floor leaders
-
రేపటి నుంచి పార్లమెంట్
న్యూఢిల్లీ: ఈనెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనుండగా ఒక రోజు ముందుగా ఆదివారం అన్ని పారీ్టల ఫ్లోర్ లీడర్లతో ప్రభుత్వం సమావేశం కానుంది. ఈ సెషన్ ఉద్దేశం వారికి వివరించి, అభిప్రాయాలు తెలుసుకోనుంది. అయిదు రోజుల సమావేశాల్లో మొదటిరోజు రాజ్యాంగ సభ మొదలుకొని 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్తానంపై ప్రత్యేక చర్చ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టిన ది అడ్వొకేట్స్(సవరణ)బిల్లు–2023, ది ప్రెస్ అండ్ రిజి్రస్టేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు–2023, ది పోస్టాఫీస్ బిల్లు–2023లను ఈ సెషన్లో లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మార్పులతో గత సమావేశాల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఈసారి చర్చకు పెట్టనుంది. అయితే, అనూహ్యంగా మరికొన్ని అంశాలను సైతం ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయన్న చర్చ సర్వత్రా జోరుగా సాగుతోంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు కోటా కల్పించే బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడుతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ ప్రత్యేక సెషన్ సమయంలోనే పార్లమెంట్‌ను నూతన భవనంలోకి మార్చనుందని భావిస్తున్నారు. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ మే 28వ తేదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోకి మారాక వివిధ విభాగాల సిబ్బందికి కొత్త యూనిఫాం అందజేసేందుకు సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే, ఈ యూనిఫాంపై బీజేపీ ఎన్నికల గుర్తు కమలం ముద్రించడంపై కాంగ్రెస్ మండిపడింది. ఈ అంశంపైనా ప్రత్యేక సెషన్లో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడ్డే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ సారథ్యంలో దేశ రాజధానిలో ఇటీవల విజయవంతంగా ముగిసిన జీ20 శిఖరాగ్రం అంశాన్ని పాలకపక్షం చర్చకు తీసుకు వస్తుందని భావిస్తున్నారు. ఏడాదిలో మూడుసార్లు బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. నూతన భవనంపై నేడు పతాకావిష్కరణ పార్లమెంట్ నూతన భవనంపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆదివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి కొత్త భవనంలోనే ప్రారంభం కానున్న దృష్ట్యా జగదీప్ ధన్‌ఖడ్ గజద్వారంపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. -
కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేతగా అధిర్ రంజన్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయసభల్లో పార్టీ గళం వినిపించడానికి లోక్‌సభ, రాజ్యసభల నేతలను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ పునర్ నియమించారు. లోక్‌సభలో పార్టీ నేతగా అధిర్ రంజన్ చౌధురి, ఉపనేతగా గౌరవ్‌గొగోయ్, చీఫ్ విప్‌గా కె.సురేశ్, విప్‌లుగా రవ్నీత్ సింగ్ బిట్టు, మాణిక్కం ఠాగూర్, ఇంకా మనీష్ తివారి, శశిథరూర్‌లను నియమించారు. రాజ్యసభలో నేతగా మల్లికార్జున ఖర్గే, ఉపనేతగా ఆనంద శర్మ, చీఫ్ విప్‌గా జైరాం రమేశ్‌లను నియమించారు. ఇంకా సీనియర్ నేతలు అంబికా సోని, పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్లను నియమించారు. ఆయా నేతలు ఎప్పటికప్పుడు సమావేశమై సభల్లో లేవనెత్తాల్సిన అంశాలను చర్చించాలని సోనియా గాంధీ ఆదేశించారు. ఉభయసభల నేతలు సమావేశమైనప్పుడు మల్లికార్జున ఖర్గే సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. -
ఈసారి ఏం చెబుతారో?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో భేటీ కానున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో ప్రధాని మోదీ మాట్లాడతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఐదుగురు కంటే ఎక్కువ మంది ఎంపీలు కలిగిన పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మాట్లాడతారు. కరోనా మహమ్మారిపై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు చేపట్టాల్సిన దాని గురించి వారితో ప్రధాని చర్చించే అవకాశముంది. లాక్డౌన్ గడువు 14తో ముగియనుండటంతో ప్రధాని ఇంకా ఏమైనా చెబుతారా అనేది ఆసక్తికరంగా మారింది. (కొవ్వొత్తుల తర్వాత రంగోలి పోటీలా!?) కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో వరుస భేటీలు జరుపుతున్న సంగతి తెలిసిందే. సినీ, క్రీడా, మీడియా ప్రముఖులతో పాటు వైద్య సిబ్బందితోనూ ఆయన మాట్లాడారు. కరోనాను అడ్డుకునేందుకు మార్చి 24 నుంచి 21 రోజుల పాటు లాక్డౌన్ పాటించాలని ప్రధాని పిలుపు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ దీపాలు ఆర్పేసి కొవ్వొత్తులు, టార్చిలైట్లు, సెల్‌ఫోన్ లైట్లు వెలిగించాలని ప్రజలను ప్రధాని మోదీ వీడియో సందేశంలో కోరారు. (ఆ లైట్లు ఆర్పకండి: కేంద్రం క్లారిటీ) -
తెలంగాణ స్పీకర్ తో ఫ్లోర్ లీడర్ల సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ల సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారితో సోమవారం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో శనివారం గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనపై చర్చిస్తున్నారు. సభలో బెంచీలు ఎక్కినవారిపై చర్యలు తీసుకునే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. -
ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ భేటీ