పక్షి పరిశోధనకు సొసైటీ...
తెలుగు రాష్ట్రాలలో మా సొసైటీ లో దాదాపు 400 మంది మెంబర్లుగా ఉన్నారు. వీరిలో అధికశాతం హైదరాబాద్‌లో ఉండగా ఆ తర్వాత తిరుపతి, వైజాగ్, కాకినాడకు చెందినవారూ సభ్యులుగా ఉన్నారు. ప్రతి నెల చివరి వారంలో ఒక కొత్త ప్రదేశానికి వెళ్లడం, అక్కడ పక్షులను గమనించడం, మార్పులను తెలుసుకోవడం, నివేదికలను పొందుపరచడం, ఫొటోల రూపంలో నిక్షి ప్తం చేయడం మా సొసైటీ ద్వారాం మేం చేస్తున్న పనులు. మూడు నెలలకు ఒకసారి ఇతర రాష్ట్రాలలోని పక్షి కేంద్రాలను గుర్తించి, అక్కడికి వెళుతుంటాం. ఇందుకు ఒక్కోసారి పది నుంచి యాభై మంది వరకు గ్రూప్‌గా కలుస్తుంటారు. వారు చూసిన, తెలుసుకున్న వివరాలను సొసైటీలోని సభ్యులందరికీ అంతర్జాలం ద్వారా తెలియపరుస్తారు. ఆసక్తి గల వారు ఎవ్వరైనా ఈ సొసైటీలో సభ్యులుగా చేరవచ్చు.
నియమాలు తప్పనిసరి...
ఒక పక్షిని దాని ముక్కు, పరిమాణం, రంగు, కాళ్లు, రెక్కలు, కళ్లు.. ఇవన్నీ చూసి, గుర్తించి, ఆ వివరాలను రికార్డుల్లో పొందుపరచాలి. అయితే, మనక న్నా ముందే మన రాకను పక్షి పసిగట్టేస్తుంది. అందుకని చాలా దూరం నుంచే పక్షులను చూడటానికి వెంట.. బైనాక్యులర్, ఎండ నుంచి రక్షణగా టోపీ, పక్షి వివరాలను తెలిపే ఫీల్డ్ గైడ్, ఒక బ్యాక్ ప్యాక్, సౌకర్యవంతంగా ఉండే షూస్, పక్షి గురించి రాసుకోవడానికి పేపర్-పెన్ను తప్పనిసరి అవసరం. కొంతమంది పక్షి విహారాన్ని వెళ్లినప్పుడు పక్షిని గూడు నుంచి బయటకు రప్పించడానికి సెల్లో బర్డ్ రింగ్ టోన్స్ పెడుతుంటారు. ఈ చర్య వల్ల పక్షి ఆందోళనకు లోనవుతుంది.
పక్షి గుడ్లు, పిల్లలను, గూళ్లను ఫొటో తీయకూడదు. అలాగే ఫొటోలు తీయడానికి ఫ్లాష్‌ను ఉపయోగించకూడదు. వీటి వల్ల పక్షులు బెదిరిపోయి, ఉన్న స్థావరాన్ని విడిచి వెళ్లిపోతాయి.
- సురేఖ ఐతా బత్తుల ఏపీ బర్డ్‌వాచ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్
surekha.aitabathula9@gmail.com