Feel The Jail
-
ఫీల్ ద జైల్ ఆదర్శం
సంగారెడ్డి క్రైం: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా జైలు మ్యూజియంలోని ఫీల్ ద జైల్ ఎంతో ఆదర్శనీయమని పంజాబ్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌కు చెందిన అక్కా చెల్లెళ్లు ఆయుర్వేదిక్ వైద్యురాలు ఉపాసన శర్మ, ఎస్బీఐ ఉద్యోగి పూనం శర్మ కితాబిచ్చారు. బుధవారం 24 గంటల జైలు జీవితాన్ని ముగించుకొని తిరుగు ప్రయాణంలో వారు మాట్లాడారు. ఎలాంటి నేరం చేయకుండా జైలు జీవితం అనుభవించే అవకాశం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఇక్కడి పరిస్థితులు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. జైలు సిబ్బంది, అధికారులు, మ్యూజియం, ఫీల్ ద జైల్ల గురించి వివరించారన్నారు. కేరళ రాష్ట్రంలో ఆదరణ పొందిన ఆయుర్వేదిక్ వైద్యం జైలు మ్యూజియంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సిబ్బంది అందించిన ఆహారం చాలా బాగుందని, ఇక్కడ పరిస్థితులను తమ బంధువులకు, పంజాబ్ రాష్ట్రంలోని అధికారులకు, తమ స్నేహితులకు వివరిస్తామని చెప్పారు. -
‘ఫీల్ ద జైలుకు’ పంజాబ్ నుంచి అక్కాచెల్లెలు
సంగారెడ్డి క్రైం: పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆయుర్వేదిక్ వైద్యురాలు ఉపాసన శర్మ, బ్యాంకు ఉద్యోగి పూనం శర్మ అక్కాచెల్లెళ్లు. సంగారెడ్డిలోని ‘ఫీల్ ద జైలు’ గురించి ఆన్లైన్లో తెలుసుకున్నారు. జైలు సూపరింటెండెంట్ సంతోష్‌రాయ్‌ని ఫోన్లో సంప్రదించారు. జైలు జీవితాన్ని అనుభవించడానికి తేదీలను ఖరారు చేసుకున్నారు. పంజాబ్ నుంచి బయలుదేరిన వారు మంగళవారం సాయంత్రం సంగారెడ్డికి చేరుకున్నారు. జైలు మ్యూజియంలో ఒక్కొక్కరు రూ.500 చొప్పున చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారికి జైలు సిబ్బంది బ్యారక్‌ను కేటాయించి యూనిఫాం, ప్లేట్లను అందజేశారు. ‘ఫీల్ ద జైలు’ గురించి వివరించారు. ఆశ్చర్యానికి లోనైనా వారు జైలు జీవితం గడిపేందుకు ముచ్చటపడ్డారు. జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చినట్లు విలేకరులతో తెలిపారు. ప్రపంచంలోనే ఇలాంటి అవకాశం ఎక్కడా లేదన్నారు. -
సంగారెడ్డి జైలులో వినూత్న కార్యక్రమం