Finance Banking
-
ఏపీలో అడుగుపెట్టిన సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎస్ఎఫ్బీ) ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది. తొలి శాఖను విజయవాడలో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 నాటికి 564 శాఖలు, రూ.3,170 కోట్ల డిపాజిట్స్, 18.5 లక్షల మంది కస్టమర్లు ఉన్నారని బ్యాంక్ ప్రకటించింది. సేవింగ్స్ ఖాతాకు 6.25 శాతం వరకు, ఫిక్స్డ్ డిపాజిట్లపై 7 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ ఎంఎఫ్, ఎస్బీఐ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. -
ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, తస్మాత్ జాగ్రత్త !
న్యూఢిల్లీ: ‘నిధి’ కంపెనీలపట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం మరోసారి పేర్కొంది. నిబంధనలు పాటించడంలో కనీసం 348 కంపెనీలు విఫలమైనట్లు తెలియజేసింది. వెరసి పెట్టుబడులు చేపట్టేముందు కంపెనీ పూర్వాపరాలు పరిశీలించమంటూ ఇన్వెస్టర్లకు సూచించింది. గత ఆరు నెలల్లో నిధి కంపెనీలపట్ల జాగ్రత్త వహించమంటూ కార్పొరేట్ వ్యవహారాల శాఖ రెండోసారి హెచ్చరించడం గమనార్హం! భారీ సంఖ్యలోని నిధి కంపెనీలు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేయడంలేదని ప్రభుత్వం వెల్లడించింది. కంపెనీల చట్టం 2013, నిధి నిబంధనలు 2014ను అమలు చేయడంలో వైఫల్యం పొందుతున్నట్లు వివరించింది. నిధి కంపెనీలు బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థల పరిధిలోకి వస్తాయి. సెక్షన్ 406తోపాటు, సవరించిన నిధి నిబంధనల ప్రకారం ఎన్‌డీహెచ్–4 కోసం దరఖాస్తు చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. 2021 ఆగస్ట్ 4వరకూ చూస్తే నిధి చట్టంకింద దరఖాస్తు చేసిన కంపెనీలలో 348వరకూ తగినస్థాయిలో నిబంధనలను అందుకోలేకపోయినట్లు వెల్లడించింది. చదవండి : జులైలో ముడి చమురు ఉత్పత్తి తగ్గింది -
ట్రిబ్యునల్స్‌పై నిబంధనల కొట్టివేత
న్యూఢిల్లీ: ట్రిబ్యునల్స్‌పై కేంద్రం రూపొందిం చిన నిబంధనలను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. కేంద్రానికి ఎదురుదెబ్బలాంటి ఈ తీర్పు వివరాల్లోకి వెళితే... జుడీషియల్ ట్రిబ్యునల్స్ కూర్పు, విధివిధానాలపై ‘ఫైనాన్స్ యాక్ట్ 2017’ మనీ బిల్లు కింద కేంద్రం కొన్ని కీలక నిబంధనలను తెచ్చింది. వివిధ ట్రిబ్యునళ్ల సభ్యుల నియామకాలు, సర్వీస్ నిబంధనలకు సంబంధించిన ఈ నిబంధనావళి పట్ల ప్రతిపక్ష పార్టీల సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ నియమాలను తోసిపుచ్చుతూ, వీటి అమలు ప్రభావాలను అధ్యయనం చేసి, అత్యున్నత న్యాయస్థానానికి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. మనీ బిల్లుగా ఫైనాన్స్ యాక్ట్ 2017 ఆమోదించడంలో చట్టబద్దతను పరిశీలించడానికి ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సైతం ఐదుగురు సభ్యుల ధర్మాసనం నివేదించింది. 2017 ఫైనాన్స్ చట్టం 184వ సెక్షన్ కింద ఈ నిబంధనలను కేంద్రం రూపొందించిన అంశాన్ని ధర్మాసనం ప్రస్తావిస్తూ, అయితే ఈ నియామకపు ప్రక్రియ ప్రస్తుతం అమల్లో ఉన్న విధి విధానాలకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొంది. -
ఏడాదిలో ఐపీఓకి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పబ్లిక్ ఆఫర్‌కు వస్తామని సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓ ఆర్.భాస్కర్ బాబు చెప్పారు. ఐపీఓ ద్వారా 450– 500 కోట్ల రూపాయలను సమీకరించాలని లకి‡్ష్యస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే ఇన్వెస్టర్ల నుంచి రూ.248 కోట్లు సమీకరించామని, ప్రస్తుతం బ్యాంకులో హెచ్డీఎఫ్సీ, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్, ఐడీఎఫ్సీ, ఐఎఫ్‌సీ, గజా క్యాప్, లోక్ క్యాప్ తదితర సంస్థలకు వాటాలున్నాయని తెలియజేశారు. మూలధన అవసరాలను బట్టి రానున్న రోజుల్లో మరిన్ని నిధులు సమీకరిస్తామని, ఇప్పుటికైతే ఆర్థిక వనరులకు కొరత లేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి శాఖను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన సందర్భంగా మంగళవారమిక్కడ విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో బ్రాంచ్‌ను ఆరంభిస్తామని, క్రమంగా రెండు తెలుగురాష్ట్రాల్లో 25కు పైగా శాఖల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తమకు అన్ని బ్యాంకు శాఖల్లో 4వేల మంది ఉద్యోగులున్నారని, త్వరలో మరిన్ని రిక్రూట్మెంట్స్ చేపడతామని తెలిపారు. పెద్ద బ్యాంకులతో పోటీ లేదు ఆర్బీఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు అనుమతులివ్వడంలో ప్రధానోద్ధేశం చిన్న రుణాలను విస్తృతీకరించడమేనని భాస్కర్ చెప్పారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా అవతరించి రెండేళ్లయిందని, బడా బ్యాంకులతో తమకు పోలిక, పోటీ లేవని చెప్పారు. ‘‘సమర్ధవంతమైన వ్యయనియంత్రణ కారణంగా పెద్ద బ్యాంకులతో పోలిస్తే డిపాజిట్లపై దాదాపు 1 శాతం వరకు మేం ఎక్కువ వడ్డీ ఇవ్వగలుగుతున్నాం. మేమిచ్చే రుణాల్లో అన్సెక్యూర్డ్ రుణాలు ఎక్కువ శాతం ఉన్నా, అవన్నీ చిన్న మొత్తాలు కావడ వల్ల వసూలు పరంగా ఇబ్బందులు రావడం లేదు. లోన్‌బుక్‌లో చిరు వ్యాపారులకు 1– 5 లక్షల రూపాయల వరకు రుణాలు, వాహన రుణాలు, ఎస్ఎంఈ రుణాలు, చిన్నగృహరుణాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద పెద్ద రుణాలు మా పోర్టు ఫోలియోలో ఉండవు కాబట్టి ఎన్పీఏల సమస్య చాలా తక్కువ’’ అని వివరించారు. క్యు3లో స్థూల ఎన్పీఏలు 2.94 శాతం, నికర ఎన్పీఏలు 0.94 శాతంగా ఉన్నాయని చెప్పారాయన. -
డీసీసీబీపై విచారణ తప్పదా ?
* ఏ క్షణంలోనైనా ఆదేశాలు వచ్చే అవకాశం ఉందంటున్న సహకార వర్గాలు * అక్రమాలు జరిగాయంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదుల వెల్లువ * వాటికి తోడైన సొసైటీల్లో బినామీ రుణాల వ్యవహారం సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో దాదాపు 23 సొసైటీల్లో విచారణలు జరిగాయి. వాటిలో జరిగిన అక్రమాలు వెలుగు చూశాయి. మిగతా సొసైటీలు కూడా చాలావరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. కాకపోతే గతంలో జిల్లాలో ఓ కీలక నేత అండగా ఉండడంతో వాస్తవాలు బయటకు రాలేదు. ఆ నేత ఇప్పుడు మాజీ అయ్యారు. దీంతో లొసుగులు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇంతలా అవినీతి జరిగిందంటే సొసైటీలకు ఫైనాన్స్ బ్యాంకింగ్‌గా ఉన్న డీసీసీబీ ప్రమేయం కూడా ఉండొచ్చనే వాదన విన్పిస్తోంది. డీసీసీబీలో కూడా అదే తరహా అక్రమాలు జరిగాయని, ఇష్టమొచ్చినట్టు రుణాలు మంజూరు చేశారని, బినామీల పేరుతో రుణాలు కాజేశారని, పీఏసీఎస్‌లకు అదనంగా ఫైనాన్స్ ఇచ్చేందుకు పెద్ద ఎత్తున పర్సంటేజీలు చేతులు మారాయని, స్టేషనరీ, ఫర్నీచర్, కంప్యూటర్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల నియామకాలు చేపట్టారని, దినసరి వేతన కార్మికుల నియామకాల్లో చేతివాటం ప్రదర్శించారని, ఇవ్వకుండానే రికార్డుల్లో కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలు ఇచ్చినట్టు నమోదు చేశారని, అంచనాలకు మించి పార్వతీపురం, చీపురుపల్లి జిల్లా కేంద్ర సహకార బ్రాంచ్‌ల భవన నిర్మాణాలకు ఖర్చు పెట్టారన్న ఆరోపణలొచ్చాయి. వీటిపై అప్పట్లో హైదరాబాద్‌కు చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాలో పనిచేస్తున్న ఇద్దరు ఆప్కాబ్ అధికారులు, నాబార్డు నుంచి ఒక ప్రతినిధి సంయుక్తంగా ఇక్కడికొచ్చి విచారణ చేశారు. వీరితో పాటు సమాంతరంగా విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు నివేదిక కూడా ఇచ్చారు. కాకపోతే, దానిపై చర్యలు తీసుకోకుండా అప్పట్లో ఓ నేత అడ్డుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆదాయ పన్ను ఆడిట్ చేసేందుకు గాను చార్టెడ్ అకౌంటెంట్‌కు రూ.55లక్షలను డీసీసీబీ అడ్డగోలుగా చెల్లించింది. దీనివెనుక కుతంత్రం ఉందని, చార్టెడ్ అకౌంటెంట్‌కు ఆ మొత్తం పూర్తిగా అందలేదని, డీసీసీబీకి చెందిన పలువురు పెద్దలకు అందులో కొంత సొమ్ము చేరిందని ఆరోపణలొచ్చాయి. నాబార్డ్, ఆప్కాబ్ అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీనిపై విచారణ జరిపిన నాబార్డు, ఆప్కాబ్ అధికారులు జరిగిన తప్పును గుర్తించారు. అనవసరంగా చార్టెడ్ అకౌంటెంట్‌కు రూ.55లక్షలు చెల్లించారని, ఘోర తప్పిదమని తేల్చారు. సత్వరమే రికవరీ చేయాలని ఆదేశించారు. దీంతో చేసేదేమీ లేక చార్టెడ్ అకౌంటెంట్ నుంచి ఆ మొత్తాన్ని డీసీసీబీ అధికారులు రికవరీ చేశారు. కానీ, బాధ్యులైన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలొచ్చాయి. నాటి కీలక నేత లక్ష్యంగా ఫిర్యాదులు: ఈ వ్యవహారాలన్నింటినీ ఇప్పుడు కొందరు తవ్వుతున్నారు. ఆ ఆరోపణలనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు రూపంలో పంపిస్తున్నారు. ప్రత్యక్షంగా డీసీసీబీపై ఉన్న ఆరోపణలు, మరోవైపు సొసైటీల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు దృష్ట్యా లోతుగా విచారణ చేపడితే వాస్తవాలు బయటికొస్తాయని ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. ఆ దిశగా ఉన్నత స్థాయి వర్గాలు కూడా దృష్టి సారిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే నాటి కీలక నేతను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు పావులు కదుపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏ క్షణంలోనైనా సొసైటీలతో పాటు డీసీసీబీపై కూడా విచారణ చేపట్టే అవకాశం ఉందని భోగట్టా.