
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ) ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది. తొలి శాఖను విజయవాడలో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 నాటికి 564 శాఖలు, రూ.3,170 కోట్ల డిపాజిట్స్, 18.5 లక్షల మంది కస్టమర్లు ఉన్నారని బ్యాంక్ ప్రకటించింది.
సేవింగ్స్ ఖాతాకు 6.25 శాతం వరకు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ ఎంఎఫ్, ఎస్‌బీఐ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ను ప్రమోట్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment