Fishing families
-
కులాసా.. మత్స్యకార భరోసా
ఆటుపోటుల జీవితం.. సముద్రంలో వేటకు వెళితేగాని పూట గడవని బతుకు సమరం.. వారి జీవితాల్లో మార్పులు వచ్చాయి.. పథకాలు ముంగిటకు వచ్చి చేరుతున్నాయి.. వేట విరామ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న మత్స్యకార భరోసా వారికి కొండంత అండగా నిలుస్తోంది. గంగపుత్రుల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. వరుసగా నాలుగో ఏడాది మత్స్యకార భరోసా సాయం అందించేందుకు ప్రభుత్వం సర్వే చేసింది. వచ్చే నెలలో అర్హుల ఖాతాల్లోకి సొమ్ములను జమచేయనుంది. నరసాపురం : చేపల పునరుత్పత్తి సీజన్లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తుంది. ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 15వ తేదీ వరకు 61 రోజులపాటు మత్స్యకారులు ఖాళీగా ఉంటారు. ఈ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటారు. పడవలు, వలలు మరమ్మతులు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మత్స్యకార భరో సా పథకాన్ని ప్రవేశపెట్టి కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. గతంలో ఉన్న అర్హుల సంఖ్యను పెంచుతూ మరింత మందికి చేయూతగా నిలుస్తోంది. జిల్లాలో 19 కిలోమీటర్లు మేర తీరం ఉండగా నరసాపురం ప్రాంతంలో దాదాపు 2 వేల మంది వేటపై ఆధారపడి బతుకుతున్నారు. పాదయాత్ర హామీ మేరకు.. పాదయాత్ర చేసిన సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నరసాపురం వేదికగా వేట నిషేధ సా యా న్ని రూ.10 వేలకు పెంచుతానని ప్రకటించారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో మ త్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. అప్పటికి 173 మంది మాత్రమే అర్హులు ఉండగా ఆ సంఖ్యను 1,072కు పెంచి సాయం అందించారు. అలాగే 2020, 2021లో పథకాన్ని సమర్థవంతంగా అమలుచేశారు. ఈ ఏడాది కూడా పథకానికి అర్హులను గుర్తించారు. గతంలో సాయం నామమాత్రంగా ఉండగా ఈ ప్రభుత్వంలో వేలాది మందికి కోట్లాది రూపాయల లబ్ధి చేకూరుతోంది. గతంలో ముప్పుతిప్పలు గతంలో వేట నిషేధ సాయం కోసం మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. నిషేధం ము గిసి వేట ప్రారంభమైన ఐదారు నెలల తర్వాత కొద్దిమందికి మాత్రమే అరకొరగా సాయం అందించేవారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ, బడా నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. 2014కు ముందు రిలీఫ్ కమ్ సేవింగ్స్ స్కీమ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.600, కేంద్ర ప్రభు త్వం రూ.600 కలిపి రూ.1,200 అందించేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ఎగ్గొట్టారు. 2015లో 52 మందికి రూ.1.04 లక్షలు, 2016లో 46 మందికి 0.92 లక్షలు, 2017లో 104 మందికి రూ.4.16 లక్షలు, 2018లో 173 మందికి రూ.6.92 లక్షలు మా త్రమే నామమాత్రంగా అందించారు. జగన్ వచ్చాకే డబ్బులు వస్తున్నాయి మాకు ఏ పథకాలు ఉన్నాయో తెలిసేది కాదు. వేట విరామ సమయంలో రూపాయి వచ్చేది కాదు. జగన్ ముఖ్య మంత్రి అయిన తర్వాత మూడేళ్ల నుంచి వేట విరామ సమయంలో రూ.10 వేల చొప్పున మా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. ఈ ఏడాది కూడా నాపేరు ఎంపిక చేశారు. వేట లేని సమయంలో ఇదే మాకు ఆధారం. – పెమ్మాడి గంటయ్య, మత్స్యకారుడు, నరసాపురం చాలా ఆనందంగా ఉంది చిన్నప్పటి నుంచి వేట తప్ప మరేమీ తెలియదు. ఏటా వేసవిలో రెండు నెలలు వేట ఉండదు. ఆ సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. గతంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడు అలాకాదు కుటుంబానికి రూ.10 వేలు ఇస్తున్నారు. అదీ నా బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు. ఆనందంగా ఉంది. – మైలా రాముడు, పీఎం లంక, మత్స్యకారుడు సర్వే పూర్తయ్యింది నరసాపురం తీరంలో మాత్రమే మత్స్యకార భరోసా లబ్ధిదారులు ఉన్నారు. ఈ ప్రాంతంలో 141 ఇంజిన్ బోట్లు ఉన్నాయి. వీటిపై పనిచేసే మత్స్యకార్మికులు 1,454 మందిని గుర్తించాం. వీరందరికీ మత్స్యకార భరోసా పథకానికి ఎంపిక చేశాం. ఈ మేరకు సర్వే పూర్తయ్యింది. వచ్చేనెలలో వీరందరికీ సొమ్ములు పడతాయి. – వి.ఏడుకొండలు, మత్స్యశాఖ అధికారి, నరసాపురం -
సముద్రం నుంచి సముద్రానికి
చిన్నప్పుడు వేటకు వెళ్లిన తండ్రి ఒక్కోసారి ఖాళీ చేతులతో తిరిగి వచ్చేవాడు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవాడు. పడిన సరుకును సరిగ్గా అమ్ముకోగలిగేవాడు కాదు. ఇవాళ 45 ఏళ్ల వెల్విగి మెరైన్ బయాలజిస్ట్‌గా మారి తమిళనాడు కారైకల్ ప్రాంతంలో మత్స్యకారులకు సురక్షిత చేపల వేటకు సాయం చేస్తోంది. బెస్త స్త్రీల స్వయం సమృద్ధికి మార్గదర్శనం చేస్తోంది. 35 ఏళ్ల క్రితం వెల్విగికి పదేళ్లు. ఇంటికి పెద్ద పిల్ల. తన తర్వాత ముగ్గురు తోబుట్టువులు. తమిళనాడు నాగపట్టణం బెస్తపల్లెలో తండ్రి ఉదయాన్నే నాలుగ్గంటలకు చేపల వేటకు కొయ్య పడవ మీద బయలుదేరుతూ ఉంటే నిద్ర కళ్లతో చూసేది. వేటకు వెళ్లిన తండ్రి రెండు మూడు రోజులు రాడు. ఆ అన్ని రోజులు వెల్విగి దేవుణ్ణి ప్రార్థిస్తూ తండ్రి కోసం ఎదురు చూసేది. తండ్రి తిరిగి వచ్చేంత వరకూ తండ్రికీ ఇంటికీ మధ్య ఏ కమ్యూనికేషనూ ఉండేది కాదు. వాతావరణం మారితే ప్రమాదం. తుఫాను వస్తే ప్రమాదం. లేదా అంతర్జాతీయ జలాల్లోకి పడవ వెళ్లిపోతే ప్రమాదం. ఇన్ని ప్రమాదాలు దాటుకుని తండ్రి ఇల్లు చేరితే అదృష్టం. 35 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నాగపట్టణం చుట్టుపక్కలే కాదు తమిళనాడు బెస్తపల్లెలన్నింటిలోనూ వెల్విగి తన సాంకేతిక ఆలోచనలతో బెస్తవాళ్లకు ఒక ధైర్యంగా మారింది. దానికి కారణం ఏ బెస్త కుటుంబమూ ఆందోళనగా బతక్కూడదని. ఏ బెస్త ఇంటి పిల్లలు తండ్రి కోసం భయం భయంగా ఎదురు చూడకూడదు అని. అలా వారి సాయం కోసం తాను మారాలంటే మెరైన్ బయాలజీ చదవాలి. కాని బెస్త ఇళ్లల్లో ఆడపిల్లలకు అంత చదువా? ‘మన దేశంలో దాదాపు 3 వేలకు పైగా బెస్త పల్లెలు ఉన్నాయి. దాదాపు 10 లక్షల మంది బెస్త కుటుంబాలు ఉన్నాయి. 40 లక్షల బెస్తలు సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. వీరిలో 90 శాతం మంది సంప్రదాయ మత్స్యవేట చేస్తారు. వీరిలో ఇప్పటికి మూడు వంతుల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉంటే ఇక ఆడపిల్లలకు చదువు ఎక్కడ?’ అంటుంది వెల్విగి. బిఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ మెరైన్ బయాలజీలను వెల్విగి తన మేనమామ సాయంతో చదువుకుంది. ‘ఆ చదువులో కూడా వివక్ష ఎదుర్కొన్నాను. బెస్త అమ్మాయి ఇలాంటి చదువు చదవడం కొందరి దృష్టిలో వింతగా ఉండేది’ అంటుంది వెల్విగి. ఇక తన కాళ్ల మీద తాను నిలబడక తప్పలేదు. పూంపుహార్‌లోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ‘ఫిష్ ఫర్ ఆల్ రీసెర్చ్ అండ్ ట్రయినింగ్ సెంటర్’ పేరుతో ఒక ప్రోగ్రామ్ని తీసుకుంటే అందులో పని చేయడానికి రామేశ్వరం వెళ్లింది వెల్విగి. అది తన ఊరికి 265 కిలోమీటర్ల దూరం. ‘కాని నాకు తప్పలేదు. డబ్బులు కావాలి’ అంది వెల్విగి. పదేళ్లు ఆ సంస్థలో పని చేశాక తిరిగి పిహెచ్డి పనిని స్వీకరించి అన్నామలై యూనివర్సిటీ నుంచి పూర్తి చేసింది. అక్కడి బెస్త సమూహంలో పిహెచ్డి చేసిన తొలి మహిళ వెల్విగి. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థలో ప్రస్తుతం సీనియర్ సైంటిస్ట్‌గా పని చేస్తున్న వెల్విగి బెస్తవారి కోసమే ప్రత్యేకంగా ‘మీనవా నన్బన్’ (బెస్తవారికి మిత్రుడు) యాప్‌ను డెవలప్ చేయడంలో సాయపడింది. ఇప్పుడు తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో కనీసం 50 వేల మంది ఈ యాప్ వాడుతున్నారు. మత్స్య పడవల నేవిగేషన్లో ఇది సాయపడుతోంది. అంతేకాదు తీరంతో కమ్యూనికేషన్‌ను కూడా సులభం చేస్తుంది. ‘బెస్తవారి సంప్రదాయ చేపల వేట ప్రకృతి సహజమైనది. అయినప్పటికీ వలకు పడాల్సిన చేపలతో పాటు అనవసరపు సముద్ర జీవులు (బైక్యాచ్) కూడా పడుతూ ఉంటాయి. వాటిని కాకుండా కేవలం చేపలు మాత్రమే పడాలంటే ఏం చేయాలో నేను గైడ్ చేస్తూ ఉంటాను. అలాగే వలలో తాబేళ్లు చిక్కకుండా చిక్కిన తాబేళ్లు ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా వాటిని తిరిగి సముద్రంలో వదిలేలా బెస్తవారికి ట్రైనింగ్ ఇస్తుంటాను’ అంటుంది వెల్విగి. ఆమె ఊరికే బోర్డు మీద పాఠాలు చెప్పే రకం కాదు. ఇప్పటికి చేపల వేటకు వెళ్లే పడవల్లో కనీసం 150 సార్లు సముద్రం మీదకు వెళ్లింది. వారితోనే ఉంటూ మెళకువలు చెబుతుంది. ఏ సమయంలో ఏ ప్రాంతంలో చేపలు పడతాయో వారికి బోధ పరుస్తుంది. ‘ఇదంతా నా చదువు వల్ల మాత్రమే కాదు. మా నాన్న నుంచి తీసుకున్న అనుభవం కూడా’ అంటుంది వెల్విగి. మత్స్స సంపద నుంచి స్త్రీలు ఆదాయం గడించేలాగా వారికి ఫుడ్‌కోర్టులు నడపడం ఎలాగో, నిల్వ ఆహారం చేయడం ఎలాగో, ఎండు చేపల మార్కెట్... వీటన్నింటి గురించి కూడా ఆమె తర్ఫీదు ఇస్తోంది. దాదాపు 17 వేల మంది మహిళలు ఆమె వల్ల లబ్ది పొందారు. ‘మత్స్యకారుల్లో వయసుకు వచ్చిన అబ్బాయిలు వేటలో పడకుండా, అమ్మాయిలు పెళ్లిలోకి వెళ్లకుండా చదువుకోవాలంటే ప్రభుత్వ పరంగా చాలా చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి జీవితాల్లో వెలుగు’ అంటుంది వెల్విగి. సముద్రంలో మత్స్యకారులతో వెల్విగి బెస్త మహిళలు, మత్స్యకారులతో వెల్విగి -
మాటంటే.. మాటే...
కాకినాడ రూరల్ : ‘సముద్రంలో వేటకు వెళ్లి మరణించిన మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటాం’ ఇటీవల కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పగడాలపేట, ఉప్పలంక గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ఇది... ఆయన మాట ప్రకారం ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు, కాకినాడ పార్లమెంటు పార్టీ నాయకులు చలమలశెట్టి సునీల్‌లు మత్స్యకార కుటుంబాలను కలసి పార్టీపరంగా రూ.50వేల నగదును బాధితకుటుంబాలకు అందజేశారు. పార్టీ పరంగా ఇచ్చే సాయంతో పాటు ప్రభుత్వపరంగా రావల్సిన ఆర్థికసాయం అందేలా చూస్తామని నాయకులు స్పష్టం చేశారు. ‘ప్రభుత్వపరంగా తమకు ఇప్పటి వరకు ఎటువంటి సాయం అందలేదని, మీరు చేసిన సాయం ఎన్నటికీ మరువలేమని బాధిత కుటుంబాలు వైఎస్సార్సీపీ నాయకుల వద్ద వాపోయాయి. జననేత జగన్ చల్లగా ఉండాలని పలువురు మత్స్యకార కుటుంబాలు ఆశీర్వదించాయి. నెహ్రూ, వేణు, సునీల్‌లు కరప మండలం ఉప్పులంకలో బొమ్మిడి పెదకామేశ్వరరావు కుటుంబానికి, పగడాలపేటలో కామాడి నూకరాజు, చెక్కా బుజ్జిబాబు, కర్రి రాజు, దరిపల్లి సింహాద్రిలకు ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి రూ. 50వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. తుపానులో బోటు తిరగబడిన సంఘటనలో ఏడుగురు మత్స్యకారులు చనిపోగా, మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన వాడముదుల పెదకోటయ్యకు పరామర్శించి అతడికి రూ.పది వేలు ఆర్థికసాయాన్ని అందజేశారు. అనంతరం వైఎస్సార్ విగ్రహం సమీపంలో ఉన్న కుదులు బుజ్జి కుమారుడికి రెండు కళ్లు లేకపోవడంతో ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం రూ.ఐదు వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో యువత రాష్ట్ర కార్యదర్శి లింగం రవి, ముత్యాల సతీష్, రాష్ట్రవాణిజ్య విభాగం కార్యదర్శి ఆనంద్న్యూటన్, గట్టి రవి, రామదేవు సూర్యప్రకాశరావు, పార్టీ నాయకులు గరికిన అప్పన్న, కర్రి గంగాచలం, వాసంశెట్టి త్రిమూర్తులు, దాట్ల సత్యనారాయణరాజు, జగడం అప్పారావు, జగడం శ్రీహరి, తోట శ్రీధర్, పులగల శ్రీనుబాబు, దాసరి గంగాధర్ పాల్గొన్నారు. -
శ్రద్ధాంజలి
చెన్నై, సాక్షి ప్రతినిధి :సముద్రం 2004 డిసెంబరు 26వ తేదీన ఒక్కసారిగా ఉప్పొంగింది. అలలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నంతగా ఎగసిపడ్డాయి. లక్షలాది మందిని ఒక్క ఉదుటున తమలో కలుపుకున్నాయి. సముద్ర తీరంలో నివసించే వేల మత్స్యకార కుటుంబాలు జలసమాధి అయ్యాయి. మరెన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. భారత్, శ్రీలంక, ఇండోనేషియాలోని పలు ప్రాంతాలు ఎక్కువగా సునామీ ధాటికి దెబ్బతినగా 2.30 లక్షల మంది మృత్యువాతపడ్డారు. తమిళనాడు సముద్రతీర జిల్లాలైన చెన్నై, కడలూరు, నాగపట్నం, రామనాథపురం, కన్యాకుమారిలోని పలు ప్రాంతాలు సునామీ బారినపడ్డాయి. రాష్ట్రంలో సుమారు పది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నాగపట్నం జిల్లాలో అత్యధికంగా 6065 మంది ప్రాణాలు విడిచారు. చెన్నైలో 300 మంది మృత్యువాతపడ్డారు. సముద్రంలో ఎగసి పడుతున్న అలలను తిలకించేందుకు వెళ్లిన వందలాది మంది చిన్నారులను సైతం అలలు తమలోకి లాక్కెళ్లడం కళ్లారా చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సునామీ దాడికి గురైన మత్స్యకార గ్రామాల ప్రజలు అనాటి దుర్దినాన్ని తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చెన్నై మెరీనా తీరం వద్ద అన్నాడీఎంకే, డీఎంకే నేతలు, మత్స్యకార సంఘాల నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సముద్రంలో పాలు పోశారు. సముద్ర తీరంలో కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. ‘సముద్రపు తల్లీ.. సముద్రపు తల్లీ.. మరోసారి మాతో కన్నీళ్లు పెట్టించకు’ అంటూ ప్రార్థించారు. నాగపట్నం జిల్లా కలెక్టరేట్లోని సునామీ స్మారక పార్కులో మత్స్యశాఖ మంత్రి జయపాల్, జిల్లా కలెక్టర్ మునుస్వామి శ్రద్ధాంజలి ఘటించారు. కన్యాకుమారి జిల్లాలో 199 మందిని బలి తీసుకున్న కొట్టిల్పోలు గ్రామంలో మౌనంగా ర్యాలీ చేపట్టారు.