ప్రజల కోసమే సత్యాగ్రహం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ భూములను పరిరక్షించాలని గ్రామ రెవెన్యూ అధికారులకు (వీఆర్ఓ) ఇజ ల్లా కలెక్టర్ టి.చిరంజీవులు పిలుపునిచ్చారు. అన్యాక్రాంతమైన చెరువులు, కుంటలను గుర్తించాలన్నారు. కలెక్టరేట్లోని ఉదయాధిత్య భ వన్‌లో ఐదు డివిజన్లకు చెందిన వీఆర్ఓలకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజ కీయ ఒత్తిడులున్నాయని ఆక్రమణలను విస్మరిస్తే ఎంతమాత్ర ఉపేక్షించబోమన్నారు.
చెరువులు, ఆక్రమించి భవనాలు నిర్మిస్తుంటే చూసీ చూడనట్లు ఎలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిం చారు. వీఆర్ఓలు గ్రామస్థాయి ప్రభుత్వ అధికారి అన్న విషయం మరువరాదన్నారు. అక్రమాలకు పాల్పడితే వేటు తప్పదన్నారు. అక్ర మ ఇసుక రవాణా జరుగుతుంటే చోద్యం చూడటం సరికాదని, తహసీల్దార్, పోలీసుల దృష్టికి తెచ్చి అడ్డుకోవాలని కలెక్టర్ ఆదేశించా రు. వీఆర్‌ఓలందరూ పేదలతో అనునిత్యం మమేకమై వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. గత మూడు వారాలుగా ప్రజావాణి కార్యక్రమంలో 40శాతం సమస్యలు గ్రామస్థాయి నుంచే వస్తున్నాయన్నారు.
వీఆర్వోలు పరిష్కరించాల్సినవి కూడా జిల్లా స్థాయికి రావ డం పట్ల కలెక్టర్ వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సానుకూల వాతావరణం కొరవడిందని అన్నారు. గ్రామస్థాయిలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత కూడా వీఆర్ఓలపై ఉందన్నారు. కొన్ని విషయాలు మీడియా ద్వారా తెలుసుకోవాల్సి వస్తుందని, వీఆర్ఓల నుంచి సంఘటనలు జరిగిన వెంటనే సమాచారం అందడం లేదన్నారు. తద్వారా రెవెన్యూ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ సదస్సులో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్, అదనపు జేసీ నీల కంఠం, ఇన్చార్జ్ డీఆర్వో అంజయ్య తదిత రులు పాల్గొన్నారు.