హెల్దీ ఆహార్
చిరుధాన్యాల (మిల్లెట్)తో చేసిన రుచులు నోరూరిస్తున్నాయి. కావల్సినంత ఫైబర్ కంటెంట్‌తో వండిన ఆరోగ్యకర వంటలు బంజారాహిల్స్‌లో ఆదివారం ప్రారంభమైన ‘ఆహార్ బిస్ట్రో’లో ఘుమఘుమలాడుతున్నాయి. రాగ్లి, జొన్న ఇడ్లీలతో పాటు చిరుధాన్యాలతో వండివార్చిన ఉప్మా, వడ, దోశ, ఇడ్లీ, సంకటి, అంబలి, కొర్ర రైస్, బ్రౌన్‌రైస్ భోజన ప్రియులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. సామ పాయసం, బ్రౌన్ బాస్మతి బిర్యానీ, దంపుడు బియ్యం వంటకాలూ స్పెషల్‌గానే ఉన్నాయి.
‘కొర్ర, రాగి, జొన్న రవ్వలతో చేసిన మిల్లెట్ వంటకాల్లో ఐరన్, మాగ్నిషియమ్, పాస్ఫరస్, పొటాషియం లాంటి విటమిన్స్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జొన్న, రాగి, సజ్జ రొట్టెలను మటన్, గుత్తి వంకాయ కూరలతో తింటే ఆ రుచే అద్భుతం’ అని చెబుతున్నారు ఆహార్ ఎండీ అర్చన. చిరుధాన్యాలన్నింటినీ గిరిజన ప్రాంతాలైన ఆదిలాబాద్, కదిరి, మదనపల్లెల నుంచి తెప్పిస్తామన్నారు. పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ఇక్కడి వంటకాలను రుచి చూశారు.
సాక్షి, సిటీ ప్లస్