FLO
-
భారత్ స్టార్టప్‌ల విప్లవం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని భారత స్టార్టప్‌లు శాసిస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ముఖ్యంగా హెల్త్, నూట్రిషన్, వ్యవసాయ రంగాల్లో ఇవి తమదైన ప్రత్యేకతను చాటుతున్నాయని పేర్కొన్నారు. మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు సమ సమాజ సాకారంలో కీలక వాహకాలుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్‌లో 61,000 స్టార్టప్‌లు, 81 యూనికార్న్‌లు ఉన్నట్టు చెప్పారు. మహిళల నిర్వహణలోని వ్యాపార సంస్థలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భారత స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో మహిళలే తదుపరి విప్లవానికి దారి చూపిస్తారని అంచనా వేశారు. ప్రస్తుతం వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు మహిళా స్టార్టప్‌లకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపారు. ‘‘ఇది వ్యూహాలు రూపొందించుకునేందుకు, స్టార్టప్‌లు చక్కగా వృద్ధి చెందేందుకు తగిన చర్యలను సూచించేందుకు, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు దారితీస్తుంది’’అని కాంత్ చెప్పారు. నేడు భారత్ విప్లవాత్మకమైన వినియోగం, పట్టణీకరణ, డిజిటైజేషన్, పెరుగుతున్న ఆదాయాలతో గొప్ప వృద్ధిని చూడనుందన్నారు. -
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘ఉద్యమిక’
దినదినాభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, డిఫెన్స్, ఇతర నూతన రంగాల్లో ఉన్న అవకాశాలను మహిళా పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలి. సంప్రదాయ, చిన్నచిన్న ఉత్పత్తి రంగాలకే పరిమితం కాకుండా నూతన రంగాలపైనా దృష్టి సారించాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారి. – కేటీఆర్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ‘ఉద్యమిక ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సింగిల్ విండో విధానంలో పనిచేసే ఈ విభాగం మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభు త్వం అందించే ప్రోత్సాహకాలను, ఇతర అంశా లను ఎప్పటికప్పుడు సమీక్షించి వారికి అండగా నిలుస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి, పటాన్చెరులో మంగళవారం నిర్వహిం చిన పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. సంగారెడ్డి పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఫ్లో(ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్) ఇండస్ట్రియల్ పార్క్‌ను ఆయన ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. మహిళా పారిశ్రామికవేత్తల పారిశ్రామికో త్పత్తిని సులభతరం చేసేందుకు కార్పస్‌ఫండ్ సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళల కోసమే ఏర్పాటు చేసిన ఈ ఫ్లో ఇండస్ట్రియల్ పార్కులో 50 ఎకరాలను 25 మంది మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం కేటాయించిం దన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారని చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో మూడో వంతు... కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ ఉత్పత్తిలో 66 శాతం హైదరాబాద్‌లోనే జరిగిందని, హైదరాబాద్ దేశానికి ఫార్మా క్యాపిటల్‌గా అవతరిస్తోందని అన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేం దుకు ఏర్పాటు చేసిన ‘వీ హబ్ ఇంక్యుబేషన్ సెంటర్’ సేవలను వినియోగించుకోవాలని మహి ళా పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రూ.4.90 లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ఇప్పుడు రూ.11.50 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 130 శాతం వృద్ధి సా«ధించిందని పేర్కొన్నారు. ఆ అగ్ని ప్రమాదంతోనే ‘కల్యాణలక్ష్మి’కి శ్రీకారం పటాన్చెరు టౌన్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ‘కల్యాణలక్ష్మి’ పథకానికి పునాది ఓ అగ్ని ప్రమా దమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళ వారం పటాన్చెరు పట్టణంలోని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిం చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఒకసారి పల్లెనిద్రలో భాగంగా మహబూ బాబాద్‌లోని ఓ తండాకు వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి కేసీఆర్ వద్దకు వచ్చి తన కూతురు వివాహం కోసం దాచుకున్న డబ్బు, ఇల్లు అగ్ని ప్రమాదం లో కాలిపోయాయని తన బాధను చెప్పుకున్నా డని కేటీఆర్ వివరించారు. ఆ తండ్రి వేదన, ఆ అగ్నిప్రమాదం బాధ నుంచి కేసీఆర్‌కు వచ్చిన ఆలోచనే కల్యాణలక్ష్మి పథకమని వెల్లడించారు. రూ.9వేల కోట్లతో పథకాన్ని ప్రారంభించి ఇప్పటివరకు పది లక్షల మంది ఆడపిల్లలకు ఆర్థికసాయం అందజేసి సీఎం కేసీఆర్ ఓ మేనమామలా నిలిచారని మంత్రి తెలిపారు. -
ఆ ఈవెంట్ నుంచి చందా కొచర్ ఔట్
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ 3: వీడియోకాన్ గ్రూప్ రుణవివాదంలో ఇరుక్కున్న, ఐసీఐసీఐ బ్యాంక్ సీఎండీ చందా కొచర్‌కు మరో పరాభవం ఎదురైంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి) లేడీస్ ఆర్గనైజేషన్ వార్షిక ఉత్సవాలనుంచి ఆమెను తొలగించారు. ఈవారంలో నిర్వహించనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో దేశాధ్యక్షుడు రామనాథ్ కోవింద్ చేతులు మీదుగా చందా కొచర్ సన్మానాన్ని అందుకోవాల్సి ఉంది. అయితే గత నెలలో ఆమె పేరును ప్రముఖంగా ప్రస్తావించిన నిర్వాహకులు తాజా జాబితాలో చందా కొచర్ పేరును తొలగించడం గమనార్హం. నిర్వాహకులు అందించిన సమాచారం ప్రకారం ఈ నెల 5వ తేదీన జరిగే ఈవెంట్‌కు చందా కొచర్ గౌరవ అతిధిగా హాజరుకావాల్సి ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో అందించిన సేవలకుగాను చందాకొచ్చర్‌ను ఎఫ్ఎల్వో ఐకాన్ ఆవార్డుతో సత్కరించాలని భావించింది. కానీ ఈ కార్యక్రమంనుంచి ఆమెను తప్పించామని ఎఫ్ఎల్వో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రష్మి సతిటా తెలిపారు. అయితే ఎందుకు తొలగించిందీ కచ్చితంగా చెప్పలేదు. 2018 ఏప్రిల్ 5న ఎఫ్ఎల్వో 34వ వార్షిక సమావేశంలో అధ్యక్షుడు కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమంలో చందాకొచర్ గౌరవ అతిథిగా ఉంటారనీ మార్చి 31న జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 10మంది భారతీయ మహిళా ప్రముఖులను ఎఫ్ఎల్వో ఐకాన్ అవార్డులతో సత్కరించనున్నామని చెప్పింది. ఆరోగ్యం, సంక్షేమం రంగంలో ఎయిమ్స్ చీఫ్, ఆర్గాన్ రిట్రీవల్ అండ్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ కు చెందిన ఆరతి విజ్, వినోద రంగంలో నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా, మీడియా ఎంట్రప్రెన్యూర్షిప్లో బాలాజీ టెలీఫిలింస్ క్రియేటివ్ డైరక్టర్ ఎక్తాకపూర్, డిజిటల్ వ్యాపారంలో నైకా ఫౌండర్ ఫల్గుణి నాయక్, సాహిత్యంలో నమితా గోఖలే తదితరుల పేర్లను ఈ జాబితాలో పేర్కొంది. -
తెలివైన పెట్టుబడులు పెట్టాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని రంగాల్లో పురోగమిస్తున్న మహిళలు.. ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని బజాజ్ క్యాపిటల్ ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ.. మహిళా ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మహిళలు– సంపద’ అంశంపై పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) ఆధ్వర్యంలో శుక్రవారమిక్కడ జరిగిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా రాజీవ్ ఈ విషయాలు చెప్పారు. పెట్టుబడుల విషయంలో వివేకవంతంగా వ్యవహరించాలని మహిళలకు సూచించారు. మరోవైపు, ఎకానమీ మొదలైన వాటి పరిస్థితులు ఎలా ఉన్నా... స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకుని, క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించాలని కటింగ్ ఎడ్జ్ వ్యవస్థాపకుడు గౌరవ్ మష్రువాలా సూచించారు. ఎఫ్ఎల్వో హైదరాబాద్ చైర్పర్సన్ కామిని సరాఫ్, వైజ్ ఇన్వెస్ట్ అడ్వైజర్స్ సీఈవో హేమంత్ రస్తోగి, కరమ్‌యోగ్ నాలెడ్జ్ అకాడెమీ వ్యవస్థాపకుడు అమిత్ త్రివేది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు, వచ్చే రెండేళ్లలో బజాజ్ క్యాపిటల్ సంస్థ రుణ కార్యకలాపాల విభాగంలోకి కూడా ప్రవేశించనున్నట్లు రాజీవ్ వెల్లడించారు. ప్రస్తుతం తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.20,000 కోట్లుగా ఉండగా.. అయిదేళ్లలో ఇది రూ. లక్ష కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. -
మాకూ తోడ్పాటు అందించండి
మంత్రి జూపల్లితో ఫిక్కీ మహిళా విభాగం భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ.200 కోట్ల పెట్టుబడులతో రెండువేల మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని భారతీయ పరిశ్రమలు, వాణిజ్య సమాఖ్య (ఫిక్కీ) అనుబంధ మహిళా సంస్థ (ఎఫ్ఎల్ఓ) వెల్లడించింది. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఎఫ్ఎల్ఓ ప్రతినిధి బృందం సోమవారం భేటీ అయింది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా 2014 నవంబర్‌లో ఎఫ్ఎల్ ఓకు భూమి కేటాయించేందుకు టీఎస్ఐఐసీ ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని బృందం సభ్యులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వస్త్రోత్పత్తులు, ఆభరణాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫర్నిచర్ తయారీ తదితర రంగాల్లో 36 మంది ఎఫ్ఎల్ఓ సభ్యులు ఆసక్తితో ఉన్నారని, భూ కేటాయింపులు జరిగిన రెండేళ్ల వ్యవధిలో పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉన్నారన్నారు. భూమి ధరలో 50 శాతం తగ్గించాలని, ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఎఫ్ఎల్ఓ సభ్యులకు కూడా వర్తించేలా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పారిశ్రామిక విధానంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలనూ ప్రోత్సహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎఫ్ఎల్ఓ ప్రతినిధులు రేఖా లహోటి, సామియా ఆలంఖాన్, వాణి సుభాష్, జోత్స్న అంగర తదితరులు జూపల్లిని కలసిన వారిలో ఉన్నారు. నోటు పుస్తకాలపై తెలంగాణ చరిత్ర:జూపల్లి నోటు పుస్తకాల తయారీ, సరుకు రవాణా వ్యాపారాలను మరింత విస్తరించాలని టీఎస్‌టీపీసీ అధికారులకు పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వాణిజ్య అభివృద్ధిలో భాగంగా చేనేత, జౌళి, హస్తకళల ఉత్పత్తులను ఆన్లైన్ మార్కెటింగ్ చేయడంపై దృష్టి సారించాలన్నారు. టీఎస్‌టీపీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నోటు పుస్తకాల తయారీ డివిజన్‌తో పాటు రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలోని సరుకు రవాణా కేంద్రాన్ని మంత్రి సోమవారం సందర్శించారు. తెలంగాణ సంక్షిప్త చరిత్ర, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నోటు పుస్తకాలపై తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ముద్రించాల్సిందిగా మంత్రి అదేశించారు.