fiber content
-
Constipation Remedies: మలబద్ధకంతో బాధపడుతున్నారా.. నిర్లక్ష్యం చేస్తే!
మలబద్ధకం చాలామందిని వేధించే సమస్య. ఇది కేవలం ఉదయం పూట చెప్పుకోలేని బాధ మాత్రమే కాదు.. దీనివల్ల మున్ముందు కూడా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే భవిష్యత్తు ఆరోగ్యం దృష్ట్యా కూడా దీన్ని నివారించుకోవాల్సిన అవసరమూ ఉంది. పీచు పుష్కలంగా ఉండే ఆహారం, తాజా పండ్లతో దీన్ని నివారించుకోవడం సాధ్యం. అవి జీర్ణాశయమార్గాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు విరేచనం కూడా తేలిగ్గా అయ్యేలా చేస్తాయి. దేహంలో చక్కెరను నెమ్మదిగా వ్యాపించేలా చేసేందుకూ, కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను అదుపులో ఉంచడానికి దోహదపడతాయి. మనం వాడే అన్ని రకాల ధాన్యాల పొట్టులో పీచు పదార్థాలు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు.. ఉదాహరణకు దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు ఎక్కువ. కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచు పాళ్లు ఎక్కువ. చిక్కుళ్లలో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువే. చదవండి: బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కీ.. గుండెపోటుకీ తేడా తెలుసా? ఇక పండ్ల విషయానికి వస్తే.. పీచు ఎక్కువగా ఉండే బొప్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లు మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. అయితే పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మేలు. ∙పీచుపదార్థాలతో పాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది. అందుకే రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల) నీళ్లు తాగడం మేలు చేస్తుందని గ్రహించాలి. చదవండి: ‘స్టెమీ’ గుండెపోటు అంటే తెలుసా? ఎవరికి ఆ ప్రమాదం? -
ఆ హార్మోన్ వల్లనే బరువు పెరుగుతారు..! యాలకులు, వెల్లుల్లి, కరివేపాకు, తేనె, మజ్జిగ..
High Fibre Food For Weight Loss: ఇటీవలి కాలంలో ముఖ్యంగా కరోనా లాక్డౌన్ మూలంగా చిన్నా పెద్దా తేడా లేకుండా ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ తలెత్తిన సమస్య బరువు పెరగడం. బరువు పెరిగారనగానే వీలైనంతగా డైటింగ్ చేసి... పొట్ట మాడ్చుకుని, కొద్దిగా బరువు తగ్గగానే ఆ ఉత్సాహంతో యధావిధిగా తినేయడం.. ఆనక మునపటి కంటే ఎక్కువ బరువు పెరిగిపోవడం... లైపో సక్షన్ వంటి వాటి వరకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం... ఇవన్నీ అవసరమా..? ఇంతకంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా బరువు తగ్గచ్చు. దానిపై అవగాహన కోసమే ఈ వ్యాసం. సాధారణంగా బరువు పెరగడం తగ్గడం అనేది శరీరతత్వాన్ని బట్టి, వంశపారంపర్య కారణాలను బట్టి కూడా ఉంటుంది. బరువు పెరగడానికి గల కారణాలేమిటో తెలుసుకుంటే తగ్గడానికి మార్గం సులువే అవుతంంది. నిత్యం యోగాసనాలు, వర్కవుట్స్ వంటివి చేసే సినీతారలు, ఇతర సెలబ్రిటీలు కూడా బరువు తగ్గడానికి ఎంతో కష్టపడుతుంటారు. కానీ అందరికీ అలా వ్యాయామం చేయడానికి సమయం చిక్కదు. అలాగని డైటింగ్ చేస్తూ కడుపు మాడ్చుకోవడం కూడా కష్టమే. అందుకే చాలామంది సులభంగా బరువు తగ్గే మార్గాలను ఎంచుకుంటారు. అలాంటివారికి ఈ కింది చిట్కాలు ఉపయోగపడవచ్చు. చదవండి: Scientifically Proven Facts: నవ్వితే ఇన్ని ఉపయోగాలా? విస్తుపోయే వాస్తవాలు.. తరచు మంచి నీటిని తాగడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కొద్దిగా తింటే చాలు పొట్ట నిండుతుంది. భోజనానికి ముందు మంచినీళ్లు తాగని వారితో పోలిస్తే.. తాగేవారు త్వరగా బరువు తగ్గుతారు. 12 వారాలపాటు చేసిన అధ్యయనంలో తినడానికి ముందు నీరు తాగిన వారు 44 శాతం అధికంగా బరువు కోల్పోయినట్టు తేలింది. పెరగడానికి ముఖ్య కారణాలు నిద్రలేమి వల్ల లెప్టిన్, ఘెర్లిన్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలై ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరగడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. దానివల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. నిద్రలేమి, ఒత్తిడి వల్ల మధుమేహం, ఊబకాయం వంటి అనేక వ్యాధులు వస్తాయి. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పానీయాల వల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో సినిమాలు, వీడియోలు చూస్తూ తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఎందుకంటే.. వాటి ధ్యాసలో పడి అతిగా తినేస్తారు. బరువు తగ్గడానికి ఉపకరించే ఆహారాలు పసుపు: రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. ఎల్.డి.ఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్నుతగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది. యాలకులు: తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఇదివరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది. మిరప: మిరపలోని క్యాప్సైసిన్ క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. క్యాలరీలు తొందరగా ఖర్చయ్యేకొద్దీ కొలెస్ట్రాల్ పెరగదు. కరివేపాకు: శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును కరివేప చకచకా ఊడ్చేస్తుంది. దీనిని కూరల్లో కలిపి తిన్నా సరే, లేకపోతే రోజూ పది కరివేపాకులతో జ్యూస్ చేసుకొని తాగినా మంచిదే. వెల్లుల్లి: ఇందులోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని ‘ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్’ అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది. క్యాబేజీ: బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని వండుకుతినే వాళ్లలో కొలెస్ట్రాల్ మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నూనెతో చేయకుండా, ఉడికించిన క్యాబేజీ కూర తింటేనే మేలు. చదవండి: Lingcod Fish Interesting Facts: ఈ రాక్షస చేప నోట్లో వందల పళ్లు!!.. ఇప్పటికీ రహస్యమే.. పెసరపప్పు: కాల్షియం, పొటాషియం, ఇనుము పెసరపప్పులో పుష్కలం. వీటితోపాటు విటమిన్ ఎ, బి, సి, ఇ, ప్రొటీన్లు, ఫైబర్ దానిలో ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువ. కందిపప్పు మోజులో పడి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే పెసరపప్పు తినడం తగ్గించొద్దు. తేనె: మధురమైన రుచిని మాత్రమే కాదు, ఒబేసిటీని తగ్గించి, తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తుంది తేనె. రోజూ ఉదయం పూట వేడి నీళ్లలో పది చుక్కల తేనె కలుపుకొని తాగితే చురుగ్గా ఉంటారు. మజ్జిగ: గ్లాసుడు మజ్జిగలో 2.2 గ్రాముల కొవ్వు, 99 క్యాలరీలు ఉంటాయి. అదే పాలలో అయితే 8.9 గ్రాముల కొవ్వు 157 క్యాలరీలు ఉంటాయి. శరీరంలో తక్కువ కొవ్వును చేర్చి, ఎక్కువ శక్తిని ఇచ్చే గుణం మజ్జిగలో ఉన్నాయి. వెన్న తీసిన మజ్జిగతో బరువు కూడా తగ్గవచ్చు. సజ్జలు: అత్యధిక ఫైబర్ దొరికే ధాన్యాల్లో సజ్జలు ముందు వరుసలో ఉంటాయి. రాగి, జొన్న, గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. సజ్జలతో చేసిన రొట్టెలు తింటే ఇలాంటి ఉపయోగమే కలుగుతుంది. ఆలివ్ ఆయిల్: వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. సన్‌ఫ్లవర్, గ్రౌండ్నట్ ఆయిల్స్‌తో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ. అయినా అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి. చెక్క... మొగ్గ: చెక్క అంటే దాల్చిన చెక్క. మొగ్గ అంటే లవంగ మొగ్గ. ఈ రెండూ లేకుండా మసాలా వంటలుండవు. భారతీయ సంప్రదాయ వంటకాల్లో చెక్కా లవంగాల వాడకం ఈనాటిది కాదు. వీటిలోని ఉత్తమ ఔషధ గుణాలు డయాబెటీస్, కొలెస్ట్రాల్ల సమస్యలు రాకుండా చేస్తాయి. ఎల్.డి.ఎల్., ట్రై గ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి. పుచ్చకాయ, మరమరాలు వంటివి కూడా కడుపు నిండిన భావన కలిగిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనసు ఇతర పదార్థాల మీదికి మళ్లదు. దాంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి కూడా పాటించండి.. ►ఆహారాన్ని నెమ్మదిగా... నమిలి తినాలి. దీనివల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ వస్తుంది. ►మొక్కల నుంచి లభించే విస్కోస్ ఫైబర్ అనే పీచుపదార్థం బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. ►పీచు పదార్థాలు ఎక్కువ గా ఉండే ఆహారం వల్ల ఆకలి వేయదు. ఆకలి తగ్గితే శరీరంలోకి తక్కువ క్యాలరీలు చేరతాయి. ►ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువ ఉండాలి. ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండుతుంది. ►బీన్స్, ఓట్స్ సెరల్స్, మొలకలు, నారింజ, అవిసె గింజల్లో విస్కోస్ ఉంటుంది. ఇవన్నీ మీ రోజువారి ఆహారంలో ఉండేలా చూసుకుంటే అధిక బరువు తగ్గడమే కాదు... అధిక రక్తపోటు, మధుమేహం, జీర్ణకోశవ్యాధులనుంచి తప్పించుకోవచ్చు. చక్కటి ఆరోగ్యంతో హాయిగా జీవించవచ్చు. చదవండి: Science Facts: ఎక్సర్సైజ్ చేస్తే దేహాకృతి మారుతుందా? ఎంతవరకు నిజం.. -
పన్నీర్లో ప్లాస్టిక్.. జొమాటో క్షమాపణలు!
ముంబై : జొమాటో డెలివరీ చేసిన పన్నీర్ చిల్లీలో ప్లాస్టిక్ ఫైబర్‌ను గుర్తించిన ఓ వినియోగదారుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది. గత శుక్రవారం ఔరంగాబాద్‌కు చెందిన సచిన్ జామ్‌దారే జొమాటోలో పన్నీర్ చిల్లీ, పన్నీర్ మసాలా’ను ఆర్డర్ చేశాడు. దాన్ని కుటుంబ సభ్యులతో కలిసి తింటుండగా.. సచిన్ కుమార్తె అది తన పళ్లకు అంటుకుంటోందని, గట్టిగా చూయింగం ఉందని, పేర్కొంది. దీంతో దానిని పరీక్షించిన సచిన్ అందులో ఫైబర్ ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే ఆ ఆహారం సరఫరా చేసిన రెస్టారెంట్‌కు వెళ్లి ఫిర్యాదు చేసాడు. వారు పట్టించుకోకపోగా, జొమాటో డెలివరీ బాయ్ ఏదో చేసి ఉంటాడని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంతో కంగుతిన్న సచిన్ వెంటనే పోలీసుకు ఫిర్యాదు చేశాడు. రెస్టారెంట్ సరఫరా చేసిన ఆహారం తినడానికి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రూ.150 ఆహారంలోనే కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ తరహా మోసంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సచిన్ డిమాండ్ చేశాడు. ఇక ఈ ఆహారాన్ని పరీక్షలకు పంపించామని, నివేదిక అనంతరం దానిని సరఫరా చేసిన రెస్టారెంట్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఆ వినియోగదారుడికి క్షమాపణలు తెలిపింది. ఆ ఆహారాన్ని అందించిన రెస్టారెంట్‌ను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించినట్టు ప్రకటించింది. గతంలో కూడా ఓ జొమాటో డెలివరీ బాయ్ కస్టమర్ ఆర్డ్‌ర్ చేసిన ఫుడ్‌ని కొద్దిగా కొద్దిగా తిని.. తిరిగి ప్యాక్ చేసి డెలివరీ చేయడం వివాదస్పదమైన విషయం తెలిసిందే. -
‘ఫైబర్’ మ్యూజియం
పాల్వంచరూరల్ : కిన్నెరసాని లో జంతువుల బొమ్మలతో ఏర్పాటు చేసిన మ్యూజియం ఆకట్టుకుంటోంది. అహ్మదాబాద్‌కు చెందిన కళాకారులను రప్పించి వివిధ రకాల వన్యప్రాణుల బొమ్మలను తయారు చేయించారు. ఆరు నెలల క్రితం ప్రారంభించిన ఈ మ్యూజియం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కేంద్రప్రభుత్వం మంజూరు చేసి న నిధులతో కిన్నెరసానిలోని పర్యావరణ విద్యాకేంద్రాన్ని వన్య మృగాల సంరక్షణ విభాగం పర్యవేక్షణలో ఆధునికీకరించారు. కిన్నెరసాని అభయారణ్యంలో సంచరించే 24 రకాల అరుదైన జంతువుల బొమ్మలను అహ్మదాబాద్‌కు చెందిన ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు చెందిన కళాకారులు ఫైబర్ వస్తువులతో రూపొందించా రు. వీటిని రెండు ఏసీ గదుల్లో ఉంచారు. విద్యాకేంద్రంలోకి ప్రవేశించగానే ఎదురుగా మొసలి బొమ్మ కన్పిస్తుంది. పక్కనే ఉన్న గదిలో ఒక చెట్టుపై నెమలి, గుడ్లగూబ, చెట్టు కింద కొండ చిలువ పాము, కొంగ తదితర బొమ్మలు దర్శనమిస్తాయి. మరోగదిలో ప్రధానంగా అడవి దున్న, మొసలి, చిరుత,పులి, కొంగ, ఉడు ము, ఎలుగుబంటి, చుక్కల దుప్పి తదితర జంతువుల బొమ్మలను ఉంచారు. వృక్షాలు, జలాశయానికి సంబంధించిన షార్ట్ ఫిలిం థియేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 50మంది ఒకేసారి కుర్చోని వీక్షించ వచ్చు. వివిధ పక్షుల కిలకిలరావాలు, జంతువుల అరుపులకు సంబంధించిన ఆడియో రికార్డులను, వాటి చిత్రాలను కూడా అందుబాటులో ఉంచారు. రూ.20లక్షల వ్యయంతో.. రూ.20లక్షలతో వివిధ రకాల జంతువుల బొమ్మ లను తయారు చేసి పర్యావరణ విద్యాకేంద్రంలో ఏర్పాటు చేశాం. పర్యాటకులకు ఆహ్లాదాన్ని కల్గించేవిధంగా ఉంటా యి. షార్ట్ ఫిలిం థియేటర్ కూడా ఏర్పాటు చేశాం. మ్యూజియం ప్రారంభించిన తర్వాత నుంచి పర్యాటకుల స్పందన పెరిగింది. కిన్నెరసానిలో ఆహ్లాదంతోపాటు విజ్ఞానం కూడా అందిస్తున్నాం. -నాగభూషణం, వైల్డ్‌లైఫ్ ఎఫ్డీఓ -
హెల్దీ ఆహార్
చిరుధాన్యాల (మిల్లెట్)తో చేసిన రుచులు నోరూరిస్తున్నాయి. కావల్సినంత ఫైబర్ కంటెంట్‌తో వండిన ఆరోగ్యకర వంటలు బంజారాహిల్స్‌లో ఆదివారం ప్రారంభమైన ‘ఆహార్ బిస్ట్రో’లో ఘుమఘుమలాడుతున్నాయి. రాగ్లి, జొన్న ఇడ్లీలతో పాటు చిరుధాన్యాలతో వండివార్చిన ఉప్మా, వడ, దోశ, ఇడ్లీ, సంకటి, అంబలి, కొర్ర రైస్, బ్రౌన్‌రైస్ భోజన ప్రియులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. సామ పాయసం, బ్రౌన్ బాస్మతి బిర్యానీ, దంపుడు బియ్యం వంటకాలూ స్పెషల్‌గానే ఉన్నాయి. ‘కొర్ర, రాగి, జొన్న రవ్వలతో చేసిన మిల్లెట్ వంటకాల్లో ఐరన్, మాగ్నిషియమ్, పాస్ఫరస్, పొటాషియం లాంటి విటమిన్స్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జొన్న, రాగి, సజ్జ రొట్టెలను మటన్, గుత్తి వంకాయ కూరలతో తింటే ఆ రుచే అద్భుతం’ అని చెబుతున్నారు ఆహార్ ఎండీ అర్చన. చిరుధాన్యాలన్నింటినీ గిరిజన ప్రాంతాలైన ఆదిలాబాద్, కదిరి, మదనపల్లెల నుంచి తెప్పిస్తామన్నారు. పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ఇక్కడి వంటకాలను రుచి చూశారు. సాక్షి, సిటీ ప్లస్