'మోదీ అప్పట్లోనే లేఖ రాశారు' | receiving Lalit Modi's e-mail in 2013, says ICC officials | Sakshi
Sakshi News home page

'మోదీ అప్పట్లోనే లేఖ రాశారు'

Published Sun, Jun 28 2015 7:52 PM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

'మోదీ అప్పట్లోనే లేఖ రాశారు'

'మోదీ అప్పట్లోనే లేఖ రాశారు'

దుబాయ్ : ఐపీఎల్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మాజీ చైర్మన్ లలిత్ మోదీ తమకు 2013లో ఓ మెయిల్ (లేఖ) పంపాడని ఐసీసీ ఆదివారం వెల్లడించింది. ముగ్గురు ఆటగాళ్లు ఫిక్సింగ్ కు పాల్పడ్డారని ఆ మెయిల్ లో లలిత్ ఆరోపించినట్లు ఐసీసీ వివరించింది.    ప్రస్తుతం లండన్ లో ఉంటున్న మోదీ ఐసీసీ చీఫ్ రిచర్డ్సన్ కు తను పంపిన లేఖను ట్విట్టర్ ఖాతాలో శనివారం పోస్ట్ చేసిన నేపథ్యంలో ఐసీసీ ఈ విషయాన్ని వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

టీమిండియాకు చెందిన ఇద్దరు క్రికెటర్లు,  వెస్టిండీస్ కు చెందిన ఆటగాడు ఓ వ్యాపారవేత్తతో డబ్బులు తీసుకున్నట్లు తెలపడం ఈ లేఖ సారాంశం. అయితే ఆటగాళ్ల ఫిక్సింగ్ విషయాలను బీసీసీఐ అవినీతి నిరోధక శాఖకు అప్పట్లోనే అందించినట్లు ఐసీసీ తన అధికారిక వెబ్ సైట్ పోస్ట్ లో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement