అగ్ని ప్రమాదంలో 20 జీవాలు సజీవదహనం
సుబ్లేడు(తిరుమలాయపాలెం) : మండలంలోని సుబ్లేడు గ్రామ పంచాయతీ పరిధిలోని గోనెతండాలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 20 జీవాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. గోనెతండాకు చెందిన భూక్యా సక్రు జీవాలను సాకుతూ జీవన ం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి జీవాల పాకకు నిప్పంటుకోవడంతో 20 జీవాలు పూర్తిగా సజీవ దహనం అయ్యాయి. వాటి విలువ రూ. లక్ష ఉంటుందని బాధితుడు తెలిపాడు.