24న కర్నూలులో జాబ్ మేళా
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : బీక్యాంపు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలో ఈ నెల 24వ తేదీన మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అయేషాఖాతూన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకు సేల్స్ ఆఫీసర్ల కోసం డిగ్రీ పాసై 26 ఏళ్లలోపు వారు అర్హులని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా, ఆధార్‌కార్డుతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాల కోసం 9866078677ను సంప్రదించాలని ఆమె కోరారు.