'మోదీ అప్పట్లోనే లేఖ రాశారు'
దుబాయ్ : ఐపీఎల్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మాజీ చైర్మన్ లలిత్ మోదీ తమకు 2013లో ఓ మెయిల్ (లేఖ) పంపాడని ఐసీసీ ఆదివారం వెల్లడించింది. ముగ్గురు ఆటగాళ్లు ఫిక్సింగ్ కు పాల్పడ్డారని ఆ మెయిల్ లో లలిత్ ఆరోపించినట్లు ఐసీసీ వివరించింది. ప్రస్తుతం లండన్ లో ఉంటున్న మోదీ ఐసీసీ చీఫ్ రిచర్డ్సన్ కు తను పంపిన లేఖను ట్విట్టర్ ఖాతాలో శనివారం పోస్ట్ చేసిన నేపథ్యంలో ఐసీసీ ఈ విషయాన్ని వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
టీమిండియాకు చెందిన ఇద్దరు క్రికెటర్లు, వెస్టిండీస్ కు చెందిన ఆటగాడు ఓ వ్యాపారవేత్తతో డబ్బులు తీసుకున్నట్లు తెలపడం ఈ లేఖ సారాంశం. అయితే ఆటగాళ్ల ఫిక్సింగ్ విషయాలను బీసీసీఐ అవినీతి నిరోధక శాఖకు అప్పట్లోనే అందించినట్లు ఐసీసీ తన అధికారిక వెబ్ సైట్ పోస్ట్ లో పేర్కొంది.