త్రుటిలో తప్పిన విమానాల ఢీ
న్యూఢిల్లీ: అది సోమవారం.. వేకువజాము.. ముంబైపై ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈకే-706 నిండుగా ప్రయాణికులతో వెళుతోంది అదే సమయంలో ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ విమానం ఈవై-622 ఎదురుగా దూసుకొస్తోంది. వాటి మధ్య దూరం కేవలం కొన్ని కిలోమీటర్లే. మరో 25-30 సెకన్లలో అవి ఢీకొని భారీ విధ్వంసం, ప్రాణ నష్టం జరగడం ఖాయం. ఇంతలో ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సిబ్బంది దీనిని గుర్తించారు. వెంటనే ఒక విమానానికి అత్యవసర సందేశం పంపారు. దీంతో ఆ విమానం దిశ మార్చుకోవడంతో...కొద్ది సెకన్లలో భారీ ప్రమాదం తప్పింది. ఎమిరేట్స్ విమానం దుబాయ్ నుంచి సీషెల్స్‌కు వెళుతుండగా, ఎతిహాద్ విమానం సీషెల్స్ నుంచి అబుదాబి వెళుతోంది. ఈ ఉదంతంపై విచారణ చేపట్టారు.