The formation of government
-
నాగాలాండ్‌లో నేనంటే.. నేను!
కోహిమా: నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటులో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ నాగాలాండ్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ) నేత నేఫియో రియో, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)కు చెందిన టీఆర్ జెలియాంగ్ గవర్నర్‌ను కలవటంతో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఆదివారం ఉదయం ఎన్డీపీపీ నేత రియో గవర్నర్ పీబీ ఆచార్యను కలిసి తనకు 32 మంది సభ్యుల మద్దతు ఉందని చెప్పారు. అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ కూడా గవర్నర్ వద్దకు వెళ్లి మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని తెలిపారు. వీరితో సమావేశాల అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. ఇద్దరికీ 48 గంటల సమయం ఇచ్చాననీ, మెజారిటీ సభ్యుల మద్దతుతో లేఖలు ఎవరు తీసుకువస్తే వారినే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరతానన్నారు. రియో వెంట ఎన్డీపీపీ అధ్యక్షుడు చింగ్వాంగ్ కొన్యాక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విసాసోలీ లౌంగు, జనతాదళ్(యు) ఎమ్మెల్యే, మరో స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారని గవర్నర్ చెప్పారు. రియోకు చెందిన ఎన్డీపీపీకి 18, బీజేపీకి 12 మంది సభ్యుల బలం ఉందని తెలిపారు. జెలియాంగ్కు చెందిన ఎన్పీఎఫ్కు 26 మంది సభ్యులుండగా ఇద్దరు నాగాలాండ్ పీపుల్స్ పార్టీ, ఒక జేడీయూ ఎమ్మెల్యే మద్దతు ఉందని చెప్పారన్నారు. అయితే ఇదే జేడీయూ ఎమ్మెల్యే రియోకు కూడా మద్దతు తెలిపారన్నారు. ఇలా ఉండగా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జెలియాంగ్ రాజీనామాకు నిరాకరించారు. నాగాలాండ్‌లో సంకీర్ణ ప్రభుత్వం: రామ్‌మాధవ్ ఎన్డీపీపీతో కలిసి నాగాలాండ్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తెలిపారు. 60 సీట్లున్న అసెంబ్లీలో రెండు పార్టీలతోపాటు జేడీయూ, ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిపి సాధారణ మెజారిటీ ఉందని తెలిపారు. -
130 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి నితీశ్
-
130 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి నితీశ్
పాట్నా: బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించడంలో రాష్ర్ట గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి చేస్తున్న జాప్యంపై జేడీయూ నేత నితీశ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా రాష్ర్టపతి ప్రణబ్‌ముఖర్జీ ఎదుట పరేడ్ నిర్వహించేందుకు తనకు మద్దతిస్తున్న 130 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మంగళవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నితీశ్ ఇప్పటికే బుధవారం రాష్ర్టపతి అపాయింట్మెంట్ కోరారు. ఢిల్లీకి వెళ్లడానికి ముందు పార్టీ ముఖ్య నేతలతో కలిసి పాట్నాలో ఆయన మీడియాతో మాట్లాడారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను కూడా సమర్పించిన త ర్వాత గవర్నర్ ఇంకా సమయం తీసుకోవడం ఎందుకని, 48 గంటలు గడిచినా నిర్ణయం తీసుకోకపోవడంలో అర్థం లేదని నితీశ్ పేర్కొన్నారు. -
శివసేన లేకుండానే ‘మహా’ ప్రభుత్వం!
ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ మొగ్గు ముంబై: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారంలో మరో మలుపు! అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఎన్సీపీ బయటనుంచి ఇచ్చే మద్దతు తీసుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు శనివారం సంకేతాలు వెలువడ్డాయి. శివసేనతో చర్చలు సాగుతూనే ఉన్నా.. పార్టీ శ్రేణుల మనోభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్సీపీ మద్దతుతోనే ముందుకెళ్లే అవకాశమున్నట్లు పార్టీ అగ్రనేత ఒకరు పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడకపోవచ్చన్నారు. సేనతో కలసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని మరో బీజేపీ సీనియర్ నేత అన్నారు. ప్రధానిమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలపై సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సహా ఆ పార్టీ నేతలు చేసిన వ్యక్తిగత విమర్శలపై తమ పార్టీ శ్రేణులు ఇంకా ఆగ్రహంగానే ఉన్నాయన్నారు. కాగా, సీఎం రేసులో ముందంజలో ఉన్న ఫడణ్‌వీస్, శాసనమండలి విపక్షనేత వినోద్ తావ్డేలు శనివారం.. మోదీని ముంబై విమానాశ్రయంలో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. సేనతో పొత్తు పునరుద్ధణపై పార్టీలో వస్తున్న వ్యతిరేకత గురించి వారు ప్రధానికి చెప్పినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ కొత్త ప్రభుత్వం ఈ నెల 29, లేదా 30న ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక పరిశీలన కోసం నియమితులైన రాజ్‌నాథ్ సింగ్ 27న ముంబై రానున్నారు.