Faculty Recruitment
-
అధ్యాపక రిజర్వేషన్లలో పాత పద్ధతి
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపక నియామకాల్లో 200–పాయింట్ రోస్టర్ ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టడం కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రతిపాదనను కేంద్రకేబినెట్ ఆమోదించింది. ఈ విషయంలో 2017లో అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు∙తీర్పుల నుంచి మినహాయింపు పొంది, రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయుల నియామకాల్లో ఒక్కో విభాగాన్ని లేదా ఒక్కో సబ్జెక్ట్‌ను ఒక యూనిట్‌గా పరిగణించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గతేడాది మార్చిలో స్పష్టం చేసింది. 2017 ఏప్రిల్‌లో అలహాబాద్ హైకోర్టు తీర్పును అనుసరించి యూజీసీ ఈ ఆదేశాలిచ్చింది. విశ్వవిద్యాలయం మొత్తాన్ని కాకుండా అందులోని ఒక్కో విభాగాన్ని ఒక్కో యూనిట్‌గా పరిగణించడం వల్ల ఒకటి లేదా రెండు ఉద్యోగ ఖాళీలే ఉన్న చోట రిజర్వేషన్ వర్తించేది కాదు. ఆ ఉద్యోగాలను జనరల్ కేటగిరీ కింద భర్తీ చేయాల్సి వచ్చేది. అదే విశ్వవిద్యాలయం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తే, అన్ని విభాగాల్లో కలిపి ఖాళీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కుతాయి. దీంతో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవరించాలనీ, యూజీసీ ఆదేశాలను రద్దు చేయాలంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కేంద్రం పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత నెలలో కొట్టేసింది. దీంతో 200–పాయింట్ రోస్టర్ ఆధారిత పాత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టడం కోసం కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొస్తుందని హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్ గత నెలలో లోక్‌సభలో ప్రకటించారు. అధ్యాపక నియామకాలు ప్రారంభించండి కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో అధ్యాపక నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) దేశంలోని విశ్వవిద్యాలయాలను కోరింది. ఈ మేరకు యూజీసీ వర్సిటీ వైస్ చాన్స్లర్లకు సూచించింది. -
వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ
అసలే అధ్యాపకుల్లేని విభాగాల్లో మొదట భర్తీ ఆ తరువాత మిగతా విభాగాల్లో.. మరో నాలుగు రోజుల్లో ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూని వర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను దశలవారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికిప్పుడు అధ్యాపకుల అవసరం ఎక్కువగా ఉన్న విభాగాల్లోని ఖాళీలను మాత్రమే మొదట భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మిగతా ఖాళీలను ఆ తరువాత భర్తీ చేసే అవకాశం ఉంటుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. యూనివర్సిటీ వారీగా మొదట భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను తేల్చే పనిలో ఉన్నత విద్యా మండలి నిమగ్నమైంది. పాలమూరు యూనివర్సిటీలో 90 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాంటి యూనివర్సిటీల్లో అత్యవసరం అరుున పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,528 పోస్టులు ఖాళీగా ఉండగా, మొదట అందులో సగం వరకే పోస్టులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మొత్తానికి మరో నాలుగు రోజుల్లో వెంటనే భర్తీ చేయాల్సిన పోస్టులను గుర్తించి ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి ఫైలు పంపించేందుకు సిద్ధమవుతోంది. ఖాళీగా ఉన్న 1,528 పోస్టుల్లో 323 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా, 687 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 518 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గడిచిన మూడేళ్లుగా ఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యా కార్యక్రమాలు కుంటుపడ్డారుు. వీసీలు లేకుండా వాటిని భర్తీ చేసే పరిస్థితి లేకపోవడంతో ఇన్నాళ్లు పక్కన పెట్టింది. ఇటీవల 10 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం ఇప్పుడు అధ్యాపకుల భర్తీపై దృష్టి సారించింది. డెరైక్టు రిక్రూట్మెంట్ కోటా కింద భర్తీ చేయాల్సిన పోస్టులపై ఆయా యూనివర్సిటీల వీసీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది.