former heroine
-
Meenakshi Seshadri: అరవైలోనూ ఇరవై!
నృత్యానికి వయసు అడ్డు కాదని మరోసారి నిరూపించింది మాజీ బాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. 60 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన క్లాసికల్ డ్యాన్స్ కొరియోగ్రఫీతో నెటిజనులను ఆకట్టుకుంది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. క్లిష్టమైన ఫుట్‌వర్క్, హావభావాల వ్యక్తీకరణతో నెటిజనులను ఆకట్టుకుంది. ఆమె కాలాతీత అందం, క్లాసికల్ డాన్స్ పట్ల నిబద్ధతకు అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 1980లలో హీరో, మేరీ జంగ్, దామినిలాంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి భర్త, బిడ్డలతో అమెరికాలో స్థిరపడింది. అక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ ప్రారంభించి భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలను నేర్పించేది. ఆన్–స్క్రీన్ మీద కనిపించనప్పటికీ ఈ అందాల నటి సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటోంది. ‘అప్పుడు–ఇప్పుడూ’ అనే కాప్షన్‌తో పాత, కొత్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. -
భక్తురాలిగా మారిన హీరోయిన్?
హీరో హీరోయిన్లలో భక్తి పాలు ఒకింత ఎక్కువే ఉంటుంది. సినిమా ముహూర్తం షాట్ దగ్గర నుంచి విడుదలకు ముందు తిరుపతి వెళ్లి స్వామికి మొక్కుకోవడం వరకు చాలా సందర్భాలలో నటీనటుల్లో పరమ భక్తులను మనం చూస్తుంటాం. ఇదే కోవలో.. ప్రస్తుతం సినిమాల్లో నటించడం మానేసి, దర్శకత్వం లాంటి బాధ్యతలలో మునిగి తేలుతున్న అలనాటి హీరోయిన్ రేణు దేశాయ్ కూడా ప్రస్తుతం కొంతవరకు భక్తిమార్గంలో నడుస్తున్నారు. తాను మరీ పరమ భక్తురాలిని అయితే కాదు గానీ.. ఉదయాన్నే లేచి గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటే.. చాలా ప్రశాంతంగా ఉంటుందని చెబుతోంది. సోమవారం పొద్దున్నే గుడికి వెళ్లొచ్చిన తర్వాత తీసిన ఫొటోను ఆమె ట్వీట్ చేసింది. దీన్ని చూస్తే.. హీరోలు, హీరోయిన్లలో ఉండే భక్తిభావం ఎంత ఉందో తెలుస్తుంది. I am not a very religious person but an early morning darshan gets a certain peace & tranquility to the soul always pic.twitter.com/XGGFc9kl8F — renu (@renuudesai) October 25, 2015