ నుంచి ఎనిమిది బృందాలు వచ్చాయి. సర్వే నిలిపివేయాలని రైతులు ఒకవైపు ఆందోళన చేస్తుండగానే.. అధికారులు భూ సర్వే పనులు కొనసాగించారు. గత కొన్ని రోజుల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ సర్వేను రాయగిరి రైతులు అడ్డుకుంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో కేవలం భువనగిరి మున్సిపాలిటీ, కొన్ని గ్రామాల్లో మాత్రమే సర్వే మిగిలింది. దీంతో గురువారం రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుతో వచ్చారు. భువనగిరి మండలం రాయగిరి, ముత్తిరెడ్డిగూడెం, గంగసానిపల్లి గ్రామాల మధ్య సర్వే పనులు పూర్తయినట్లు యాదాద్రి జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి చెప్పారు. రైతులు కొంతమేరకు ప్రతిఘటించారని, అయినప్పటికీ సర్వే పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. 32 మందిని అరెస్టు చేశాం.. రీజనల్ రింగ్ రోడ్డు సర్వే పనులను అడ్డుకున్నందుకు నలుగురు మహిళలతో కలిపి మొత్తం 32 మందిని అరెస్ట్ చేశాం. తర్వాత అందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశాం. – వెంకట్‌రెడ్డి, ఏసీపీ, భువనగిరి ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలి? నాకున్న మూడు ఎకరాల భూమి రోడ్డులో పోతే నా ముగ్గురు ఆడ పిల్లలను ఎలా పెంచాలి. పెళ్లిళ్లు ఎలా చేయాలి? తలుచుకుంటేనే భయమేస్తుంది. ఒక బిడ్డకు ఒక ఎకరం చొప్పున అమ్మి పెళ్లి చేయాలి అని అనుకున్నాం. కానీ, ప్రభుత్వం భూమి మొత్తం తీసుకుంటోంది. – పద్మ, రాయగిరి బతకడమే వ్యర్థం నా భర్త చనిపోగా ఆయన వారసత్వంగా నాకు ఏడు ఎకరాల భూమి వచ్చింది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. నా ఆరోగ్యం కూడా బాగుండటంలేదు. ఒక్క గుంట భూమి కూడా లేకుండా పోతుంది అంటే గుండె ఆగిపోయినట్లు ఉంది. బతకడమే వ్యర్థం అనిపిస్తోంది. –– లక్ష్మి, రాయగిరి -
‘చలో ఢిల్లీ’ రణరంగం
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గురువారం చేపట్టిన ‘చలో ఢిల్లీ’కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధానంగా బీజేపీ పాలిత హరియాణా, కాంగ్రెస్ పాలిత పంజాబ్ సరిహద్దులో పరిస్థితి రణరంగాన్ని తలపించింది. రైతులపై పోలీసులు బాçష్ఫవాయువు, వాటర్‌కెనన్లు ప్రయోగించారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పంజాబ్ రైతులు ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రానికి పెద్ద సంఖ్యలో పంజాబ్, హరియాణా రైతులు ఢిల్లీ సమీపంలోకి చేరుకోగలిగారు. అక్కడ వారిని పోలీసులు నిలువరించారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ శివార్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీకి బయలుదేరిన స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ను, ఇతర నిరసనకారులను గుర్గావ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంమీద పోలీసులు మొదటి రోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని భగ్నం చేయగలిగారు. రైతన్నలపై పోలీసుల జులుం పంజాబ్–హరియాణా షాంబూ సరిహద్దులో హరియాణా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పంజాబ్ రైతులు ట్రాక్టర్లలో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రైతులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. కానీ, రైతులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు కదిలారు. వారిని చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు భాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. కోపోద్రిక్తులైన రైతులు కొన్ని బారికేడ్లను ఘగ్గర్ నదిలో విసిరేశారు. అంతేకాకుండా సిర్సా, కురుక్షేత్ర, ఫతేబాద్, జింద్ జిల్లాల్లోనూ రైతులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. గురువారం సాయంత్రానికి ఉద్రిక్తతలు చల్లారాయి. చాలా ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలను సడలించడంతో రైతులు కాలినడకన, ట్రాక్టర్లపై ముందుకు కదిలారు. అమృత్సర్–ఢిల్లీ ప్రధాన రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కర్నాల్ పట్టణంలోనూ రైతులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించారు. హరియాణాలోని కైథాల్ జిల్లాలో భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు వాటర్ కెనన్లను ప్రయోగించారు. శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళుతున్న తమపై పోలీసులు బల ప్రయోగం చేయడం ఏమిటని రైతన్నలు మండిపడ్డారు. పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో అంబాలా వద్ద రైతులపైకి వాటర్ కేనన్ల ప్రయోగం -
జిల్లాల లొల్లి
ఊపందుకున్న ఉద్యమాలు ►మానుకోట జిల్లా సాధన కమిటీ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైల్‌రోకో ►20 నిమిషాల పాటు నిలిచిన శాతవాహన ఎక్స్‌ప్రెస్.. తీవ్ర ఉద్రిక్తత ►ములుగు 48 గంటల బంద్ విజయవంతం ►అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో ►భూపాలపల్లిని జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక రోజు దీక్ష ►సీఎం హామీ నిలబెట్టుకోవాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ మహబూబాబాద్ : ప్రత్యేక జిల్లా ల ఉద్యమం ఊపందుకుంటోం ది. తమతమ నియోజకవర్గాలను జిల్లాలుగా ప్రకటించాలంటూ జనం నినదిస్తున్నారు. మానుకోట జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రైల్ రోకో నిర్వహించారు. ఇందులో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం ఉందని తెలియడంతో మానుకోట డీఎస్పీ, జీఆర్పి ఉన్నతాధికారులు స్థానిక రైల్వే స్టేషన్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.ఉదయం 8.25 గంటల సమయమది. శాతవాహన ఎక్స్‌ప్రెస్ కొద్దిక్షణాల్లో ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకుంటుందంటూ అనౌన్స్మెంట్ వస్తోంది. ఇదే తరుణంలో పెద్దసంఖ్యలో జిల్లా సాధన కమిటీ నాయకులు రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న కట్టెల మండి వద్ద కు రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్నారు. వారిని నియంత్రించేందు కు రైల్వే, పోలీసు సిబ్బంది శతవిధాలా యత్నించారు. అరుు నా వారంతా ప్లాట్‌ఫామ్‌పై ఉన్న శాతవాహన ఎక్స్‌ప్రెస్ దగ్గరికి చేరుకున్నారు. తమ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం విని పించుకోవాలంటూ నినాదాలు చేస్తూ నాయకులు రైలు ఎదుట బైఠారుుంచారు. వారికి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అరుునా ఫలితం లేకపోరుుంది. దీంతో జేఏసీ డివిజన్ కన్వీనర్ డోలి సత్యనారాయణను, కమిటీ సభ్యులు శంతన్‌రామరాజు, పిల్లి సుధాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాల్వాయి రామ్మోహన్‌రెడ్డిలను భద్రతా సిబ్బంది బలవంతంగా పట్టాలపై నుంచి లాక్కెళ్లారు. ముఖ్య నాయకులను తరలించినా, మిగితా వారంతా కదలబోమంటూ అక్కడే భీష్మించుకు కూర్చోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పెద్దసంఖ్యలో ఉన్న పోలీసు బలగాలు రైలు ఎదుట బైఠాయించిన నాయకులను ట్రాక్‌పై నుంచి దూరంగా జరపడంతో శాతవాహన ఎక్స్‌ప్రెస్ వెళ్లిపోరుుంది. మొత్తంగా 20 నిమిషాల పాటు స్టేషన్లో రైలు ఆగింది. నాయకులు డాక్టర్ డోలి సత్యనారాయణ, పాల్వాయి రా మ్మోహన్‌రెడ్డి, మార్నేని వెంకన్న, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, ఫరీద్, శంతన్ రామరాజు, పిల్లి సుధాకర్, గుగ్గిళ్ళ పీరయ్య మాట్లాడుతూ మానుకోటకు జిల్లా అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. లింగుబాబు, అశోక్, వెంకన్న, ప్రవీణ్, అజయ్, కనకయ్య, జనార్ధన్, ఇక్బాల్, వెంకట్‌రెడ్డి, లక్ష్మి పాల్గొన్నారు.