The flow of water
-
ముంపుగ్రామాలకు వరద తాకిడి
బెల్లంకొండ పులిచింతల ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాలకు నీటి ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. నెల రోజుల నుంచి పులిచింతల ప్రాజెక్టు పరిధిలో నీరు నిల్వ ఉండడంతో ముంపు గ్రామాలైన పులిచింతల, కోళ్లూరు, గొల్లపేట, చిట్యాల, చిట్యాలతండా, బోదనం, గోపాలపురం, కామేపల్లి గ్రామాలు నీటి దిగ్బంధనంలోనే ఉన్నాయి. మూడు రోజుల నుంచి నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు చేరడం, అధిక వర్షాలు కురవడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ముంపు గ్రామాల్లోకి పది అడుగుల మేర నీటిప్రవాహం పెరగడంతో ముంపు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. నాలు గు రోజుల నుంచి అధికారుల సూచనల మేరకు కొన్ని కుటుంబాలు పునరావాస కేం ద్రాలకు వెళ్లగా మరికొంతమంది నిర్వాసితులు ముంపు గ్రామాల్లోనే ఉంటున్నారు. ముంపు గ్రామాల్లో భారీగా పంట నష్టం ముంపు గ్రామాల్లో సాగుచేస్తున్న పంటలు నీట మునిగాయి. దాదాపు 25 వేల ఎకరాలు నీట మునిగి పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో నిర్వాసితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నీటి మునకకు గురికాని పంటల్లో తీసిన పత్తిని ఇళ్లకు తెచ్చేందుకు రాకపోకలు నిలిచిపోవడంతో పంటలంతా వర్షం దెబ్బకు తడిచిపోయాయని వారు వాపోతున్నారు. సహాయ చర్యలు చేపట్టిన రెవెన్యూ అధికారులు.. రాకపోకలు నిలిచిపోవడంతో కోళ్లూరు, గొల్లపేట గ్రామాల్లో నివాసం ఉంటున్న నిర్వాసితులను పడవల ద్వారా రెవెన్యూ అధికారులు గొల్లపేట సమీపంలో ఉన్న గద్దలగోడు వరకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్లలో వెంకటాయపాలెం వరకు తీసుకువస్తున్నారు. ఆదివారం నీటి ప్రవాహం తీవ్రంగా ఉండడంతో స్థానిక రెవెన్యూ అధికారి లక్ష్మీప్రసాద్, ఎస్ఐ మురళీమున్నా, రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది ముంపు గ్రామాలకు వెళ్లి స్థానిక పరిస్థితులను సమీక్షించి ముంపు గ్రామాలను వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. సురక్షిత ప్రాంతాలకు వచ్చిన నిర్వాసితులకు ఆహారాన్ని సరఫరా చేశారు. -
మా కుమారులకు పునర్జన్మ
- ‘హిమాచల్ ’ ఘటనలో క్షేమంగా తిరిగొచ్చిన చేతన్ రమేశ్ చౌహాన్,సుహర్ష - మా కుమారులకు పునర్జన్మని తల్లిదండ్రుల ఊరట నల్లకుంట, ఆల్విన్‌కాలనీ : హిమాచల్‌ప్రదేశ్ ఘటనలో క్షేమంగా తిరిగొచ్చిన విద్యార్థులు తమ అనుభవాలను తల్లిదండ్రులతో పంచుకుంటున్నారు. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొని బయటపడ్డామని, లేకుంటే తాము కూడా వరదనీటిలో కొట్టుకపోయే వాళ్లమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్లేట్ ది స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న సుజాత,రమేశ్ చౌహాన్ దంపతులకు చేతన్ రమేశ్ చౌహాన్(17), ఆకాశ్‌లు ఇద్దరు కొడుకులు. చేతన్మ్రేశ్ చౌహాన్ వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కాలేజీలో సెకండియర్ చదువుతూ..నల్లకుంట రైల్వేట్రాక్ సమీపంలోని శ్రీసాయి రెసిడెన్సీలో అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. స్టడీ టూర్‌కు వెళ్లిన చేతన్ ‘హిమాచల్’ ఘటన నుంచి బయటపడి మంగళవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకోవడంతో అతని కుటుంబసభ్యులు ఆనందంతో ఊపిరిపీల్చుకున్నారు. టీవీల్లో చూసి భయపడ్డాం..: హిమాచల్‌ప్రదేశ్ ఘటనలో తమ కుమారుడు సురక్షితంగా తిరిగిరావడం ఆనందంగా ఉందని చేతన్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. విద్యార్థులు వరదనీటి ప్రవాహంలో గల్లంతయ్యారని టీవీల్లో చూసి మాపై ప్రాణాలు పైనే పోయినంతపనైందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత తమ కుమారుడి సెల్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చిందని..రాత్రి 11.30 గంటలకు క్షేమంగానే ఉన్నానని చెప్పడంతో ఊరట చెందామని చెప్పారు. మిత్రులే బయటకు లాగారు : ‘కొండలు, లోయలు, పచ్చని అందాల నడుమ అందరం కలిసి ఫొటోలు దిగాలని ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో బియాస్ నది వద్దకు చేరుకున్నాం. అప్పటివరకు ఫొటోలు దిగుతుండగా నీటిప్రవాహం నెమ్మదిగా పెరిగింది. దీంతో నేను నా స్నేహితులు బయటకు వెళ్దామని అడుగులు వేస్తుండగా కాలు జారి కిందపడ్డాను. వెంటనే స్నేహితులు చేయందించి ఒడ్డుకు లాగారు. క్షణాల్లో నీటి ప్రవాహం పెరగడంతో ఫొటోల కోసం ఆ నదిలో ఉన్న వారు కొట్టుకపోవడం చూసి షాక్ అయ్యానని’ ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థి వి.సుహర్ష అన్నారు. తల్లిదండ్రులు రాజేశ్వరి, చలపతిరావులు మాట్లాడుతూ ‘టీవీలో వస్తున్న వార్తలు చూసి మా అబ్బాయి ఎలా ఉన్నాడో అని ఆందోళన చెందాము. వాడిని మా కళ్లతో చూసేదాక మా కంటికి కునుకులేదు. నిజంగా ఇది మా అబ్బాయికి పునర్జన్మే’ చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు.