Fiat car
-
కారుకు దెయ్యం పట్టిందా ఏంటి?!
చెన్నై: అమెరికాకు చెందిన టెస్లా తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉంది. అయితే ఈ సాంకేతికత అప్పుడే భారత్‌లో ప్రవేశించింది. తమిళనాడు రోడ్ల మీద సెల్ఫ్ డ్రైవింగ్ కారు షికారు చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఈ వీడియోలో ప్రీమియర్ పద్మిని అని పిలవబడే ఫియట్ కారు డ్రైవర్ లేకుండా రోడ్డు మీద ప్రయాణిస్తుంది. మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి ప్యాసింజర్ సీటులో ఉండగా.. డ్రైవర్ కూర్చునే స్థానం ఖాళీగా ఉండటం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ఫియట్ కారు ఎంతో నేర్పుగా ఇతర వాహనాలను అధిగమించడమే కాక సందులు, మలుపుల్లో చక్కగా వెళ్తుంది. దీని పక్కనే మరో వ్యక్తి వేరే వాహనంలో ఫాలో అవుతూ ఈ కారు షికారును వీడియో తీశాడు. తర్వాత దాన్ని ఫేస్బుక్లో షేర్ చేశాడు. ‘ఇది ఎలా సాధ్యంమవుతుంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. (చదవండి: తంతే రైలు అయినా వెనక్కి వెళ్లాల్సిందే!) ‘కారుకు దెయ్యం పట్టిందా ఏంటి?’ అంటూ కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజనులు. మరి కొందరు మాత్రం ఈ ఫీట్ వెనక రహ్యస్యాన్ని చేధించారు. ఈ కారు టూ వే పెడల్ సిస్టమ్ మోడల్‌ది అయి ఉంటుంది. అలాంటి కార్లలో రెండు వైపులా పెడల్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా డ్రైవింగ్ స్కూల్స్‌లో వినియోగిస్తారు. టీచర్ కూడా వాహనాన్ని నియంత్రించడానికి ఈ టూ వే పెడల్స్ మోడల్ కార్లని వాడతారు. ఇక్కడ కూడ అనుభవజ్ఞుడైన డ్రైవర్ ప్యాసింజర్ సీటులో కూర్చుని తన కూడి చేతితో స్టీరింగ్‌ని కంట్రోల్ చేస్తూ.. కారును నడుపుతున్నాడు అని తెలిపారు. మరి కొందరు ప్యాసింజర్ సీటులో కూర్చున్న వ్యక్తిని వెల్లూరు స్థానికుడిగా గుర్తించారు. అతడు చాలాసార్లు ఇలా ప్యాసింజర్ సీటులో కూర్చుని కార్ని డ్రైవ్ చేయడం తాము చూశామని తెలిపారు. -
అబ్బురపరుస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కారు
-
పీఎన్బీ లోన్‌తో కొన్న కారు ఇదే!
న్యూఢిల్లీ : ఓ వైపు నీరవ్ మోదీ వ్యవహారం పంజాబ్ నేషనల్ బ్యాంకుకు పెద్ద తలనొప్పిలా మారింది. ఎంతో నమ్మకమైన బ్యాంకుగా పేరున్న పీఎన్బీకి, నీరవ్ మోదీ వల్ల ఆ పేరు ఒక్కసారిగా మంట కలిసిపోయింది. దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణం నీరవ్ మోదీ పాల్పడుతున్నప్పటికీ, బ్యాంకు అధికారులు గుర్తించకపోవడం యావత్తు దేశాన్ని నివ్వెరపరిచింది. కానీ కోట్లకుకోట్లు కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ లాంటివారు ఈ బ్యాంకు కస్టమర్లుగా ఉన్నప్పటికీ, వారితో పాటు ఎంతో ఔన్నత్యం ఉన్న కస్టమర్లు కూడా ఈ బ్యాంకుకి ఉన్నారు. దీనికి సాక్ష్యం ఒకప్పటి కస్టమరైన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రినే. ఆయన చూపిన ఔన్నత్యం ఇప్పటికీ ఎవరూ మరచిపోలేరు. ఈ స్టోరీ 1964కు చెందింది. ప్రధానమంత్రి కాకముందు లాల్ బహదూర్ శాస్త్రికి సొంతిల్లూ, వాహనం ఉండేవి కావు. ప్రధాన మంత్రి అయ్యాక అధికారిక కారులోనే ఆయన పిల్లలు తోంగాలో సెయింట్ కోలంబా స్కూల్లో వెళ్లేవారు. కానీ దీనికి లాల్ బహదూర్ శాస్త్రి అనుమతించేవారు కాదు. ఈ సమయంలోనే తమకు ఓ సొంత కారు ఉంటే బాగుంటుందని తమ పిల్లలు సూచించారు. పలు ఎంక్వయిరీలు చేసిన తర్వాత కొత్త ఫియాట్ కారు కొనాలని శాస్త్రి నిర్ణయించారు. ఆ రోజుల్లో ఒక ఫియట్ కారు 12,000 రూపాయలకు దొరికేది. కానీ ఆయన బ్యాంక్ ఖాతాలో కేవలం 7 వేల రూపాయిలు మాత్రమే ఉన్నాయని తెలిసింది. కారు కొనడానికి కావాల్సిన మిగతా మొత్తం అంటే 5 వేల రూపాయల కోసం శాస్త్రి బ్యాంకు రుణం తీసుకోవాలని నిర్ణయించారు. అలా 5వేల రూపాయల రుణం తీసుకుని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు లాల్ బహదూర్ శాస్త్రి కస్టమర్ అయిపోయారు. ఇది జరిగిన ఒక సంవత్సరం తరువాత ఆ లోన్ తీర్చకముందే శాస్త్రి చనిపోయారు. ఆయన తరవాత ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ, ఆ లోన్‌ను మాఫీ చేయాలని ప్రభుత్వం తరఫున నిర్ణయించారు. కానీ శాస్త్రి భార్య లలితా శాస్త్రి దానికి ఎంతమాత్రం ఒప్పుకోలేదు. శాస్త్రి చనిపోయిన తర్వాత నాలుగేళ్లవరకు తనకొచ్చే పెన్షన్‌తో బ్యాంక్ రుణం మొత్తం తమ అమ్మ తీర్చేసినట్టు లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు అనిల్ శాస్త్రి తెలిపారు. క్రీమ్ రంగులో 1964 మోడల్ అయిన ఈ ఫియాట్ ఎంతో ఆకర్షణీయంగా ఉండేదని తెలిపారు. ప్రస్తుతం ఈ కారు ఢిల్లీలోని మోతిలాల్ నెహ్రూ మార్గ్ 1లో లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్‌లో ఉంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఈ కారును, ఆయన స్మృతులను చూడటానికి వస్తుంటారు. "కారు కొనడానికి మా నాన్నగారి దగ్గర తగినంత డబ్బు లేదని తెలిశాక, కారు వద్దులెండి అని మేము చెప్పాం. కానీ ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణం తీసుకుని మరీ కారును కొనుగోలు చేశారు" అని అనిల్ శాస్త్రి తెలిపారు. -
జుట్టుతో కారు జట్టు..
ఇది జుట్టున్న కారు.. చూశారుగా.. దీనికెంత కేశ సంపద ఉందో.. ఈ ఫియట్ కారుపై మొత్తం 120 కిలోల శిరోజాలు ఉన్నాయి. ఇటలీకి చెందిన హెయిర్ స్టైలిస్ట్ మారియా మగ్నో తన కారును మొత్తం మానవ కేశాలతో అలంకరించారు. లోపలా బయటా అంతటా అవే. ఇందుకోసం మొత్తం 150 గంటలు శ్రమించారు. 2010లో దీనికి సంబంధించిన విభాగంలో(మానవ కేశాలతో అలంకరించిన కారు) గిన్నిస్ రికార్డును(100 కిలోల శిరోజాలు) సాధించిన మారియా ఇటీవల మరో 20 కిలోల కేశాలు దానికి జత చేసి.. తన రికార్డును తానే బద్దలు కొట్టారు. ఈ రికార్డులో మన పాత్ర కూడా ఉందండి. ఎందుకంటే.. ఇందులో ఎక్కువ భాగం శిరోజాలు మనవే. ఐరోపా దేశాల వారితో పోలిస్తే.. మనవాళ్ల శిరోజాలు బలంగా.. ఎక్కువ కాలం మన్నేలా ఉంటాయట. దీంతో మారియా మన దేశం నుంచి శిరోజాలను దిగుమతి చేసుకుని మరీ.. ఈ కారు అలంకరణలో వినియోగించారు.