fish lorry
-
చేపల లారీ బోల్తా తృటిలో తప్పిన ప్రమాదం
పశ్చిమగోదావరి, భీమవరం టౌన్: భీమవరం పట్టణం రామ లక్ష్మణ్ నగర్ వంతెన మలుపులో గురువారం చేపల లోడు లారీ పంట కాలువలో బోల్తా పడింది. అదృష్టవశాత్తూ లారీలో ఉన్న వ్యక్తులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. గూట్లపాడు గ్రామం నుంచి లారీ నారాయణపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరి గింది. టూ టౌన్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
పంటకాల్వలోకి చేపల లారీ బోల్తా
ముదినేపల్లి రూరల్: చేపల లోడుతో వెళుతున్న లారీ పంటకాల్వలో దూసుకెళ్లింది. వివరాల ప్రకారం గురువారం రాత్రి కైకలూరు నుంచి ముంబై కి 10 టన్నుల చేపలతో లారీ బయిలు దేరింది. ముదినేపల్లి సమీపంలోకిరాగానే డ్రైవర్ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో పక్కనే ఉన్న పోలరాజ్ పంట కాల్వలోకి బోల్తా కొట్టింది. లారీ పూర్తిగా నీటిలో మునిగి పోయింది. లారీని క్రేన్ సహాయంతో బయటకు తీసేందుకు నానా అవస్థలు పడ్డారు. రహదారిపై పలుసార్లు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు లారీని కాలువ ఒడ్డుకు తీసి చేపలను మరో లారీలోకి మార్చారు. అధికలోడు, డ్రైవర్ అజాగ్రత్త వల్ల ప్రమాదంజరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రూ. 10 లక్షల సరుకులో కొంత నష్టపోయినట్లు ఎగుమతిదారులు చెబుతున్నారు.