నాలుగేళ్ల బాలుడిపై బంధువు దాష్టీకం
విశాఖ గాజువాకలో దారుణం జరిగింది. నాలుగేళ్ల బాలుడిపై సమీప బంధువు దాష్టీకానికి పాల్పడ్డాడు. అతడి చెయ్యి విరగ్గొట్టి, మర్మాంగంపై వాతలు పెట్టాడు. దీనిపై గుడివాడ పోలీసులకు బాలుడి తల్లి ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసుల నుంచి స్పందన కొరవడటంతో ఆమె 'సాక్షి'ని ఆశ్రయించారు.
కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన మన్నం లక్ష్మి రెండేళ్లుగా భర్తకు దూరంగా విశాఖపట్నంలో ఉంటున్నారు. ఆమెకు ఆశ్రయం ఇస్తామని చెప్పిన సమీప బంధువు.. తనలోని శాడిజాన్ని బాలుడిపై చూపించాడు. బాలుడి చెయ్యి విరగ్గొట్టి, వాతలు పెట్టి ప్రత్యక్ష నరకం చూపించాడు.