కరీంనగర్లో నయీం అనుచరులు అరెస్ట్
కరీంనగర్: గ్యాంగ్ స్టర్ నయీం గ్యాంగ్‌తో కలిసి భూదందాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులు సిట్ అదుపులోకి తీసుకుంది. కరీంనగర్ జిల్లా నగునూర్‌కు చెందిన నర్సింగోజు గోవర్ధనాచారి అలియాస్ గోపి, కొరవేణి రమేష్‌లను శనివారం అదుపులోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. భూదందాలతో పాటు, హత్యల్లో పాలుపంచుకున్నారా అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు.