జిల్లాల లొల్లి
ఊపందుకున్న ఉద్యమాలు
►మానుకోట జిల్లా సాధన కమిటీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైల్‌రోకో
►20 నిమిషాల పాటు నిలిచిన శాతవాహన ఎక్స్‌ప్రెస్.. తీవ్ర ఉద్రిక్తత
►ములుగు 48 గంటల బంద్ విజయవంతం
►అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో
►భూపాలపల్లిని జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక రోజు దీక్ష
►సీఎం హామీ నిలబెట్టుకోవాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్
మహబూబాబాద్ : ప్రత్యేక జిల్లా ల ఉద్యమం ఊపందుకుంటోం ది. తమతమ నియోజకవర్గాలను జిల్లాలుగా ప్రకటించాలంటూ జనం నినదిస్తున్నారు. మానుకోట జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రైల్ రోకో నిర్వహించారు. ఇందులో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం ఉందని తెలియడంతో మానుకోట డీఎస్పీ, జీఆర్పి ఉన్నతాధికారులు స్థానిక రైల్వే స్టేషన్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.ఉదయం 8.25 గంటల సమయమది. శాతవాహన ఎక్స్‌ప్రెస్ కొద్దిక్షణాల్లో ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకుంటుందంటూ అనౌన్స్‌మెంట్ వస్తోంది. ఇదే తరుణంలో పెద్దసంఖ్యలో జిల్లా సాధన కమిటీ నాయకులు రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న కట్టెల మండి వద్ద కు రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్నారు. వారిని నియంత్రించేందు కు రైల్వే, పోలీసు సిబ్బంది శతవిధాలా యత్నించారు. అరుు నా వారంతా ప్లాట్‌ఫామ్‌పై ఉన్న శాతవాహన ఎక్స్‌ప్రెస్ దగ్గరికి చేరుకున్నారు. తమ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం విని పించుకోవాలంటూ నినాదాలు చేస్తూ నాయకులు రైలు ఎదుట బైఠారుుంచారు. వారికి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అరుునా ఫలితం లేకపోరుుంది. దీంతో జేఏసీ డివిజన్ కన్వీనర్ డోలి సత్యనారాయణను, కమిటీ సభ్యులు శంతన్‌రామరాజు, పిల్లి సుధాకర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పాల్వాయి రామ్మోహన్‌రెడ్డిలను భద్రతా సిబ్బంది బలవంతంగా పట్టాలపై నుంచి లాక్కెళ్లారు.
ముఖ్య నాయకులను తరలించినా, మిగితా వారంతా కదలబోమంటూ అక్కడే భీష్మించుకు కూర్చోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పెద్దసంఖ్యలో ఉన్న పోలీసు బలగాలు రైలు ఎదుట బైఠాయించిన నాయకులను ట్రాక్‌పై నుంచి దూరంగా జరపడంతో శాతవాహన ఎక్స్‌ప్రెస్ వెళ్లిపోరుుంది. మొత్తంగా 20 నిమిషాల పాటు స్టేషన్‌లో రైలు ఆగింది. నాయకులు డాక్టర్ డోలి సత్యనారాయణ, పాల్వాయి రా మ్మోహన్‌రెడ్డి, మార్నేని వెంకన్న, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, ఫరీద్, శంతన్ రామరాజు, పిల్లి సుధాకర్, గుగ్గిళ్ళ పీరయ్య మాట్లాడుతూ మానుకోటకు జిల్లా అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. లింగుబాబు, అశోక్, వెంకన్న, ప్రవీణ్, అజయ్, కనకయ్య, జనార్ధన్, ఇక్బాల్, వెంకట్‌రెడ్డి, లక్ష్మి పాల్గొన్నారు.