నాలుగు తరాల పుష్కర స్నానం
అమరావతి (పెదకూరపాడు) : కుటుంబ బంధాలు మరి చిన ఈ రోజుల్లో నాలుగు తరాల వారు ఒక చోటకు చేరి పుష్కర స్నానం ఆచరించడం అరుదుగా కనిపిస్తుంది. అమరావతికి చెందిన వెంకట కోటయ్య కుటుంబానికి చెందిన నాలుగు తరాల వారు అమరావతిలోని అమరేశ్వర ఘాట్ లో పుష్కర స్నానం ఆచరించారు. హైదరాబాద్,అమెరికా, డెన్మార్క్, దుబాయ్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన నాలుగు తరాల వారు ఒక చోటకు చేరి పుష్కర స్నానం ఆచరించడం విశేషం.