family drama
-
ఓటీటీలోకి సుహాస్ ‘ఫ్యామిలీ డ్రామా’..ఆసక్తికరంగా ట్రైలర్
‘కలర్ ఫోటో’ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘ఫ్యామిలీ డ్రామా’.మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలింస్, నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యానర్లతో కలిసి తేజా కాసరపు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహెర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 29న సోని లివ్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని ను ‘సోని లివ్’ రిలీజ్ చేసింది. ప్రతి చిన్న విషయానికి తండ్రి బూతులు తిడుతున్నాడనే కారణంగా ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ అబ్బాయి, తన ఇంట్లో పరిస్థితులు నచ్చక బయటకి వచ్చేసిన ఓ అమ్మాయి.. ఈ ఇద్దరూ ఎలా కలిశారు? వీరికి సుహాస్ ఎలా సాయపడ్డాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘ఈత రానివాడు సముద్రాన్ని తిట్టుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో..వినడం రానివాడు సంగీతం గురించి మాట్లాడినా అంతే అసహ్యంగా ఉంటుంది’ అని సుహాస్ చెప్పిన డైలాగ్ మెప్పిస్తుంది. -
సుహాస్ ‘ఫ్యామిలీ డ్రామా’ ఫస్ట్‌లుక్ విడుదల
‘కలర్ ఫోటో’ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘ఫ్యామిలీ డ్రామా’.మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలింస్, నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యానర్లతో కలిసి తేజా కాసరపు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహెర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మంగళవారం విడుదలైంది. ఫ్యామిలీ డ్రామా’ అనే టైటిల్ కి భిన్నంగా ఈ పోస్టర్ ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో పాటు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. -
అన్నా చెల్లెలు
తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ డ్రామాగా పేరున్న ఒక సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. అన్నా చెల్లెల బంధం గురించి చెప్పినప్పుడల్లా ముందు ఈ సినిమాయే గుర్తొస్తుంది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... ఆ అన్నా చెల్లెలిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఈ ఇద్దరిది మాత్రమే ఒక ప్రపంచం. చెల్లెలికి అమ్మా నాన్న అన్నీ తానై చూసుకుంటాడు అన్న. కష్టపడి ఒక చిన్న మిల్లులో పనిచేయడం దగ్గర్నుంచి మొదలైన అన్న ప్రయాణం, అదే మిల్లుకు ఓనర్‌గా ఎదిగే వరకూ ఏ ఆటూపోటూ లేకుండా సాగింది. అన్న పేరు రాజు. పేరుకు తగ్గట్టే రాజులా ఉంటాడు. చెల్లి రాధకు కొత్తగా వచ్చిన ఈ ఐశ్వర్యమంతా కొత్తగా ఉంది. రాజు ఇప్పుడు ఓనర్‌గా ఉన్న మిల్లులో వర్కర్‌గా పనిచేస్తున్నప్పట్నుంచీ ఉన్న ఒకే ఒక్క మంచి మిత్రుడు ఆనంద్. ఆనంద్‌కు రాధ అంటే ఇష్టం. ఆమెను ప్రేమిస్తున్నాడు కూడా. రాధకూ అతనంటే అంతే ఇష్టం. వీళ్లిద్దరి విషయం మాత్రం రాజుకు తెలియదు. ‘‘ఏం రాజూ! పెళ్లెప్పుడు చేసుకుంటున్నావు?’’ అని ఎవరైనా రాజును అడిగితే, నవ్వి, ‘‘ముందు చెల్లి పెళ్లి చేయాలి కదా’’ అంటుంటాడు. రాధకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాడు. సరిగ్గా అలాంటి సమయంలోనే, రాధ పుట్టినరోజును ఘనంగా జరుపుతున్న రోజు, చెల్లి ప్రేమకథ రాజు కంట్లో పడింది. ఆనంద్ మీద చెయ్యి చేసుకొని, అతణ్ని కొట్టి ఇంట్లోంచి తరిమేశాడు రాజు. కోపాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా ఓ ధనవంతుడితో రాధ పెళ్లిని ఖరారు చేశాడు రాజు. ఈ విషయం రాధకు చెప్పాలని అస్సలు ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. ఆ సమయానికి రాధ ఆనంద్‌తో మాట్లాడుతోంది. తోటలో వాళ్లిద్దర్ని కలిపి చూసిన రాజుకు కోపం మరింత పెరిగిపోయింది. తన గదిలోకి పరిగెత్తుకెళ్లి తుపాకీ తీసుకొనివచ్చాడు. ‘‘నాతో వచ్చెయ్ రాధా! మనం ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం.’’ అన్నాడు ఆనంద్, చాలాసేపు రాధ తన మాటలను కేవలం వింటూ ఉండటం చూసి. ‘‘అన్నయ్యకు చెప్పకుండా మనం పారిపోవడమా? అన్నయ్య లేకుండా మన పెళ్లా? క్షమించండి. నేను రాలేను. నా వల్ల కాదు.’’ అంది రాధ భయపడిపోతూ, బాధగా. ఆనంద్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ రాధకు అన్నయ్యను వదిలిపోయేంత ధైర్యం లేదు. నిజానికి ఆ ధైర్యం ఏ చెల్లెలికీ రావొద్దని కోరుకునేంత ఇష్టం ఆమెకు అన్నయ్యంటే. ‘‘మా అన్నయ్యే మన పెళ్లి చేస్తారు. ఆ రోజు వస్తుంది చూడండి. అప్పుడు మీరే బావా బావా అని పిలుచుకుంటారు’’ అంది రాధ. ఆనంద్‌కు కోపమొచ్చింది. ‘‘వాడా నా బావ? నా చేతికి బేడీలు వేస్తానన్నవాడు.. వాడు నా బావా? వాడొచ్చి నా కాళ్ల మీద పడి క్షమాపణలు అడిగితే తప్ప దగ్గరకు రానివ్వను’’ అంటూ ఊగిపోయాడు. ఆనంద్‌ను చంపాలని తుపాకీతో వచ్చిన రాజు, రాధకు తన మీద ఉన్న గౌరవాన్ని చూసి ఆగిపోయాడు. రాజుకు తన మీద తనకే అసహ్యం కలిగింది. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆనంద్‌కు రాజు మీద కోపం తగ్గట్లేదు. దౌర్భాగ్యుడు, మిత్రద్రోహి, నీచుడు అని నోటికి వచ్చినట్లు రాజును తిడుతున్నాడు. రాధ గట్టిగా అరిచింది – ‘‘ఆపండి! మా అన్నయ్యను మీరలా తిట్టడం నేను సహించలేను. ఎవరనుకుంటున్నారు మా అన్న? నాకు తల్లి, తండ్రి, గురువు, నా పాలిట దైవం.. అన్నీ ఆయనే!’’. ‘‘అయితే ఇంక నేనెందుకు నన్ను మర్చిపో రాధా!’’ అన్నాడు ఆనంద్. అతనింకా అదే కోపంలో ఉన్నాడు. ‘‘ఎంత తేలిగ్గా అనేశారు ఆ మాట! నన్నింకా హింస పెట్టకండి. మా అన్నయ్య మీద పగ సాధించడమే మన పెళ్లికి లక్ష్యమైతే నాకు ఈ పెళ్లి వద్దు, ఆ ప్రేమా వద్దు. సెలవు’’ అని చెప్పి గట్టిగా ఏడుస్తూ అక్కణ్నుంచి ఇంట్లోకి పరిగెత్తింది రాధ. ఆనంద్ బాధగా అక్కణ్నుంచి బయటికి కదిలాడు. చెల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోయిన రాజు అదే తోటలో, ఒక చెట్టు పక్కన నిల్చొని ఏడుస్తున్నాడు. రాజు ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు. ఏం చేసైనా రాధకు తను ప్రేమించిన ఆనంద్‌నే ఇచ్చి పెళ్లి చేయాలని. ఆ తరువాతి రోజే వాళ్లిద్దరి పెళ్లి చేసేశాడు. రాజు, ఆనంద్ ఇప్పుడు స్నేహితులే కాదు, బంధువులు కూడా! ఆనంద్ తనను పెంచి పెద్ద చేసిన అత్తతో పాటు రాజు ఇంటికే తన నివాసాన్ని మార్చేసుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. రాజు కూడా తను ప్రేమించిన అమ్మాయి మాలతిని పెళ్లి చేసుకున్నాడు. రాజు – మాలతి, ఆనంద్ – రాధ జంటలతో ఆ ఇల్లు కళకళలాడిపోతోంది. వీళ్లంతా సంతోషంగా ఉండటం ఆనంద్ అత్తకు మాత్రం నచ్చడం లేదు. ఆ పెద్ద ఇంటి పెత్తనమంతా తన చేతుల్లోకి తీసుకుందామని చూస్తోన్న ఆమెకు, వీళ్లంతా కలిసి ఉంటే చూడటం కష్టమైన పనే. ముందు మాలతికి, రాధకు గొడవలు తీసుకొచ్చి పెట్టింది. ఆ గొడవల్ని రాజు, ఆనంద్లకూ చేరేలా చేసింది. సంతోషంగా ఉన్న ఆ ఇల్లు మెల్లిగా ఒక రకమైన అశాంతికి, పూర్తి విచ్ఛిన్నానికి దారులు వెతుక్కుంది. కాలం పరుగుల్లో మాలతి జబ్బుతో చనిపోయింది. ఆనంద్, రాధ బాగుండాలని కోరుకున్న రాజు, ఆస్తినంతా వాళ్లకు రాసేసి ఊరు వదిలేసి వెళ్లిపోయాడు. చాలాకాలం లెక్కలేనన్ని ఊర్లు తిరిగాడు రాజు. అతనికెప్పుడూ చెల్లి గుర్తొస్తూనే ఉన్నా, ఇంటికైతే తిరిగి రావాలనుకోలేదు. తిరిగొచ్చిన తర్వాత మాత్రం రాజు ఎక్కువ రోజులు బతకలేదు. -
‘మరీ ఇంత దారుణంగా ఉంటే ఎలా..!?’
ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్, ఎమోషనల్ స్టోరీస్ ఇలా ఒకటేమిటి వైవిధ్యమైన కథలతో సీరియళ్లను నిర్మిస్తోన్న బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్‌కు.. ‘క్వీన్ ఆఫ్ హిందీ టెలివిజన్’ అనే బిరుదు ఎప్పుడో కట్టబెట్టేశారు ఆమె అభిమానులు. కానీ ఇప్పుడు ఆ అభిమానులే ఏక్తాకు అస్సలు టేస్ట్ లేదంటూ పెదవి విరిచేస్తున్నారు. ఇందుకు ఆమె నిర్మించే సీరియళ్లు మాత్రమే కారణం కాదు. అసలు విషయమేమిటంటే... ఓ ప్రముఖ హిందీ చానల్లో ప్రసారమవుతోన్న ‘యే హై మొహబ్బతే’ సీరియల్ 15 వందల ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏక్తా కపూర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో స్లీవ్‌లెస్ మెరూన్ రఫెల్ గౌనుకు జోడీగా బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ ధరించిన ఏక్తా.. బ్లాక్ హీల్స్ వేసుకున్నారు. పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఏక్తా నెటిజన్ల చేతికి చిక్కారు. ఇంకేముంది అప్పటి నుంచి ఏక్తా డ్రెస్ గురించి తెగ ట్రోల్ చేసేస్తున్నారు. ‘సాగతీత కథనాలతో చిరాకు తెప్పించినా సహిస్తామేమో గానీ.. మీరు ఇలా ఉండటాన్ని మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాం.. డైనింగ్ హాలు నుంచి వస్తూ వస్తూ కర్టెన్ కప్పుకచ్చుకున్నారా ఏంటి? అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘ఎంత డబ్బు ఉంటే ఏం లాభం..కనీసం ఓ స్టైలిస్ట్‌ను ఐనా పెట్టుకోవచ్చుగా’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. మరో అభిమాని స్పందిస్తూ.. ‘మా అభిమాన తార ఫ్యాషన్ ఐకాన్‌గా ఉండకపోయినా ఫర్వాలేదు.. మరీ ఇంత దారుణంగా ఉంటే మాత్రం సహించలేమంటూ’వాపోయాడు. అయితే ఏక్తాకు ఇదేం కొత్త కాదు. ఇది వరకు కూడా లాజిక్ లేని మాటలు, వెరైటీ డ్రెస్సులతో ఎన్నోసార్లు ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. The queen of tv land arrives #ektakapoor for #yehhainmohabatein 1500 episodes celelberations @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Jul 25, 2018 at 11:06am PDT -
జక్కన్న మల్టీ స్టారర్ ఫ్యామిలీ డ్రామా..!
బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శక ధీరుడు రాజమౌళి ఇంత వరకు తన తదుపరి ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించలేదు. బాలీవుడ్ సినిమా చేస్తారంటూ.. ఈగ సినిమాకు సీక్వల్ రూపొందిస్తారంటూ రకరకాల వార్తలు వినిపించినా.. ఫైనల్ గా ఓ క్రేజీ మల్టీ స్టారర్ సినిమాకు రెడీ అవుతున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కాంబినేషన్లో రాజమౌళీ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడు. అధికారిక ప్రకటన లేకపోయినా.. జక్కన్న నెక్ట్స్ సినిమా మల్టీస్టారరే అన్న విషయం దాదాపుగా కన్ఫమ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఏ జానర్ లో ఉండబోతుందన్న చర్చ మొదలైంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు బాక్సర్లుగా కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇప్పటి వరకు మాస్ యాక్షన్, ఫాంటసీ సినిమాలు మాత్రమే తెరకెక్కించిన రాజమౌళి ఈ సినిమాను ఫ్యామిలీ డ్రామాగా రూపొందించే ఆలోచనలో ఉన్నాడట. జక్కన్న మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులను సాటిస్ఫై చేసే ఫ్యామిలీ కథను రెడీ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. -
ములాయం ఇంట్లో రోజుకో కొత్త డ్రామా
లక్నో: అధికార సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఆ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబం డ్రామా నడుపుతోందని బీఎస్పీ విమర్శించింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ములాయం కొన్ని రోజులుగా కుటుంబ డ్రామా సృష్టిస్తున్నారని, రోజుకో కొత్త డ్రామా తెరపైకి తెస్తున్నారని బీఎస్పీ నేత సుధీంద్ర భడోరియా ఆరోపించారు. సమాజ్ వాదీ పార్టీ ప్రజల దృష్టిలో పలచన అవుతోందని, ఆ పార్టీ వ్యవహారం గురించి ప్రజలు కూడా పట్టించుకోవడం లేదని సుధీంద్ర అన్నారు. బాబాయ్, యూపీ పార్టీ చీఫ్ శివపాల్ యాదవ్ నిర్వహించిన భేటీకి అఖిలేష్ డుమ్మా కొట్టారు. అంతేగాక, అఖిలేష్ కొత్త పార్టీ పెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. శివపాల్‌కు, అఖిలేష్‌కు విబేధాలున్నట్టు కథనాలు వస్తున్న ఈ నేపథ్యంలో బీఎస్పీ నేత సుధీంద్ర స్పందించారు.