25మంది నకిలీ ఏజెంట్ల అరెస్ట్
కడప : వైఎస్ఆర్ జిల్లాలో సుమారు 25మంది నకిలీ ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప, రాయచోటి, రైల్వేకోడూరు ఎన్నికల కౌంటింగ్ సెంటర్ల వద్ద నకిలీ ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నకిలీ పాసులతో కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన వారిని తనిఖీల అనంతరం అక్కడ నుంచి తరలించారు. ఇక ఫలితాల విషయానికి వస్తే రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాలు ఉదయం పదిన్నరకు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ప్రొద్దూటూరులో కౌంటింగ్ కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేవంటూ ఏజెంట్లు నిరసన వ్యక్తం చేశారు.