Forest Research Centre
-
‘చెట్టు’పట్టాల్ వేసుకోవిక్కడ..
ఏంరోయ్.. దగ్గరకు వస్తున్నావు.. నన్ను ముట్టుకోవద్దన్నానా.. చల్.. అలా జరుగు.. దూరంగా ఉండు.. డోంట్ టచ్.. ఇది మన వాయిస్ కాదు.. ఈ చెట్ల ఇన్నర్ వాయిస్! వీటిపై ఓసారి లుక్కేసుకోండి. విషయం మీకే తెలుస్తుంది.. రేవులో తాటిచెట్టులా అంతెత్తున పెరిగాయి. కానీ ఎక్కడన్నా టచ్ అయ్యాయా? పై భాగంలో ఉన్న వాటి ఆకులు, కొమ్మలు అన్నిటి మధ్య అంతరం ఉంది గమనించారా.. కొన్ని ప్రాంతాల్లో.. కొన్ని రకాల వృక్ష జాతుల్లో.. ముఖ్యంగా ఒకే ఎత్తు ఉన్నవాటిల్లో ఈ చిత్రమైన విషయాన్ని మనం గమనించొచ్చు. కొన్నిసార్లు వేర్వేరు వృక్ష జాతుల్లోనూ ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని ‘క్రౌన్ షైనెస్’అంటారు. ఇలా జరగడం వెనకున్న అసలైన కారణం పూర్తిగా తెలియనప్పటికీ.. తుపానులు లేదా బలమైన గాలులు వీచినప్పుడు ఈ చెట్ల కొమ్మలు ఒకదాన్ని ఒకటి ఢీకొని.. విరిగిపోవడం జరుగుతుందని.. తద్వారా ఆ గ్యాప్ ఏర్పడుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ తరహా పరిణామం చోటుచేసుకుంటున్న వృక్ష జాతులను పరిశీలిస్తే.. అవి బాగా ఎదిగిన తర్వాతే.. అంటే.. గాలికి ముందుకు వెనక్కు ఊగే స్థాయికి చేరుకున్నప్పుడే ఇలా జరుగుతోందని.. చిన్నగా ఉన్నప్పుడు తొలి దశల్లో ఈ ‘క్రౌన్ షైనెస్’ఉండటం లేదని పేర్కొంటున్నారు. ఇంక కొంతమందైతే.. ఆకులను తినే లార్వా మరింత ప్రబలకుండా ఉండేందుకు ఆయా చెట్లే సహజసిద్ధంగా తమ విస్తృతిని పరిమితం చేసుకుంటాయని చెబుతున్నారు. ప్రపంచంలో ఇలాంటి వృక్ష జాతులు ఉన్న ప్రాంతాలు చాలా పరిమితంగా ఉన్నాయి. అందులో ఒకటి కౌలాలంపూర్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ చిత్రం అక్కడిదే. ఈ వృక్షాలు కర్పూరం చెట్లలో ఒక రకానికి చెందినవి. ఇవి ఒకదాన్ని ఒకటి ముట్టుకోవడానికి అస్సలు ఒప్పుకోవట. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
ఫారెస్ట్!
♦ పరిశోధనలకు మంగళం ♦ మొక్కల పెంపకానికే పరిమితం ♦ చతికిల పడ్డ అటవీ పరిశోధనా కేంద్రం ♦ నాడు రాష్ట్రానికే తలమానికం ♦ నేడు వెలవెలబోతున్న వైనం అటవీ పరిశోధనా కేంద్రం వెలవెలబోతున్నది. అంతరించిపోతున్న అడవిని అభివృద్ధి చేస్తూ.. కొత్త తరహా పరిశోధనలకు కేంద్ర బిందువై రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన ఈ కేంద్రం నేడు చతికిలపడింది. ల్యాబ్‌లు, ఎన్నో సౌకర్యాలతో ఏర్పాటు చేసిన భవనాలు శిథిలమయ్యాయి. సిబ్బంది సంఖ్యను కుదించారు. కేవలం మొక్కల ఉత్పత్తికే పరిమితమైంది. గతేడాది ఇదే ప్రాంగణంలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫారెస్ట్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కళాశాలకు సంబంధించి తరగతులను తాత్కాలికంగా రంగారెడ్డి జిల్లా దూలపల్లి అటవీ శాఖ అకాడమీలో ప్రారంభమయ్యాయి. కానీ అటవీ పరిశోధన కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. గజ్వేల్/ములుగు : అంతరించిపోతున్న అడవి జాతి మొక్కల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన అటవీ పరిశోధనా కేంద్రం మూలనపడింది. నాడు సకల సౌకర్యాలు, సరిపడా సిబ్బంది ఉన్న ఈ కేంద్రం.. ప్రస్తుతం మొక్కల ఉత్పత్తికే పరిమితమైంది. గత ఏడాది ప్రారంభమైన ఫారెస్ట్రీ కాలేజీ సైతం దాదాపుగా మరో చోటుకి తరలిపోయింది. నాటి వైభవాన్ని తీసుకొస్తామని అధికారులు చెబుతున్నా.. ప్రణాళికలు ఇంకా పేపర్లలో మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో అటవీ పరిశోధన కేంద్రంపై ఁసాక్షి* ప్రత్యేక కథనం. మూడు దశాబ్ధాల క్రితం ములుగు మండల కేంద్రంలో అటవీ పరిశోధనా కేంద్రం ఏర్పాటైంది. రంగారెడ్డి జిల్లా దూలపల్లి, వరంగల్ జిల్లా ములుగు ప్రాంతాల్లో సైతం ఇలాంటి కేంద్రాలున్నాయి. అంతరించిపోతున్న అడవి జాతి మొక్కలను పరిశోధనల ద్వారా అభివృద్ధి చేయడం, అంటుకట్టు విధానంలో కొత్త వంగడాలు సృష్టించడం, ఔషధ మొక్కలను ఉత్పత్తి చేయడం ప్రధానంగా ఈ కేంద్రం ఉద్దేశం. సుమారు 200 హెక్టార్లలో ఈ కేంద్రం పరిశోధనలు సాగేవి. ఇందుకోసం శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్లను నియమించారు. అన్ని రకాల వసతులతో ల్యాబ్ కూడా నిర్మించారు. ఏళ్ల తరబడి ఇక్కడ పరిశోధనలు జరిగాయి. ఏటా సుమారు వందకు పైగా ఔషధ మొక్కలు ఉత్పత్తి చేసేవారు. మరోవైపు ఎప్పటికప్పుడు కొత్తరకం వంగడాలు సుమారుగా పదికిపైగా తీసుకువచ్చేవారు. అయితే, అనూహ్యంగా పదేళ్లుగా ఈ కేంద్రం చతికిలపడింది. శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్ల కార్యకలాపాలు కూడా ఇక్కడ సాగడంలేదు. ల్యాబ్ మూతపడింది. పరిశోధనలకు ఉపయోగించే పరికరాలన్నీ తుప్పుపట్టాయి. ప్రస్తుతం ఇద్దరు సెక్షన్ అధికారులు, ఒక బీట్ ఆఫీసర్ మాత్రమే ఉన్నారు. ఈ కేంద్రం మొక్కల ఉత్పత్తికి మాత్రమే పరిమితమైంది. మొక్కల పెంపకం ఇలా... ప్రస్తుతం ఈ కేంద్రంలో అటవీజాతి మొక్కలు మలబారు వేప, సిల్వర్ ఓక్, తాని, వేప, రోజ్‌వుడ్, నిరుద్ధి, తెల్ల దర్శనం, ఆరే, నెమలినారే, తప్సి, చెన్నంగి, కర్జూర, నల్లమద్ది, తెల్లమద్ది, తబూబియాహోలెండ్, నారవేప, తబూబియాఆర్య, ప్రతోడియా, మారేడు, గుల్మోర్, ఏడాకులపాల, మహాగని, చైనా బాదాం, ఉసిరి, రేవ్సండల్, రావి, మర్రి, జివ్వి, ఇప్ప, మిత్రగైన, రక్తకాండ, నేరేడు, మొర్రి, సీమరువ, బహువీనియా, పెద్దమాను తదితర మొక్కలను ఏటా 5 నుంచి 10లక్షల మేర ఉత్పత్తి చేస్తున్నారు. ఆయా రకాల మొక్కల విత్తనాలను వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ముందుగా ప్రైమరీబెడ్లలో నాటుతారు. ఈ బెడ్లలో ఏకకాలంలో కొన్ని లక్షల మొక్కలను విత్తుకునే అవకాశమున్నది. ఇసుకవేసి ఉన్న ఈ బెడ్లలో మొలకలు రాగానే వాటిని రూట్ ట్రేనర్స్లోకి మారుస్తారు. రూట్ ట్రేనర్లో కొబ్బరిపొట్టు ఎరువు, వర్మికంపోస్టు ఎరువును వేసి వాటిని కొద్దిరోజులు వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే టన్నెల్స్(పాలీగ్లోబల్స్)లో ఉంచుతారు. సుమారు 10 రోజుల వరకు ఇందులోనే మొలకలు ఉంటాయి. ఆ పది రోజుల్లో వేరు వ్యవస్థ బలపడుతుంది. ఆ తరువాత వీటిని గ్రీన్‌హౌస్‌లోకి మారుస్తారు. సుమారు 45రోజుల పాటు గ్రీన్హౌస్లో ఉంచిన తరువాత మొక్క ఎదుగుతుంది. కొన్ని మొక్కలను పాలీహౌస్‌లలోనూ పెంచుతారు. ఆ తరువాత పాలిథిన్ కవర్లలోకి మొక్కలను మార్చి పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తారు. ఈ విధంగా పంపిణీకి సిద్ధంగా ఉన్న మొక్కలను నాటడానికి పంపుతారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అటవీ పరిశోధన కేంద్రంలో నీలగిరి వనం 20 హెక్టార్లు, టేకు 20 హెక్టార్లు, రోజ్‌వుడ్ 3హెక్టార్లు, పెద్దమాను 3 హెక్టార్లు, మారేడు, మిత్రగైన, నారవేప, మరో రెండు రకాల చెట్లు ఒక్కో హెక్టారు చొప్పున విస్తరించి ఉన్నాయి. పరిశోధనా కేంద్రం అభివృద్ధికి కార్యాచరణ ములుగులోని అటవీ పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు నిలిచిపోయిన మాట వాస్తవమే. ఈ కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయంలో ‘హరితహారం’ ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్ ప్రత్యేక కార్యాచరణ తయారు చేస్తున్నారు. ఫారెస్ట్రీ కళాశాలకు స్థలం కేటాయింపు, భవనాల నిర్మాణం ప్రారంభం కాగానే పరిశోధనా కేంద్రం వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశమున్నది. ఈ కేంద్రాన్ని గతంలో మాదిరిగానే రాష్ట్రంలోనే అగ్రగామి పరిశోధనా స్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యం ఫారెస్ట్రీ కళాశాల ఇక్కడే... ఈ అటవీ పరిశోధన కేంద్రం ప్రాంగణంలో కొత్తగా నిర్మించబోతున్న ఫారెస్ట్రీ కళాశాల కూడా దక్షిణ భారత దేశంలోనే రెండో సంస్థగా ఖ్యాతి పొందుతున్నది. ఫారెస్ట్రీ కళాశాల ఏర్పాటుకు గతేడాది నుంచే కార్యాచరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇలాంటి సంస్థ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ ప్రాంతంలో గల మెట్టుపాలెంలో ఉంది. ములుగులో ఏర్పాటు చేయనున్న సంస్థ కూడా అదేస్థాయి ప్రమాణాలను కలిగివుంటుంది. ప్రస్తుతం ఈ కళాశాలకు సంబంధించిన తరగతులు ఇక్కడ సొంత భవనం అందుబాటులో లేక ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా దూలపల్లిలోని అటవీ పరిశోధనా కేంద్రంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడున్న భూమిలో ఫారెస్ట్రీ కళాశాలకు ఎంత కేటాయించాలి? అనే విషయంలో స్పష్టత రాలేదు. దీని తర్వాతే పరిశోధనా కేంద్రం అభివృద్ధి విషయంపై కార్యాచరణ ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. -
ఇదేం తీరు?
గజ్వేల్/ములుగు: గజ్వేల్ నియోజకవర్గంలో పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ‘నేను ఫామ్‌హౌస్ నుంచి వస్తుంటే తొవ్వల.. మర్కుక్‌లో మురుగునీటి కాల్వలు బాగాలేవు... స్పెషల్ డ్రైవ్‌లు చేసినమన్నరు... ఫలితమేముంది... ఇదేం బాగాలేదు... ఏంచేస్తున్నారు మీరంతా..?’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ములుగు మండల కేంద్రంలోని అటవీశాఖ పరిశోధనా కేంద్రంలో నియోజవర్గంలోని వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో సీఎం చేసిన వ్యాఖ్యలివి. ‘ఏం చేస్తారో నాకు తెల్వదు.. గజ్వేల్ పట్టణంతోపాటు మండలంలోని గ్రామాలు, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, తూప్రాన్ మండల కేంద్రాలు, గ్రామాలన్నీ సం పూర్ణ పారిశుద్ధ్యానికి ప్రతీకలుగా నిలవాలి...అద్దంలా మారాలి’ అంటూ ఆదేశించారు. ముందుగా గజ్వేల్ పట్టణం లో ఈ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలె...అంటూ ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావుకు సూచించారు. అంతేకాకుండా చెట్లు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టండి...అన్ని వర్గాల సహకారం తీసుకోండి....అంటూ ఆదేశించారు. ప్రత్యేకించి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో యుద్ధప్రాతికదికన మొక్కల నాటడానికి చర్యలు చేపట్టాలన్నారు. పట్టణంలోని ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్‌లోని 132/33కేవీ సబ్‌స్టేషన్ వరకు, ఇందిరాపార్క్ అంగడిబజార్ నుంచి కోటమైసమ్మ గుడి వరకు కూడా మొక్కలు నాటి వాటికి కం చెలను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు విస్తరణకు స్థానికుల సహకారాన్ని కోరాలని తెలిపారు. మొక్కల పరిరక్షణకు రోడ్డు పక్కన బోరుబావులను తవ్వించి వాటి ద్వారా నీటిని అందించాలన్నారు. వీటి పరిరక్షణ బాధ్యత పూర్తిగా నగర పంచాయతీ కమిషనర్‌దేనని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఈ సమీక్షలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్, ఐఎఫ్ఎస్ అధికారి ప్రియాంకానర్గీస్, అటవీశాఖ అధికారి సోనీబాల, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూంరెడ్డి, నాయకులు జహంగీర్, అంజిరెడ్డి, మాదాసు శ్రీనివాస్, దేవి రవిందర్ తదితరులు పాల్గొన్నారు. మంచినీటికి శానా తిప్పలైతుంది... - సీఎంతో మర్కుక్ మహిళల ఆవేదన ములుగు మండలం మర్కుక్ గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకసిక్మంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధి గుండా కాలినడకన తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మురుగునీటి కాల్వలను పరిశీలించారు. సీఎం ఆకస్మిక సందర్శనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆనందోత్సహాలకు గురయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ‘గ్రామంలో.. మంచినీళ్లు దొరకక శాన తిప్పలైతుంది సారు...మేం పదిమందిమి కలిసి సొంత పైసలతో బోరు వేయించుకున్నం’ అని కొందరు నిట్టూర్చగా...మరి కొందరు ‘మాకు నల్లా నీళ్లు వస్తలేవు... మా ఇబ్బంది తీర్చండి...’ అంటూ సీఎంతో వేడుకున్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్ మర్కుక్‌లో వారం రోజుల్లో మంచినీటి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అదేవిధంగా మహిళా సంఘాల గురించి సీఎం ఆరా తీశారు. సంఘాలకు భారీ ఎత్తున పథకాలను వర్తింపజేసీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మరో రైతువద్దకు వెళ్లి..పెద్దాయనా నీకేం కావాలే...అంటూ సీఎం ప్రశ్నించగా కరెంటు సరిగా వస్తలేదు సారూ...కరెంటు మంచిగియ్యాలే...అంటూ వేడుకున్నారు....దీనిపై స్పందించిన కేసీఆర్ కరెంటు సరఫరా తీరు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ గ్రామస్తులతో మాట్లాడుతూ..అంతా కలిసి శ్రమదానం చేసుకుందాం...మోరీలు బాగు చేసుకుందాం...కొద్ది రోజుల్లో నేను కూడా మీ ఊరికి వస్తా..అంటూ పేర్కొన్నారు. ములుగు అటవీ కేంద్రంలో జింకలను పెంచండి పోచారం అభయారణ్యంలోని సుమారు 200కుపైగా జింకలను ములుగులోని అటవీశాఖ పరిశోధన కేంద్రంలోకి తరలించి పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. శుక్రవారం ఈ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన సమీక్షలో సిల్వి కల్చరిస్ట్ ప్రియాంకవర్గీస్, డీఎఫ్ఓ సోనిబాల తదితరులతో మాట్లాడుతూ పర్యావరణం వికసించేలా పోచారం అభయారణ్యం నుంచి ఇక్కడికి జింకలను తరలించి పెంచాలని సూచించారు. అదేవిధంగా ఇక్కడి కేంద్రానికి పెద్ద ఎత్తున మొక్కలను తీసుకువచ్చి నిల్వ చేసి నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, కొండపాక, జగదేవ్‌పూర్ మండలాలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని తన ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డిని సీఎం ఆదేశించారు.